»   » 'బాహుబలి' చిత్రంలో పాత్ర చెయ్యకపోవటానికి కారణం ప్రభాస్ : మంచు లక్ష్మి

'బాహుబలి' చిత్రంలో పాత్ర చెయ్యకపోవటానికి కారణం ప్రభాస్ : మంచు లక్ష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలిలో నటించిన వాళ్లకు ఎంత పేరొచ్చిందో, నటించకుండా రిజెక్ట్ చేసేవాళ్లకు ఇప్పుడు అంతటి క్రేజ్ వస్తోంది. ఎందుకంటే బాహుబలి వంటి చిత్రంలో పాత్ర వస్తే ఎందుకు రిజెక్ట్ చేసారనే ఆసక్తి కలుగుతోంది. దాంతో రిజెక్ట్ చేసామని చెప్తున్నవారి కారణాలుని జనం చాలా ఇంట్రస్ట్ గా వింటున్నారు.

Reason behind Manchu Lakshmi rejecting Shivagami Role in Baahubali

రీసెంట్ గా ఇదే విషయమై లక్ష్మీ మంచు ఒక కామెంట్ చేశారు. బాహుబలి చిత్రంలో పాత్రను వదిలేసుకున్నాను అని. అయితే అసలు తనకు రోల్ నచ్చకపోతే చేయనని.. బాహుబలి సినిమా కూడా అందుకే వదులుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే లక్ష్మి నిజంగానే బాహుబలి సినిమాను అందుకే వదిలేసిందా? రోల్ నచ్చలేదా? ఇలా రకరకాల కామెంట్స్ అంతటా వినపడ్డాయి. అందుకే ఇప్పుడు ఒక టివి ప్రోగ్రామ్ లో ఆ రోల్ చేయకపోవడానికి క్లారిటీ ఏంటో ఇచ్చేసింది.

మంచు లక్ష్మి మాట్లాడుతూ... ''నిజానికి నాకు బాహుబలి లో ఆఫర్ చేసిన శివగామి రోల్ నచ్చింది. కాని ఆ ఛాన్సు వదిలేసుకుంది రోల్ నచ్చక కాదు.. ప్రభాస్ కు అమ్మగా చేయడం ఇష్టం లేక. ప్రభాస్ ను చూస్తే ఎవరికైనా కొడుకు ఫీలింగ్ వస్తుందా? నాకైతే అస్సలు రాదు. పైగా ఇంకోటేదో ఫీలింగ్ వచ్చేసినా వచ్చేయవచ్చు. అందుకే చేయలేదు'' అంటూ చెప్పుకొచ్చింది లక్ష్మీ.

English summary
Manchu Lakshmi is also approached by the makers to play Sivagami in the film Baahubali which was opened up by herself. Read to know reason behind the Manchu Lakshmi rejecting Shivagami Role in Baahubali
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu