»   » రానా, చైతూ, సుమంత్ కుమ్మేశారట.. తొలి ఎపిసోడే అదుర్స్..

రానా, చైతూ, సుమంత్ కుమ్మేశారట.. తొలి ఎపిసోడే అదుర్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి, ఘాజీ చిత్రాల తర్వాత రానా దగ్గుబాటి మరో కొత్త అవతారంలో కనిపించనున్నారు. బుల్లితెరపై నంబర్ 1 యారీ అనే ప్రొగ్రాంకు రానా యాంకర్‌గా వ్యవహరిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను ఇటీవల షూట్ చేశారు. మొదటి ఎపిసోడ్‌లో నాగచైతన్య, సుమంత్ పాల్గొన్నారు. ఈ ముగ్గురు సరదా సరదాగా కనిపించి ఎపిసోడ్‌ను కుమ్మేసినట్టు సమాచారం. అనంతరం ఆ ఎపిసోడ్‌లో పాల్గొన్నట్టు హీరో సుమంత్ ఫొటో పెట్టి ట్వీట్ చేశారు.

చైతూ, రానా, సుమంత్ చలాకీగా

చైతూ, రానా, సుమంత్ చలాకీగా

నంబర్ 1 యారీ కార్యక్రమానికి రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్టు ప్రకటించగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులకే రానా అవకాశం ఇవ్వడం అక్కినేని, అటు దగ్గుబాటి అభిమానులకు సంతోషం వేసింది. ఈ కార్యక్రమంలో నాగా చైతన్య, సుమంత్‌, రానా ఒకరికొకరు ఆటపట్టించుకొన్నట్టు తెలుస్తున్నది.

సమంత గురించి చైతన్య

సమంత గురించి చైతన్య


ఈ కార్యక్రమంలో తన కాబోయే భార్య సమంతకు సంబంధించిన చాలా విషయాలను, మనసులోని భావాలను నాగచైతన్య పంచుకొన్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా నాగచైతన్య భవిష్యత్ ప్లాన్లు, రాబోయే సినిమాల గురించి వెల్లడించినట్టు తెలుస్తున్నది.

సుమంత్ కూడా చాలా ..

సుమంత్ కూడా చాలా ..

సుమంత్ కూడా తన జీవితంలోని చాలా విషయాలను ఈ కార్యక్రమంలో పంచుకొన్నారట. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు, తన అభిరుచులను రానాతో పంచుకొన్నాడట. వారి మధ్య సంభాషణ చాలా జోష్‌గా జరిగినట్టు తెలుస్తున్నది. చైతూ, రానా, సుమంత్ ఒకే కుటుంబానికి చెందిన వారైనప్పటికీ.. వారు స్నేహితులుగా ఉంటారని చెప్పుకొంటారు.

హోస్ట్‌గా రానా అదుర్స్

హోస్ట్‌గా రానా అదుర్స్

రానా హోస్ట్‌గా అద్భుతంగా రాణించాడని, కార్యక్రమం చాలా ఆసక్తిగా సాగినట్టు ఇన్‌సైట్ టాక్. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్స్ త్వరలో ప్రసారం కానున్నాయి. త్వరలోనే మరికొందరు స్టార్లు పాలుపంచుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.

English summary
Rana Daggubati announced of his debut on TV recenly. He is set to turn host for an upcoming chat show – yaari no 1. Naga Chaitanya and Sumanth had a blast shooting for Rana Daggubati’s chat show, Yaari no 1. We are obviously hoping Naga Chaitanya has spoken about his lady love – Samantha Ruth Prabhu and Sumantha has spoken about his upcoming films. It seems that three had a blast shooting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu