Don't Miss!
- Automobiles
ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే
- Lifestyle
చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే PCOD మరియు PCOS సమస్యకు ఈ ఆహారాలు పరిష్కారం చూపుతాయి.
- News
వైసీపీకి మద్దతిచ్చిన బీఆర్ఎస్ - పార్లమెంటులో ఆసక్తికర పరిణామం-ఇదే తొలిసారి ?
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Bigg Boss: రేవంత్ కఠిన నిర్ణయం.. మధ్యలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా!
గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులను తీసుకొస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. హౌస్‌లో ఉండే కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాన్స్.. ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నింటినీ చూపిస్తూ భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ కూడా ఎంతో రంజుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో టికెట్ టు ఫినాలే టాస్కును తెచ్చారు. ఇందులో ఊహించని సంఘటన జరిగింది. ఆ వివరాలు మీకోసం!

వాళ్లందరికీ స్నోమ్యాన్ టాస్క్
గ్రాండ్ ఫినాలే వీక్‌కు రెండు వారాల ముందే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు 'టికెట్ టు ఫినాలే' అనే టాస్కును ఇస్తూ ఉంటారు. ఇది గెలుచుకున్న ఒక కంటెస్టెంట్ నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెడతారు. ఇందులో భాగంగా ఆరో సీజన్‌కు సంబంధించి 'స్నోమ్యాన్' అనే టాస్కును ఇచ్చారు. దీని ప్రకారం.. కొన్ని పార్టులను కలిపి సభ్యులు స్నోమ్యాన్‌ను తయారు చేయాల్సి ఉంటుంది.
Hyper Aadi Gundu: హైపర్ ఆదికి చేదు అనుభవం.. గుండు కొట్టించి మరీ.. అమ్మాయి ముద్దు ఎఫెక్ట్

సత్య, ఇనాయా, కీర్తీలకు షాక్
గార్డెన్, స్టోర్ రూమ్‌లో సమయానుసారం స్నోమ్యాన్ పార్టులను ఉంచుతారు. వాటిని కంటెస్టెంట్లు సంపాదించి బొమ్మను ఏర్పాటు చేయాలి. ఇందులో మొదటి రౌండ్‌లో శ్రీ సత్య ఔట్ అయింది. ఆ తర్వాత ఇనాయా సుల్తానా కూడా తక్కువ వస్తువులు కలిగి ఉండడంతో టాస్కు నుంచి ఎలిమినేట్ అయింది. అలాగే, కీర్తి భట్ కూడా మూడో రౌండ్‌లో ఔట్ అయినట్లు ప్రోమోలో చూపించారు.

ఓడిన వాళ్లకు మరొక ఛాన్స్
టికెట్ టు ఫినాలేలో భాగంగా స్నోమ్యాన్ టాస్కులో ఓడిపోయిన ముగ్గురు కంటెస్టెంట్లు శ్రీ సత్య, ఇనాయా సుల్తానా, కీర్తి భట్‌లకు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓడిన వాళ్లను మళ్లీ తీసుకు వచ్చారు. దీన్ని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. ఇక, ఇందులో ఆ ముగ్గురు అమ్మాయిలకు 'రంగు పడితే రివైవల్' అనే ఛాలెంల్‌ను ఇచ్చారు.
బాత్రూంలో ఏమీ లేకుండా అషు రెడ్డి: సెల్ఫీ వీడియోలో మొత్తం చూపిస్తూ!
సత్య ఔట్.. వాళ్లిద్దరిలో ఒకరు
'రంగు పడితే రివైవల్' టాస్కులో భాగంగా కంటెస్టెంట్లు అందరూ ఎదుటి వాళ్ల టీషర్టులపై రంగులు అంటించాలి. అలా ఎవరిపై ఎక్కువ కలర్ ఉంటుందో వాళ్లు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా శ్రీ సత్యను ఇనాయా, కీర్తి టార్గెట్ చేసినట్లు కనిపించింది. ఫలితంగా మొదటి రౌండ్‌లో ఆమెకు ఎక్కువ కలర్ అంటింది. దీంతో ఆమె ఔట్ అయిపోయింది.

ఇనాయాను పంపిన రేవంత్
'రంగు పడితే రివైవల్' టాస్కులో మిగిలిన ఇనాయా సుల్తానా, కీర్తి భట్ మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు ఓ న్యూస్ లీకైంది. ఇక, ఇందులో సంచాలకుడిగా ఉన్న రేవంత్‌కు విజేతను నిర్ణయించే బాధ్యతను అప్పగించారు. అయితే, దీనికోసం అతడు చాలా సమయమే తీసుకున్నాడని తెలిసింది. ఇలా ఆఖర్లో ఇనాయా ఈ టాస్కు నుంచి ఎలిమినేట్ అవ్వాలని నిర్ణయించాడట.
నెట్ డ్రెస్‌లో గబ్బర్ సింగ్ బ్యూటీ: ఈ ఏజ్‌లోనూ మరీ ఇంత ఘోరంగానా!

వీడియో లీక్.. రేవంత్‌పై ఫైర్
'రంగు పడితే రివైవల్' టాస్కుకు సంబంధించి ఇనాయా సుల్తానా, కీర్తి భట్ ఆడిన టాస్కు వీడియో ఇప్పటికే బయటకు వచ్చింది. ఇందులో కీర్తీ షర్ట్ పైనే ఎక్కువ కలర్ ఉన్నట్లు, కావాలనే ఇనాయాను టాస్కు నుంచి ఎలిమినేట్ చేసినట్లు కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు.