బట్టలు విప్పుకొని తిరగాలా? పికిల్ బేబీ రమ్య ఫైర్
Ramya Moksha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి వారం కొత్త ట్విస్టులు, ఎలిమినేషన్లు ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తున్నాయి. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వెళ్లిన "పచ్చళ్ల పాప" రమ్య మోక్ష మాత్రం కేవలం రెండు వారాలకే ఎలిమినేట్ కావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఈ షాక్ ఎలిమినేషన్ తర్వాత రమ్య తనదైన స్టైల్‌లో బిగ్ బాస్ హౌస్ పై, నెగెటివ్ కామెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాజాగా సోషల్ మీడియాలో రమ్య రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె తనపై వచ్చిన విమర్శలు, నెగెటివ్ కామెంట్స్ పై ఘాటుగా స్పందించింది. "ఏంటి ఇప్పుడే వెళ్లావు, అప్పుడే వచ్చావా?" అంటూ కామెంట్లు చేస్తున్న వాళ్లకు రమ్య గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ - "అవును.. తొందరగానే వచ్చాను. కానీ, మంచి డబ్బుతో, మంచి ఫేమ్‌తో వచ్చాను. బిగ్ బాస్ నాకు ఏ విధంగా నష్టం చేయలేదు. నా లైఫ్‌లో లాస్ ఏమీ లేదు. పైగా ఇప్పుడు కొత్త ఆఫర్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ వల్ల నాకు పాజిటివ్ రీచ్ వచ్చింది. మీరు మాత్రం కామెంట్లలో నెగెటివిటీ చూపిస్తూ అక్కడే ఆగిపోయారు. కానీ నేను నా పనిలో హ్యాపీగా ఉన్నాను," అంటూ తాను సంతోషంగా ఉన్నానని రమ్య చెప్పింది.

అంతేకాదు, బిగ్ బాస్ షోలో జరిగిన విషయాల గురించి కూడా రమ్య ఓ క్లారిటీ ఇచ్చింది. "అమ్మ ఇంకా మాట్లాడుతావ్ అంటున్నారు కదా.. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగిందో పూర్తి వీడియోలో చెప్పేశాను. దానికి పైగా మరేం వివరణ అవసరం లేదు. చాలామంది నాకు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు కానీ కొంతమంది మాత్రం నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. నన్ను కించపరుస్తూ కామెంట్లు చేస్తున్నారు. అలాంటివారికి నేను ఏ విధంగా రియాక్ట్ అవ్వను. ఎవరు ఏమంటారో వాళ్ల ఇష్టం. నేను నా పంథాలో సాగుతాను," అంటూ స్పష్టంచేసింది.
రమ్య మాటల్లో ఒక ఆత్మవిశ్వాసం, ఒక రియాలిటీ కనిపించింది. "ఈ షో ద్వారా చాలామంది నన్ను నిజంగా అర్థం చేసుకున్నారు. నేను ఎలా ఉంటానో, నా అటిట్యూడ్ ఏంటో చూశారు. ఎవరినీ దెబ్బతీసే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ ఎక్కడ సరిగా లేదనిపిస్తే అక్కడ చెప్పాను. అందుకే నేను నెగెటివ్ అయ్యాను," అంటూ తాను నిజాయితీగా ఆడినట్టు తెలిపింది.
అలాగే తన డ్రెస్ సెన్స్‌పై వచ్చిన కామెంట్లకు కూడా రమ్య తగిన సమాధానం ఇచ్చింది. "నేను బిగ్ బాస్ షోలోకి వెళ్తే ఎక్స్పోజింగ్, లవ్ ట్రాక్స్ ఉంటాయని చాలామంది అనుకున్నారు. అంతేకాదు నా డ్రెస్‌ల గురించి కూడా చాలా కామెంట్లు చేశారు. అవునండి, నాకు కంఫర్ట్‌గా అనిపించే డ్రెస్సులు వేసుకుంటాను. నేను ఇంట్లో ఎలా ఉంటానో, బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఉన్నాను. కానీ నా డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తున్నారు. అన్ని విప్పుకొని తిరగాలా ఏంటి? రీల్స్‌లో ఇలా వేసుకున్నావు, అలా వేసుకున్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు. నేను పాటకు తగ్గట్టు, కాన్సెప్ట్‌కు తగ్గట్టు డ్రెస్ వేసుకుంటాను," అంటూ స్పష్టం చేసింది.
రమ్య తన వ్యాఖ్యల్లో మరోసారి స్మార్ట్‌గా రియాలిటీని చెప్పింది "గుడికి వెళ్తే సారీ కడతాను. బయట పార్టీకి వెళ్తే జీన్స్ వేసుకుంటాను. ఏ సిట్యుయేషన్‌కి తగినట్టే డ్రెస్ ఉంటుంది కదా! ప్రతిరోజు స్లీవ్‌లెస్, చెడ్డి మిడ్డిలు వేసుకోలేము. ఆ సందర్భానికి తగినట్టే ఉంటుంది. దానికి కూడా ఇంత నెగెటివ్‌గా కామెంట్ చేయడం ఎందుకంటే అర్థం కావడం లేదు," అంటూ రమ్య మోక్ష ఆగ్రహం వ్యక్తం చేసింది.
బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రవర్తన, తన బోల్డ్ నేచర్ కారణంగా రమ్యకు నెగెటివ్ ఓట్లు ఎక్కువగా వచ్చి ఎలిమినేట్ అయినా, ఆమె ఇప్పుడు ఆ క్రిటిసిజం ను పాజిటివ్‌గా తీసుకుంటోంది. "నాకు నెగెటివిటీ కొత్త ఏం కాదు.. ఇది నా లైఫ్‌లో ఎప్పటినుంచో ఉంది. కానీ నేను దానికి లొంగను. నన్ను ఇష్టపడేవాళ్లు ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. బిగ్ బాస్ నాకు కొత్త మార్గం వచ్చింది" అంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం రమ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెటిజన్లు ఆమె ధైర్యానికి, స్పష్టతకు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలపై మళ్లీ వివాదం రేపుతున్నారు. ఏదేమైనా పచ్చళ్ల పాప రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ, ప్రేక్షకుల మదిలో మాత్రం గట్టి ఇంపాక్ట్ చూపించిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











