Don't Miss!
- News
Viral Video: బెల్ట్ తో కొట్టుకుంటూ బర్త్ డే సెలబ్రెషన్స్.. అదీ ప్రభుత్వ ఆస్పత్రిలో.. వీడియో వైరల్..
- Lifestyle
మన జాతీయ జెండా ఏర్పడటం వెనుక ఉన్న చారిత్రక కథ మీకు తెలుసా?
- Finance
పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు చెక్ చేశారా..?
- Automobiles
హోండా ఎంతో సస్పెన్స్ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ Honda CB300F
- Sports
Chess Olympiad 2022 ముగింపు వేడుకలకు ధోనీ.. టాప్‌లో హంపీ టీమ్
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
Bigg Boss Tamil 5 Winner: విజేతగా నిలిచిన ప్రముఖ నటుడు.. తెలుగు అమ్మాయికి ఎన్నో స్థానమంటే!
రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఉత్తరాది వాళ్లకు ఎప్పుడో పరిచయం అయినా.. దక్షిణాదిలోకి మాత్రం ఆలస్యంగానే వచ్చింది. ఇలా ఐదేళ్ల క్రితం తమిళ బుల్లితెరపైకి సైతం ఈ షో వచ్చేసింది. మిగిలిన భాషలతో పోలిస్తే అక్కడ మాత్రం దీనికి వ్యతిరేకత చాలానే వచ్చింది.
అయినప్పటికీ నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ఎన్నో మలుపులతో సాగిన ఈ సీజన్‌లో ఐదుగురు ఫైనలిస్టుగా ఉండగా.. అందులో ప్రముఖ నటుడు రాజు జయమోహన్ విజయం సాధించాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం!

నాలుగు సీజన్లు.. అలాంటి వాటితో
తమిళంలో బిగ్ బాస్ నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే, మొదటి సీజన్‌లో ఓవియా అనే నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఆ తర్వాత మూడో సీజన్‌లోనూ ఇదే తరహాలో 'ఒరుకల్ ఒరు కన్నాడీ' ఫేం మధుమిత చాకుతో మణికట్టును కోసుకుంది. ఆ తర్వాత కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇలా ఎన్నో ఘటనలు కనిపించాయి.
బట్టలున్నా లేనట్లే రాశీ ఖన్నా ఫోజులు: తొలిసారి ఇంత హాట్‌గా కనిపించిన హీరోయిన్

అనుమానాల మధ్యన ఐదో సీజన్
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన తమిళ బిగ్ బాస్ షో ఐదో సీజన్ ప్రారంభంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతోన్న కారణంగా ఇది మొదలవుతుందో లేదో అన్న సందిగ్ధత నెలకొంది. ఇలాంటి సమయంలో గత అక్టోబర్ 3న సీనియర్ హీరో కమల్ హాసన్ హోస్టింగ్‌తో ఐదవ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది.

ఫినాలేలో ఐదుగురు కంటెస్టెంట్లు
సరికొత్త టాస్కులు, ఊహించని సర్‌ప్రైజ్‌లు, కంటెస్టెంట్ల గొడవలు సహా ఎన్నో ఆసక్తికర పరిణామాల నడుమ బిగ్ బాస్ ఐదో సీజన్ రంజుగా సాగింది. ఇందులో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. ఐదుగురు సభ్యులు రాజు జయమోహన్, ప్రియాంక దేశ్‌పాండే, పావనీ రెడ్డి, నిరూప్ నందకుమార్, ఆమిర్లు టాప్-5కి చేరుకుని.. టైటిల్ వేటకు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు.
పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్: ఒక్కసారిగా బెడ్ మీద అలా కనిపించడంతో!

అట్టహాసంగా ఫినాలే.. ఆ హీరో రాక
దాదాపు పదిహేను వారాల పాటు ప్రేక్షకులను ఫిదా చేసిన తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్ గత ఆదివారంతో ముగిసింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో మాజీ కంటెస్టెంట్ల ఎంట్రీ.. కమల్ హాసన్ స్టైలిష్ హోస్టింగ్‌తో ఆకట్టుకున్నారు. దీనికి కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకునే సాగింది.
|
ఐదో సీజన్ విన్నర్‌గా నిలిచిన రాజు
బిగ్ బాస్ తమిళం ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ఐదుగురు సభ్యులు వచ్చారు. అందులో ఆరంభం నుంచి తనదైన స్టాండప్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన రాజు జయమోహన్ విజేతగా నిలిచాడు. అతడికి హోస్ట్ కమల్ హాసన్ బిగ్ బాస్ టైటిల్‌తో పాటు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీని అందించాడు. ప్రముఖ యాంకర్ ప్రియాంక దేశ్‌పాండే ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచారు.
బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!

తెలుగు అమ్మాయికి మూడో స్థానం
తమిళంలో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఐదో సీజన్‌లో తెలుగు అమ్మాయి 'లజ్జ' మూవీ ఫేం పావనీ రెడ్డి కూడా పాల్గొంది. ఈమె కూడా ఆరంభం నుంచి ఆకట్టుకునే ఆటతో ఫినాలేకు చేరుకుంది. అయితే, ఆమె మాత్రం మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమిర్ నాలుగో స్థానంలో, నిరూప్ ఐదో స్థానంలో నిలిచారు. అయినప్పటికీ వీళ్లంతా చాలా ఫేమస్ అయ్యారు.