»   » లీకవుతున్న నిజాలు: టీవీ నటి ప్రత్యూషను వ్యభిచారం చేయాలని...?

లీకవుతున్న నిజాలు: టీవీ నటి ప్రత్యూషను వ్యభిచారం చేయాలని...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు ప్రధాన కారణం అతడి ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ కారణమని ముందు నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యూష విషయంలో రాహుల్ చేసిన దారుణాలు కొన్ని ఇప్పటికే బయట పడగా, తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆమెపై వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు ముందు వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంబాషణ వివరాలను 'ముంబై మిర్రర్' పత్రిక బట్టబయలు చేసింది.

వారి మధ్య జరిగిన సంబాషణ బట్టి.... ప్రత్యూషను వ్యభిచారం చేయాలని రాహుల్ ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఆ టేపులకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

నన్ను నేనే అమ్ముకోవడానికి కాలేదు

నన్ను నేనే అమ్ముకోవడానికి కాలేదు

నన్ను నేను అమ్ముకోవడానికి ఇండస్ట్రీకి రాలేదు. ఆర్టిస్టుగా పని చేయడానికి, నటిగా తన టాలెంట్ నిరూపించుకోవడానికే ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు నన్ను ఈ రోజు ఎక్కడ ఉంచావ్? అంటూ ఫోన్ సంబాషణలో రాహుల్ మీద ప్రత్యూష మండి పడింది. ఆమె మాటల్లో.... రాహుల్ వ్యభిచారానికి ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టం అవుతోంది.

నా పేరు చెడ గొట్టావ్

నా పేరు చెడ గొట్టావ్

ఈ సంబాషణలో.... రాహుల్ మీద ప్రత్యూష తీవ్రంగా మండి పడింది. ‘రాహుల్... నీకు తెలియదు నేనెంత బాధ పడుతున్నానో, నువ్వు సెల్పిష్, నా పేరు చెడగొట్టావ్. జనం నా గురించి, నా తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడకుంటున్నారు' అంటూ ఆమె తన ఆవేదనను వెల్లగక్కింది.

నొక్కి చెప్పిన ప్రత్యూష తరుపు న్యాయవాది

నొక్కి చెప్పిన ప్రత్యూష తరుపు న్యాయవాది

వ్యభిచారం చేయాలని రాహుల్... ప్రత్యూష మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. ప్రత్యూష చివరి సారిగా ఫోన్లో మాట్లాడినపుడు వ్యభిచారం అనే పదం వాడిందని ఆమె తరుపు న్యాయవాది నీరజ్ గుప్తా ఆరోపించారు.

రాహుల్ వాదన మరోలా

రాహుల్ వాదన మరోలా

అయితే రాహుల్ వాదన మరోలా ఉంది. ఆమె తల్లిదండ్రులే ప్రత్యూష మీద ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఒత్తిడి తెచ్చారని, డబ్బు కోసమే ప్రత్యూష తల్లిదండ్రులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గతంలో ఆరోపించాడు.

ప్రత్యూష బెనర్జీ

ప్రత్యూష బెనర్జీ

ప్రత్యూష బెనర్జీ పాపులర్ హిందీ సీరియల్ 'బాలికా వధు'లో ఆనంది పాత్ర పోషించింది. ఇదే సీరియల్ 'చిన్నారి పెళ్లి కూతురు' పేరుతో తెలుగులో డబ్బింగ్ వెర్షన్ ప్రసారం అయింది. ముంబైలోని తన నివాసంలో ఏప్రిల్ 1న ప్రత్యూష ఉరి వేసుకుని ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడన సంగతి తెలిసిందే.

English summary
Pratyusha Banerjee's last conversation with her boyfriend Rahul Raj Singh have just emerged. Mumbai Mirror has accessed a copy of the transcript of the telephone call, which is the last time she spoke to anyone, says Neeraj Gupta, the advocate for her parents, Soma and Shankar Banerjee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu