»   » జూ ఎన్టీఆర్ వెళ్లాక పరిస్థితి ఏంటి? రంగంలోకి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్!

జూ ఎన్టీఆర్ వెళ్లాక పరిస్థితి ఏంటి? రంగంలోకి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss VS NeethoneDance బిగ్ బాస్ కి రేణు దేశాయ్, ఆదా శర్మ గట్టి పోటీ

స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సరికొత్త షోకు ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ కూడా తోడవ్వడంతో తెలుగు టెలివిజన్ రంగంలో హయ్యెస్ట్ రేటింగ్ సాధిస్తూ... నెం.1 షో అయింది.

సెప్టెంబర్ 24న 'బిగ్ బాస్' మొదటి సీజన్ ముగియబోతోంది. మళ్లీ రెండో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో? ఇంకా డిసైడ్ కాలేదు. అది ప్రారంభం కావడానికి మరికొన్ని నెలల సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత టీఆర్పీ రేటింగ్స్ పడిపోతాయని భావిస్తున్న మాటీవీ యాజమాన్యం అందుకు తగిన పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.

బిగ్ బాస్ ప్లేసులో మరో షో

బిగ్ బాస్ ప్లేసులో మరో షో

బిగ్ బాస్ సీజన్ 1 ముగిసిన వెంటనే మరో షో ప్రారంభించాలని కొన్ని వారాల ముందు నుండే కసరత్తు చేస్తున్న మాటీవీ యాజమాన్యం...... బిగ్ బాస్ షో ప్రసారం అయ్యే సమయంలో డాన్స్ రియాల్టీ షో ప్లాన్ చేస్తున్నారు.

రంగంలోకి రేణు దేశాయ్

రంగంలోకి రేణు దేశాయ్

సాధారణ సెలబ్రిటీలను ఈ డాన్స్ రియాల్టీ షో జడ్జిలుగా నియమిస్తే అంతగా స్పందన ఉండదని భావిస్తున్న మాటీవీ యాజమాన్యం.... ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై కనిపించని అరుదైన సెలబ్రిటీని తీసుకొస్తోంది. ఆవిడ మరెవరో కాదు... పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అని టాక్.

ఎంతో కొంత ఊరట

ఎంతో కొంత ఊరట

బిగ్ బాస్ స్థానంలో డాన్స్ రియాల్టీ షోను రీప్లేస్ చేయడం ద్వారా టీఆర్పీ రేటింగ్స్ విషయంలో ఎంతో కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. 'స్టార్ ప్లస్' లో వస్తోన్న 'నాచ్ బలియే' తరహాలో ఈ డాన్స్ షో వుంటుందట.

రేణు దేశాయ్ తో పాటు జానీ మాస్టర్, ఆదా శర్మ

రేణు దేశాయ్ తో పాటు జానీ మాస్టర్, ఆదా శర్మ

ఈ కార్యక్రమానికి ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఉంటారని సమాచారం. ఇప్పటికే రేణు దేశాయ్ ఫైనల్ అవ్వగా తాజాగా జానీ మాస్టర్, హీరోయిన్ ఆదా శర్మను తీసుకున్నారని తెలుస్తోంది.

రేణు దేశాయ్‌ని దింపడానికి కారణం

రేణు దేశాయ్‌ని దింపడానికి కారణం

ఈ డాన్స్ రియాల్టీ షో కోసం రేణు దేశాయ్‌ని దింపడానికి కారణం.... ఆమె పవన్ కళ్యాణ్ మాజీ భార్య. తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు అవసరం లేని సెలబ్రిటీ. పవన్ కళ్యాణ్ ఫాలోవర్లు, మెగా అభిమానులు ఆమె షోను తప్పకుండా ఫాలో అవుతారనే నమ్మకమేనంట.

త్వరలో అఫీషియల్ ప్రకటన

త్వరలో అఫీషియల్ ప్రకటన

రేణు దేశాయ్, జానీ మాస్టర్, అదా శర్మ న్యాయ నిర్ణేతలుగా ప్రారంభం అయ్యే ఈ డాన్స్ రియాల్టీ షోకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. బిగ్ బాస్ ముగిసిన తర్వాత ఈ షోపై ఓ క్లారిటీ రానుంది.

English summary
Telugu Bigg Boss reality show came to an end and this 24th is going to be the grand finale. As the show got so much popular and maintained the TRP at high for all these weeks, it would be a tough task for the Star Maa management to replace that. The arrangements are going on to replace Bigg Boss with a dance show. Renu Desai is also going to be a judge on this dance show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu