‘10 ఏళ్ల జర్నీ మాది.. అలా సాగుతోంది..’సుధీర్‌తో లవ్ ట్రాక్ పై రష్మీ క్లారిటీ..
Rashmi Gautam - Sudigali Sudheer: తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. "జబర్దస్త్" షోకు వీళ్ళిద్దరూ ప్రాణం లాంటివారు. సుధీర్ ఎనర్జీ, రష్మీ ఎక్స్‌ప్రెషన్స్, ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వీళ్ళిద్దరూ ఒకే స్టేజ్‌పై కనపడితే చాలు.. ఆ ఎపిసోడ్ టీఆర్పీ దూసుకపోతుంది. ఈ షోకు సంబంధించిన వీడియోలు కూడా ఇట్టే వైరల్ అవుతాయి. ఈ జంట షోలో కనిపించే ప్రతి రొమాంటిక్ ట్రాక్, ఫన్ స్కిట్, ఎమోషనల్ యాక్ట్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది. అదే కారణంగా సుధీర్-రష్మీ జంటను అభిమానులు బుల్లితెర బెస్ట్ కపుల్‌గా భావిస్తున్నారు.
అయితే ఈ జంట మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా రియల్ లైఫ్‌లో కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని చాలామంది అనుకున్నారు. సోషల్ మీడియాలో "సుధీర్-రష్మీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు" అనే రూమర్స్ కూడా బాగానే వైరల్ అవుతుంటాయి. వీరు షోలో చూపించే ఆప్యాయత, రొమాంటిక్ యాక్టింగ్ రియల్‌లోనూ అలాగే ఉందని అభిమానులు నమ్మారు. ఈ పుకార్లపై యాంకర్ రష్మీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. తన రిలేషన్‌షిప్‌పై ఓ స్పష్టత ఇచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో రష్మి నీ యాంకర్ ఇలా ప్రశ్నించారు. 'నిన్ను సుధీర్‌ను చూస్తే మీ మధ్య ఏదో స్పెషల్ కనెక్ట్ ఉందనిపిస్తుంది. నిజంగా మీ మధ్య ఏమైనా ఉంది?" అని అడగగా, రష్మీ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. "మీరు చూసే ప్రతి ఎపిసోడ్‌లో ఏదో కనెక్టివిటీ ఉందని అనుకుంటారు. కానీ, అది మా కెమిస్ట్రీ మాత్రమే. సుధీర్-నాది 10 ఏళ్ల రిలేషన్‌షిప్. 2013 నుంచి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. ఆఫ్‌స్క్రీన్‌లో మేము ఎలా ఉంటామో, ఆన్‌స్క్రీన్‌లో కూడా అలానే ఉంటాం. అతను నాకు లైన్ వేసిన విషయం లేదు, నేను మురిసిపోయిన విషయం లేదు. అన్నీ ఆర్గానిక్‌గా జరిగాయి. మా రిలేషన్ ఓవర్‌నైట్ జర్నీ కాదు. ఒక దశలో మేము కలిసి పనిచేసే స్నేహితులమయ్యాం, ఆ స్నేహం ఇంతవరకూ కొనసాగింది," అని రష్మీ క్లారిటీ ఇచ్చింది.
రష్మీ మాటల్లోని ఆత్మీయత చూస్తే, సుధీర్‌తో తన బంధం ఎంత సహజంగా, నిష్కల్మషంగా ఉందో అర్థమవుతుంది. "జబర్దస్త్" షోలో వారి కామెడీ టైమింగ్, హావభావాలు సూపర్, ప్రేక్షకులకు వారిద్దరి మధ్య నిజమైన కనెక్ట్ ఉందనే భావనను కలిగిస్తుంది. అయితే రష్మీ చెబుతున్నదేమిటంటే అది ప్రేమ కాదు, స్నేహం మాత్రమే. సుధీర్ కూడా గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో "రష్మీ నా మంచి స్నేహితురాలు, సహనటి. మా కెమిస్ట్రీని ప్రేక్షకులు ఇష్టపడటం మా అదృష్టం" అని చెప్పాడు.
గతంలో జబర్ధస్త్ ఫేమ్ గెటప్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుధీర్-రష్మీ గౌతమ్ జంట గురించి మాట్లాడారు. "సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ అసలు రాంప్రసాద్ కలం సృష్టి. ఆ ఇద్దరి కెమిస్ట్రీ, ఆ ఫ్లో అన్నీ స్క్రిప్ట్‌లో భాగం మాత్రమే" అంటూ శ్రీను క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆయన మాటల్లో ప్రేమ కంటే ప్యాషన్ ఎక్కువగా కనిపించింది. "వాళ్ల జంట స్క్రీన్‌పై చాలా బాగుంటుంది. అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే.. ఆ జంటను చూడ్డానికి ఫ్యాన్స్‌కి చాలా ఇష్టం" అని అన్నారు. జబర్ధస్త్‌లో సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ హిట్ కావడానికి అసలైన కారణం రాంప్రసాద్‌నేనని తెలిపారు.


Click it and Unblock the Notifications











