»   » రామ్ చరణ్, రంభ..మధ్యలో చిరంజీవి , అదిరిందంతే

రామ్ చరణ్, రంభ..మధ్యలో చిరంజీవి , అదిరిందంతే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మళ్లీ మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫాంలో కి వచ్చేసారు. ఓ ప్రక్క వి వి వినాయిక్ దర్శకత్వంలో తన 150వ సినిమాను శరవేగంగా పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టిన చిరంజీవి తన సురేంద్రరెడ్డి దర్సకత్వంలో 151 చిత్రానికి రెడీ అవుతున్నారు, అదే సమయంలో చేసిన టీవి తెరంగ్రేటం కు కూడా మంచి స్పందన వస్తోంది. తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్ కు చిరంజీవి వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ దుమ్ము రేపుతున్నారు.

గత మూడు సీజన్లలో వ్యాఖ్యతగా స్టార్ హీరో నాగార్జున వ్యవహరించగా ఈ నాలగో సీజన్లో మాత్రం ఆ బాధ్యతను మెగాస్టార్ తీసుకున్నాడు. మా టివీలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం క్రేజ్ తో కూడిన గెస్ట్ లతో ఆసక్తి రేపుతోంది. తాజాగా ఈ షో కు వచ్చిన గెస్ట్ లు హాట్ టాపిక్ గా మారారు. ఎవరా గెస్ట్ లు అంటే...

Rambha and Ram Charanto grace In MEK

'కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టినవాడు మీతో కోటి గెలిపించేందుకు వస్తున్నాడు' అంటూ మెగాస్టార్ నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది రంభ. అయితే ఆ క్రేజ్ ని రెట్టింపు చేయటానికి ఎవరితో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిందో తెలుసా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎంఈకేలో పాల్గొంది రంభ.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ మెగాభిమానులను పండగ చేసుకునేలా చేస్తోంది. ముఖ్యంగా మాస్ రగ్గడ్ లుక్ లో రామ్ చరణ్.. లేట్ ఫార్టీస్ లోనూ వయస్సు సగానికి తగ్గినట్లు కనపడుతున్న రంభ... హోస్ట్ గా సూపర్ స్టైల్ గా చిరంజీవి.. ఈ కాంబో చూస్తూంటే సినిమా చేస్తే బాగుండును అనిపిస్తోంది కదూ.

ఇదిలా ఉంటే...'ఖైదీ నెంబర్ 150'తో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎంఈకే షోకు రెస్పాన్స్ అదిరిపోతుందని టీవి ఛానెల్ వాళ్లే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా భావించారు. దానికి తోడు ..ఈ షో ఆరంభంలోనే నాగార్జున గెస్ట్ గా విచ్చేశాడు. ఒక పార్టిసిపెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లాడు. అయినా ఈ ప్రోగ్రాంకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదనే విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.

ఈ షో ప్రసారమైన వారంలో టీఆర్పీ రేటింగ్స్ లిస్టులోనూ 'ఎంఈకే'కు టాప్ ప్లేస్ లో ఉంటుందనుకుంటే అలాంటిదేమీ దక్కలేదు. అసలు టాప్-5లోనే ఎంఈకే లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమైంది. బార్క్ రేటింగ్స్ ప్రకారం గత వారం 'జనతా గ్యారేజ్' ప్రిమియర్ షో అగ్రస్థానంలో ఉంటే.. తర్వాతి నాలుగు స్థానాల్ని టీవీ సీరియల్స్ దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చాయి.

English summary
Ram Charan and Rambha will soon be seen on the hot seat in an upcoming episode of Meelo Evaru Koteeswarudu. The quiz show, which is currently in the foruth season, is being hosted by Chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu