For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ గోపాల్ వర్మ ...సూసైడ్ టాపిక్కే అంతటా

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏది మాట్లాడినా సంచలనమే. ఇప్పుడు మరోసారి సంచలనాత్మక స్టేట్‌మెంట్‌ వదిలి హాట్ టాపిక్ గా నిలిచారు. తాను ఏదైనా వ్యాధితో తాను మంచాన పడి ఎవరిపైనైనా ఆధారపడాల్సి వస్తే ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా ఆత్మహత్మ చేసుకుంటానన్నారు. అసలు నేను రోగాన పడటాన్నే అసహ్యించుకుంటాను. ఇతరులు నా బాగోగులు చూడడాన్ని ద్వేషిస్తా అని చెప్పారు. అలాగే ...నా మరణం గురించి ముందే తెలిస్తే ఎవరికీ కనబడకుండా వెళ్లిపోతా..నేను ఏకాంత మరణాన్ని కోరుకుంటాను అని వర్మ తెలిపారు.

  ఇక తన బాడీని ఎవరూ చూడకూడదని, చలనరహితమైన నా శరీరం ఎవరి కంటా పడకూడదని అన్నారు. మరణించిన వ్యక్తి దేవుడితో కలిసి ఉంటాడని ఎవరైనా నమ్మితే అతను డెత్‌ను కూడా సెలబ్రేట్‌ చేసుకోవచ్చన్నారు. చావు సమయంలో ఏడుపూలు, గీడుపూలు నాకు నచ్చవు అని వర్మ తెలిపారు. బర్త్‌ని ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటామో , డెత్‌ని కూడా అలానే సెలబ్రేట్‌ చేసుకోవాలని హితవు చేశారు. ఇదంతా వర్మ ఓ టీవీ షోలో పాల్గొన్నప్పుడు చెప్పిన విశేషాలు.

  RGV said that ...I'll commit suicide if...

  ఇక వర్మ తాజా చిత్రాల విషయానికి వస్తే...

  హిట్, ఫ్లాపులతో సంభందం లేకుండా ...విలక్షణ కథాంశాలకు సాంకేతిక హంగులను జోడించి చిత్రాలను తెరకెక్కించడంలో ముందుంటారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఇటీవలే ఫ్లోకామ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసూ అతి తక్కువ వ్యయంతో ఐస్‌క్రీమ్ చిత్రాన్ని, దాని సీక్వెల్ ని తెరకెక్కించారాయన. ఇప్పుడు అదే పరిజ్ఞానంతో మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ చిత్రానికి స్పాట్ అనే పేరును ఖరారు చేసారు. నూతన తారాగణం కీలక పాత్రల్ని పోషించనున్న ఈ చిత్రం కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన ఆడియో పోస్టర్ ని వర్మ విడుదల చేసారు.

  అలాగే ఐస్ క్రీమ్ 2 చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలైంది. తొలి రోజు తొలి ఆట నుంచే ఈ చిత్రం కలెక్షన్స్ మందగించాయి. ఓపినింగ్స్ సైతం తెచ్చుకోలేని ఈ చిత్రం మరీ దారుణంగా భాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. దాంతో రెండో రోజుకే ఈ చిత్రం తీసేసారని తెలుస్తోంది. ఆ చిత్రం ప్లేస్ లో పూజ, కార్తికేయ చిత్రాలు వేసారని చెప్తున్నారు. వీటితో మినిమం కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ఐస్ క్రీమ్ చిత్రం ఎఫెక్టు ఈ ఐస్ క్రీమ్ 2 పై పడిందని విశ్లేషిస్తున్నారు. ఆ చిత్రం దారుణంగా ఉండటంతో ఈ సీక్వెల్ అదే తరహాలో ఉంటుందని భావించి థియోటర్స్ కు దూరంగా ఉన్నారని చెప్తున్నారు.

  కథ ఏమిటంటే.... ఐదుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఓ షార్ట్ ఫిలిం చేయాలని నిర్ణయించుకుంటారు.షూటింగ్ కోసం ఓ అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అక్కడకి వెళ్లి వెళ్లగానే..ఇలాంటి సినిమాల తరహాలో అక్కడ చిత్రమైన, భయపెట్టే సంఘటనలు జరగటం మొదలెడతాయి.అక్కడ నుంచి వారు తప్పించుకునిపోదామని అనుకుంటే..వారు సిక్కా(జెడీ చక్రవర్తి)చేతికి చిక్కుతారు. సిక్కా అతని గ్యాంగ్ బ్యాంక్ దొంగలు..వాళ్ళు వీళ్ళని కిడ్నాప్ చేసారన్నమాట. అప్పుడు ఊహించని ట్విస్ట్ పడుతుంది. కిడ్నాప్ జరిగిన నాటి నుంచి గ్రూప్ లో ఒక్కొక్కరూ చనిపోవటం మొదలెడతారు. అసలు ఏం జరుగుతోంది. ఎవరు ఎవర్ని చంపుతున్నారు. ఎవరైనా మిగులుతారా...ఆ షార్ట్ ఫిల్మ్ ఫినిష్ చేసారా తర్వాత ఏం జరిగింది అనే విషయం తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

  English summary
  "If i'm bedridden and should survive on other's support, I'll commit suicide without much thought. I hate being sick. I hate being taken care by others," RGV said about his death in a candid TV talk show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X