For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: బిగ్ బాస్‌లోకి బోల్డ్ బ్యూటీ.. పొరపాటున కన్ఫార్మ్ చేసిన మాజీ విన్నర్

  |

  ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరకు పరిచయం అయినా.. చాలా తక్కువ సమయంలోనే భారీ రెస్పాన్స్‌ను అందుకుని సూపర్ హిట్ షోగా మారిపోయింది బిగ్ బాస్. ఈ క్రమంలోనే మరే భాషలోనూ లేని విధంగా టీఆర్పీ రేటింగ్‌ను సైతం దక్కించుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. దీంతో షో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు సీజన్లను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు.

  ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెడుతున్నారు. ఇందులోకి ఓ బోల్డ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తున్నట్లు మాజీ విన్నర్ పొరపాటున కన్ఫార్మ్ చేశాడు. ఆ సంగతులేంటో మీరూ చూడండి!

   బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌తో రెడీగా

  బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌తో రెడీగా

  దేశంలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో మాత్రమే బిగ్ బాస్ షోకు ఆదరణ దక్కుతోంది. దీంతో నిర్వహకులు ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను తీసుకు రాబోతున్నారు. దీనికి 'బిగ్ బాస్ నాన్ స్టాప్' అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. దీన్ని కూడా నాగార్జున హోస్ట్ చేస్తాడు.

  కొత్త షోలో శ్రీముఖి ఊహించని పని: అక్కడ చేయి వేయించుకుని మరీ అతడితో!

  అందులో 24 గంటల ప్రసారం

  అందులో 24 గంటల ప్రసారం

  ఇప్పటికే హిందీ, తమిళంలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను పరిచయం చేశారు. ఆ రెండు చోట్లా దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందనే దక్కిందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు తెలుగులోకి తీసుకు వస్తున్నారు. అయితే, దీన్ని టీవీలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు అందులో ప్రసారం చేస్తారన్న విషయం తెలిసిందే.

  డేట్... రోజులు.. సెలెబ్రిటీలిలా

  డేట్... రోజులు.. సెలెబ్రిటీలిలా

  ఎంతో ప్రయోగాత్మకంగా రానున్న తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 26వ తేదీ, సాయంత్రం 6 గంటల నుంచి నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నట్లు ప్రోమో ద్వారా తెలిపారు. ఇది మొత్తం 85 రోజుల పాటు సాగనుందట. ఇక, ఇందులో 18 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లు క్యారంటైన్‌లోకి కూడా వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.

  బుల్లి నిక్కరుతో సమంత రచ్చ: బాటమ్ నుంచి అందాలన్నీ చూపిస్తూ యమ హాట్‌గా!

  18మందిలో మాజీలే ఎక్కువగా

  18మందిలో మాజీలే ఎక్కువగా

  వచ్చే శనివారమే అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ కోసం ప్రేక్షకులంతా వేయి కళ్లతో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇక, ఇందులో 18 మంది కంటెస్టెంట్లు వస్తుండగా.. అందులో చాలా మంది మాజీ కంటెస్టెంట్లే ఉండబోతున్నారని తెలిసింది. ఇప్పటికే కొన్ని పేర్లూ బయటకొచ్చాయి.

  బిగ్ బాస్ షోలోకి బోల్డ్ బ్యూటీ

  బిగ్ బాస్ షోలోకి బోల్డ్ బ్యూటీ

  సరికొత్త హంగులతో ఎంతో ప్రయోగాత్మకంగా ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు సరికొత్త ప్లాన్లు చేస్తున్నారు. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపికపై బాగా ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే బోల్డ్ బ్యూటీ, మాజీ కంటెస్టెంట్‌ అషు రెడ్డిని కూడా తీసుకున్నారని తెలిసింది.

  హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!

  అలా కన్ఫార్మ్ చేసిన రాహుల్

  అలా కన్ఫార్మ్ చేసిన రాహుల్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అషు రెడ్డి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ, ఆమె ఇప్పుడు యాంకర్‌గా 'హ్యాపీ డేస్' సహా పలు షోలతో బిజీగా ఉంది. దీంతో ఈ బ్యూటీ ఎంట్రీ ఉండకపోవచ్చన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్‌ ఆమె బిగ్ బాస్ ఎంట్రీని పరోక్షంగా కన్ఫార్మ్ చేశాడు.

  కవర్ చేసుకుంటూ రిప్లై ఇచ్చి

  కవర్ చేసుకుంటూ రిప్లై ఇచ్చి

  తాజాగా రాహుల్ సిప్లీగంజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఆల్ ది బెస్ట్ అషు.. దేనికి చెప్పానో నువ్వే ఆలోచించుకో' అంటూ బిగ్ బాస్ షోలోకి వెళ్తుందని పరోక్షంగా చెప్పాడు. దీనికామె 'నువ్వు ఎల్లప్పుడూ నా మంచి కోరుకునే వ్యక్తివి కాబట్టి.. నన్ను విష్ చేశావేమో' అని కవర్ చేస్తూ రిప్లై ఇచ్చింది. కానీ, అందరికీ ఆమె ఓటీటీ సీజన్‌లోకి ఎంట్రీ ఇస్తుందన్న విషయం అర్థం అయింది.

  English summary
  Bigg Boss Makers Will OTT Season From February 26th. Now Rahul Sipligunj Confirms Ashu Reddy Bigg Boss Non Stop Entry
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X