»   » బిగ్‌బాస్ నుంచి సమీర్‌ ఔట్.. ఎలిమినేట్ చేసిన రానా.. ఆసక్తిగా గులాబీల ఆట

బిగ్‌బాస్ నుంచి సమీర్‌ ఔట్.. ఎలిమినేట్ చేసిన రానా.. ఆసక్తిగా గులాబీల ఆట

Written By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ సో మూడోవారం ఎలాంటి గొడవలు లేకుండానే ప్రశాంతంగా గడిపించిపోయింది. ఊహించిన విధంగానే సమీర్ ఎలిమినేషన్ జరిగిపోయింది. ఎప్పటిలాగా ఎన్టీఆర్ చేతులు మీదుగా ఎలిమినేషన్ ప్రక్రియ జరుగకుండా ఈ సారి బిగ్‌బాస్‌కు వచ్చిన రానా దగ్గుబాటి చేతుల మీదుగా జరుగడం ఈ వారం ప్రత్యేకత. బిగ్‌బాస్ ప్రారంభమై మూడో వారం తర్వాత ఈ వేదిక ద్వారా తొలిసారి ఓ సినిమా ప్రమోషన్ చేసుకోవడం విశేషం. రానా దగ్గుబాటి నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్‌ను బిగ్‌బాస్‌లో నిర్వహించడం గమనార్హం.

బిగ్‌బాస్ హౌస్‌లో రానా

బిగ్‌బాస్ హౌస్‌లో రానా

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ముగ్గురు ఎలిమినేషన్ నామినేట్ నేపథ్యంలో ఆ ప్రక్రియ జరుగక ముందే తన సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చిన రానా బిగ్‌బాస్‌లోకి ప్రవేశించి ఇంటి సభ్యులకు సర్ప్రైజ్ ఇచ్చారు. వారితో కలిసి బిగ్‌బాస్ ఇంటిని అంతా చుట్టి వచ్చాడు రానా.

రానాతో ఫ్రెండ్‌షిప్ డే

రానాతో ఫ్రెండ్‌షిప్ డే

బిగ్‌బాస్ హౌస్‌లో రానా సభ్యులతో కలిసి ఫ్రెండ్‌షిప్ డేను సెలబ్రేట్ చేసుకొన్నాడు. ప్రతీ సభ్యుడికి శుభాకాంక్షలు తెలుపుతూ బిగ్‌బాస్ హౌస్‌మెట్స్‌ను అభినందించారు. వారితో మమేకమై సభ్యుల అనుభవాలను తెలుసుకొన్నారు.

ఆసక్తిగా గులాబీల ఆట

ఆసక్తిగా గులాబీల ఆట

ఈ కార్యక్రమంలో భాగంగా రానా సమక్షంలో బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. ఫ్రెండ్‌షిప్ డే‌ను పురస్కరించుకొని తమ కిష్ణమైన వారికి పసుపు పచ్చ గులాబీ పువ్వు, నచ్చని వారికి నల్ల గులాబీని ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించారు. కొందరు సభ్యులు ఎక్కువగా కొత్తగా వచ్చిన దీక్షాపంత్‌కు, కల్పనకు నల్ల గులాబీలను ఇవ్వడం గమనార్హం.

రానాకు ఇంటిసభ్యుల ఆతిథ్యం

రానాకు ఇంటిసభ్యుల ఆతిథ్యం

బిగ్‌బాస్ గృహంలోకి వచ్చిన రానాకు సభ్యులు గౌరవ అతిథ్యాన్ని ఘనంగా ఇచ్చారు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ధన్‌రాజ్‌ను రానా తన సేవకుడిగా నియమించుకొన్నారు. శివబాలాజీ, దీక్షా పంత్ కలిసి రానా కోసం చికెన్‌తో కూడిన ఆహారం తయారు చేశారు. రానా ఆ రెసిపీని తింటుండగా.. ఎన్టీఆర్ మధ్యలో ఆపి దానిని తన కోసం తప్పించుకొని తిని.. చాలా బాగుంది అని కితాబు ఇచ్చారు.

శివ రిపేర్డ్ చికెన్

శివ రిపేర్డ్ చికెన్

గతంలో కత్తి మహేశ్ చేసిన చికెన్ వంటకానికి కత్తి ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) అని పేరు పెట్టగా.. ఈ సారి శివబాలాజీ చేసిన చికెన్‌ను శివ రిపేర్డ్ చికెన్ (ఎస్ఆర్సీ పేరు పెట్టారు. శివబాలాజీ చేసిన చికెన్‌ను చాలా ఇష్టంగా తినడం కనిపించింది. ఇంటి సభ్యులు వంటలు బాగా చేస్తున్నారని రానా, ఎన్టీఆర్ ప్రశంసించారు.

సమీర్‌ను బయటకు పంపిన రానా

సమీర్‌ను బయటకు పంపిన రానా

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టాలని రానాకు ఎన్టీఆర్ సూచించగా.. ఆ ఇంటిలో ఆ పని చేయలేను. నీ వద్దకు వచ్చే చేస్తాను అని హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన రానా.. సమీర్ పేరు చెప్పి ఎలిమినేట్ చేశాడు. అంతకు ముందు నేనే రాజు నేనే మంత్రి సినిమాలోని ఓ డైలాగ్ చెప్పి సభ్యులను, ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.

సినిమా చూడండి..

సినిమా చూడండి..

ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమా విశేషాలను ఎన్టీఆర్‌తో పంచుకొన్నారు. ప్రేక్షకులకు సినిమా కథ చెప్పి తప్పకుండా సినిమా చూడాలని, చూడకపోతే ఎన్టీఆర్ అభిమానులు ఊరుకొరు అని అన్నారు. అందుకు వెంటనే అందరి అభిమానులు చూస్తారు. సినిమా గొప్ప విజయం సాధించాలి అని ఎన్టీఆర్ ఆకాక్షించారు.

అనుభవాలను పంచుకొన్న సమీర్

అనుభవాలను పంచుకొన్న సమీర్

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ గురైన సమీర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చి మూడువారాల అనుభవాలను పంచుకొన్నాడు. ఆ తర్వాత ఇలాంటి అనుభూతిని ఒక జీవితంలో పంచుకోకపోవచ్చని సమీర్ అన్నాడు. ఈ క్రమంలో సొంత ఇంటి కలను త్వరలోనే సాకారం అవుతుందని సమీర్‌కు ఎన్టీఆర్ భరోసా ఇచ్చాడు. అలా మూడో వారం ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

English summary
Rana special entry in Biggboss as guest. Rana promoted his film Nene Raju Nene Mantri on Biggboss dias. He spent some time in the House with mates. Sameer was eleminated by Rana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu