twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    40 మందిని చంపేశారు, అయినా పాక్‌కు అనుకూలంగా కామెంట్లు.. షో నుంచి తన్ని తరిమేయండి!

    |

    ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రోజు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంట్లో పాక్ ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. ఆత్మహుతి దాడులు జరిపి 40 మంది భారత జవాన్లని పొట్టనబెట్టుకున్నారు. దేశం కోసం ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని, పాక్ చర్యలని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. వీర జవానులకు నివాళులు అర్పిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు అందరూ ఈ ఘటనపై స్పందిస్తూ మరణించిన జవానులకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ కాస్త భిన్నంగా స్పందించిన నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు.

    సిద్దూ ఏమన్నాడంటే

    సిద్దూ ఏమన్నాడంటే

    ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనవాళ్ళు పాకిస్తాన్ తో చర్చలు జరపాలి. ఇండియా, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు శాశ్వత పరిష్కారం కనుగొనాలి అని సిద్దూ హిత బోధ చేశారు. వాళ్ళు విషం చిమ్మారుకదాని మన కూడా అదే పని చేయాలా అని అన్నారు. కొంత మంది ఉగ్రవాదులు చేసిన పనికి పాకిస్తాన్ దేశాన్ని మొత్తం నిందించాలా అంటూ పాక్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.

    భగ్గుమంటున్న నెటిజన్లు

    భగ్గుమంటున్న నెటిజన్లు

    ఉగ్ర చర్యని ఖండించిన కూడా, ఇలాంటి దాడుల్ని ప్రోత్సహిస్తున్న పాక్ తీరుని తప్పుబట్టకుండా ఆ దేశానికీ అనుకూలంగా సిద్దూ వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అసలు సిద్దూలో కొంచెమైనా దేశభక్తి ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా సిద్దూ మాట్లాడుతూ తాను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో స్నేహాన్ని కోరుకుంటున్నాని సిద్దూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

    తన్ని తరిమేయండి

    తన్ని తరిమేయండి

    సిద్దూ ప్రస్తుతం సోని టివిలో ప్రసారం అవుతున్న కపిల్ శర్మ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సోని ఛానల్ సిద్దూని కపిల్ శర్మ షో నుంచి తన్ని తరిమేయాలి. అప్పటి వరకు ఎవరూ సోని టివి చూడొద్దు అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ ని ప్రేమిస్తున్న సిద్ధుని బాయ్ కాట్ చేయండి. కపిల్ శర్మ షో ఎవరూ చూడొద్దు. కనీసం అప్పుడైనా మనం మన సైనికుల్ని గౌరవించిన వాళ్ళం అవుతాం అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

    ఇండియా నుంచి సంపాదన

    ఇండియా నుంచి సంపాదన

    కపిల్ శర్మ, సిద్దు ఇద్దరూ ఇండియా నుంచి సంపాదన పొందుతున్నారు. కపిల్ శర్మ షోని భారతీయులు చూడడం వలనే ఆదాయం వస్తోంది. కానీ మీరు మాత్రం పాక్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. మా ఫ్యామిలీ మొత్తం నేటి నుంచి కపిల్ శర్మ షో చూడడం మానేస్తున్నాం అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. సిద్దూపై వ్యక్తిరేకత ఎక్కువవుతున్న నేపథ్యంలో తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతాడో లేదో చూడాలి.

    English summary
    Pulwama terror attack: Netizens demand Navjot Singh Sidhu's removal from Kapil Sharma Show
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X