Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లై నాలుగు రోజులు కూడా కాలేదు.. అప్పుడే పిల్లలా? సుమకు కౌంటర్ ఇచ్చిన రానా!
ఓటీటీ ప్రపంచం మరింత విస్తరిస్తోంది. డిజిటల్ వరల్డ్ లోకి మొన్నటివరకు ఓ వర్గం నటీనటులు మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం అగ్ర తారలు కూడా వచ్చేస్తున్నారు. అలాగే యాంకర్స్, టీవీకి సంబంధించిన నటీనటులు కూడా ఓటీటీ బెస్ట్ అంటున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ మోస్ట్ టాప్ యాంకర్ సుమ కూడా ఓటీటీ రంగ ప్రవేశం చేసి మొదటి అడుగుతోనే జనాలను అమితంగా ఆకర్షిస్తున్నారు.

సుమ.. ఆల్ ఈజ్ వెల్
సుమ ఇటీవల తాను కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. జబర్దస్త్ యాంకర్ అనసూయతో జరిగిన ఒక చిట్ చాట్ లోనే తన కొత్త ప్రోగ్రామ్ కి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ని కూడా సుమ రిలీజ్ చేసింది. ఆహా యాప్ లో ఆల్ ఈజ్ వెల్ అనే ప్రోగ్రామ్ ద్వారా సరికొత్తగా ఆకట్టుకునేందుకు సుమ సిద్ధమయ్యింది.

రానా, సీతక్కలతో.. స్పెషల్ చిట్ చాట్
ఇక షోకి సంబంధించిన ఒక ఎపిసోడ్ లో వినాయక చవితి సందర్భంగా దగ్గుబాటి రానా, ఆంధ్రప్రదేశ్ ప్రముఖ రాజకీయ నాయకురాలు సీతక్క పాల్గొన్నారు. వారితో లైవ్ చిట్ చాట్ చేసిన సుమ సమాజానికి సంబంధించిన అనేక రకాల మంచి విషయల గురించి మాట్లాడింది. అయితే అందుకు సంబంధించిన ప్రోమోను ఇటీవల విడుదల చేసారు.

మొదటిసారి సీతక్క అంటున్నా
ఇక ప్రోమోలోనే సుమ ఏ రేంజ్ లో ఇంటర్వ్యూ చేసిందో చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. సీతక్కతో మాట్లాడుతూ.. అందరు నన్ను సుమక్క సుమక్క అంటున్నారు. మొదటిసారి నేను పేరుతో కలిపి మరొకరిని సీతక్క అంటున్నాను. ఇది నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపోస్తోందని నవ్వించారు. అలాగే మట్టి వినాయకుడితోనే ఇంట్లో ఉంటూనే వినాయక చవితిని సెలబ్రెట్ చేసుకొనున్నట్లు సీతక్క తెలియజేశారు.

సుమకు రానా కౌంటర్
ఇక రానా దగ్గుబాటితో సరదాగా మాట్లాడిన సుమ ఎప్పటిలానే ఊహించని పంచ్ లతో షాక్ ఇచ్చింది. మొన్నటివరకు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అనేదాన్ని.. ఇక నెక్స్ట్ పిల్లలు ఎప్పుడని అడుగుతామని అనడంతో రానా కూడా అదే తరహాలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పెళ్లి చేసుకొని నాలుగు రోజులు కూడా కాలేదు. అప్పుడే పిల్లలు ఏంటని, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండనివ్వండని రానా వివరణ ఇచ్చారు.