Just In
- 9 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 9 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 10 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 11 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్న రాహుల్: ఏకంగా ఆమెకు మద్దతు ప్రకటించాడు!
సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి తెలుగు రాష్ట్రాల్లోనే బిగ్గెస్ట్ సెలెబ్రిటీలలో ఒకడిగా మారిపోయాడు రాహుల్ సిప్లీగంజ్. దీనికి కారణం అతడు బిగ్ బాస్ షోలో విజేతగా నిలవడమేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ విషయంలో తరచూ ఏదో ఒక రకంగా స్పందిస్తూ హైలైట్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ఓ కంటెస్టెంట్ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. నిన్న మొన్నటి వరకూ ఒకరికి సపోర్ట్ చేసిన రాహుల్.. ప్రస్తుతం ఓ లేడీ కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించాడు. ఇంతకీ ఎవరామె.? ఆ వివరాలు మీకోసం!

రెండింట్లోనూ సక్సెస్.. యూత్ ఐకాన్
రాహుల్ సిప్లీగంజ్ కెరీర్ ఆరంభంలోనే సూపర్ హిట్ సాంగ్స్‌తో హాట్ టాపిక్ అయ్యాడు. మాస్, క్లాస్, రొమాంటిక్ ఇలా అన్ని జోనర్ల పాటలతో మెప్పించాడు. అదే సమయంలో ప్రైవేట్ ఆల్బమ్‌లతో హైలైట్ అయ్యాడు. ఇప్పటికే ఎన్నో రకాల పాటలను ఆలపించిన రాహుల్.. తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఐకాన్ అయిపోయాడు. ఫలితంగా ఫాలోయింగ్ కూడా భారీగా పెంచుకున్నాడు.

బిగ్ బాస్ విజయం కంటే అదే ఎక్కువ
బిగ్ బాస్ షోలో విజయం సాధించిన దానికంటే.. అందులో పునర్నవి భూపాలంతో కెమిస్ట్రీని పండించి హైలైట్ అయ్యాడు రాహుల్ సిప్లీగంజ్. తరచూ ఆమెతో రొమాంటిక్‌గా మాట్లాడడంతో పాటు హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయాడు. తద్వారా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇది కూడా రాహుల్‌ను బిగ్ బాస్ విజేతను చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిదని చెప్పొచ్చు.

కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన రాహుల్
బిగ్ బాస్ మూడో సీజన్‌లో విజయం సాధించిన తర్వాత రాహుల్ సిప్లీగంజ్ వరసగా ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇప్పటికే యాక్టర్‌గా ఓ సినిమాలోనూ అవకాశాన్ని అందుకున్న అతడు.. ఎన్నో సాంగ్స్ పాడి సత్తా చాటాడు. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌కు సంబంధించిన ప్రసారం అవుతోన్న ‘బిగ్ బాస్ బజ్'కు హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఆకట్టుకుంటున్నాడు.

మొదట నోయల్.. ఆ తర్వాత అభిజీత్
రాహుల్ సిప్లీగంజ్‌ను బిగ్ బాస్ విజేతగా నిలపడంలో సింగర్ నోయల్ పాత్ర మరువలేనిది. ఇక, నాలుగో సీజన్‌లో అతడు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మారిపోయింది. రాహుల్ అతడికే మద్దతు తెలపడంతో పాటు గెలిపించే బాధ్యతనూ తీసుకున్నాడు. కానీ, నోయల్ అనారోగ్యంతో షో నుంచి బయటకు రావడంతో అభిజీత్‌కు సపోర్ట్ చేయడం ప్రారంభించాడాతను.

యూటర్న్ తీసుకున్న బిగ్ బాస్ విన్నర్
అభిజీత్‌కు బహిరంగంగానే మద్దతు ప్రకటించాడు రాహుల్. అతడు నామినేట్ అయిన ప్రతి వారం ఓట్ చేసి, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసేవాడు. ఆ తర్వాత సోహెల్‌కు సైతం సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇక, ఇదే షోలో కంటెస్టెంట్‌గా ఉన్న మోనాల్ ఆటతీరును గతంలో విమర్శించిన రాహుల్.. ఇప్పుడామె విషయంలో యూటర్న్ తీసుకున్నాడు.

ఏకంగా ఆమెకు మద్దతు ప్రకటించాడు
మోనాల్ గజ్జర్ ఈ వారం నామినేషన్స్ ఉంది. దీంతో ఆమెకు ఓట్ చేయాలని చెబుతూ రాహుల్ సిప్లీగంజ్ తన ఫ్యాన్స్‌ను కోరాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘నా అభిప్రాయం ప్రకారం ఈ వారం నామినేట్ అయిన వారిలో మోనాల్ గజ్జర్‌కు సేవ్ అయ్యే అర్హత ఉంది. కాబట్టి దయచేసి అందరూ ఆమెకు ఓట్ చేయండి' అంటూ స్టోరీలో పెట్టుకున్నాడు.