»   » సుడిగాలి సుధీర్‌కు చెప్పు చూపించిన యాంకర్ రష్మి!

సుడిగాలి సుధీర్‌కు చెప్పు చూపించిన యాంకర్ రష్మి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ యాంకర్ రష్మి, ఈ షోలో స్కిట్లు చేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. మరో వైపు షోలో కూడా ఇతర టీం సభ్యులు ఇద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా తమ స్కిట్లలో కూడా సెటైర్లు వేస్తుంటారు.

తాజాగా ఈ వారం ప్రసారం అయిన జబర్దస్త్ షోలో రేష్మి కి సైట్ కొట్టే స్కిట్ జరుగుతుండగా సుడిగాలి సుధీర్ కు తన చెప్పు ని చూపించింది రేష్మి. మరో వైపు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య ఎఫైర్ ఉందనే వార్తలను కూడా రేష్మి ఖండించింది. తాజాగా చెప్పు చూపించడం ద్వారా..... ఇక ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టాలని రష్మి భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Rashmi angry on Sudigali Sudheer

ఇటీవల మీడియాతో ఆమె మాట్లాడుతూ... నాకు తెలుగు సరిగా తెలియదు. సుధీర్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కాబట్టి నాపై ఏమైనా జోక్స్ వేస్తే అడిగి తెలుసుకుంటాను. క్లోజ్ గా ఉన్నంత మాత్రాన తమ మధ్య ఏదో ఉన్నట్లు ఊహించుకోవడం సరికాదు అని అంటోంది.

ప్రస్తుతం రేష్మి... చారుశీల అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో జశ్వంత్ అనే కొత్త హీరో, శ్రీనివాస్ ఉయ్యూరు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. చారుశీలను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసి త్వరలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు టాకీస్ అనే చిత్రం లో కూడా రేష్మి నటించింది.

English summary
There are rumours doing the rounds about popular anchor Rashmi Gautham's link-up with Sudigali Sudheer. Rashmi, who is currently busy shooting for a film, denied all those rumors and cleared the air around her link-up.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu