For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుజ్జమ్మ లవర్ కాదంటూ షాకిచ్చిన సూర్య: ఇనాయాతో రిలేషన్, పెళ్లి మాత్రం ఆమెతోనే అంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై సరికొత్త సంచలనాలను సృష్టిస్తూ.. తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా అత్యధిక రేటింగ్‌తో ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకుని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరింది. ఇక, ఈ షో వల్ల ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో కొందరు లవ్ ట్రాకులతో ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో ఆరో సీజన్ కంటెస్టెంట్ ఆర్జే సూర్య ఒకడు. గత వారం ఎలిమినేట్ అయిన అతడు.. తన గర్ల్‌ఫ్రెండ్, పెళ్లి గురించి మాట్లాడాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  తనదైన టాలెంట్‌తో గుర్తింపు

  తనదైన టాలెంట్‌తో గుర్తింపు

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంటరయ్యారు. అందులో ఫేమస్ ఆర్జే, మిమిక్రీ ఆర్టిస్టు అయిన సూర్య ఒకడు. ఆరంభంలోనే తనదైన టాలెంట్లతో మెప్పించిన అతడు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు, అన్నింట్లోనూ యాక్టివ్‌గా ఉంటూ అలరించాడు. తద్వారా ఫినాలేకు చేరే కంటెస్టెంట్ అనిపించుకున్నాడు.

  శృతి మించిన అఖండ హీరోయిన్ హాట్ షో: వామ్మో గీత దాటేసిందిగా!

  లవ్ ట్రాకులతో మరింత క్రేజ్

  లవ్ ట్రాకులతో మరింత క్రేజ్

  బిగ్ బాస్ హౌస్‌లో ఆర్జే సూర్య మొదట ఆరోహితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించాడు. ఆమె బయటకు వెళ్లగానే ఈ కుర్రాడు ఇనాయా సుల్తానాతో జత కట్టాడు. ఆమె కూడా అతడికి బాగా కోపరేట్ చేస్తూ రెచ్చిపోయింది. దీంతో ఇద్దరూ వీలైనంత ఎక్కువగా రొమాన్స్‌ను పండించారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ షోలో వీళ్లిద్దరూ జంటగా రచ్చ చేస్తూ తెగ హైలైట్ అయిపోయారు.

  అప్పుడే సూర్య ఎలిమినేషన్

  అప్పుడే సూర్య ఎలిమినేషన్

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో అదిరిపోయే ఆటతీరుతో అలరించిన ఆర్జే సూర్య.. కచ్చితంగా ఫినాలేకు చేరుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ, లవ్ ట్రాకులు, రొమాన్స్ కారణంగా అతడు చెడ్డపేరును మూటగట్టుకున్నాడు. ఫలితంగా ఎనిమిదో వారమే సూర్య ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో అతడి అభిమానులు దీనిపై తీవ్ర నిరాశగా ఉండిపోయారని చెప్పుకోవచ్చు.

  బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు

  సూర్య అక్కడ.. బుజ్జమ్మతోనే

  సూర్య అక్కడ.. బుజ్జమ్మతోనే


  షోలో తనదైన ఆటతీరుతో సూర్య ఫేమస్ అయితే.. అతడి నోటి నుంచి తరచూ బుజ్జమ్మ అనే పేరు రావడంతో ఆమె గర్ల్‌ఫ్రెండ్ కూడా బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఒకవైపు సూర్యను గెలిపించడం కోసం ప్రచారం చేయడంతో పాటు ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. అలాగే, లోపల ఎంత మందితో క్లోజ్‌గా ఉన్నా సూర్య కూడా బజ్జమ్మ గురించే ఆలోచించేవాడు.

  బుజ్జమ్మ నా లవర్ కాదంటూ

  బుజ్జమ్మ నా లవర్ కాదంటూ

  బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సూర్య పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే బుజ్జమ్మతో అతడికి ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. ఇలా ఓ ప్రశ్నకు సమాధానంగా 'నేను, బుజ్జమ్మ లవర్స్ అని అంతా అనుకుంటున్నారు. అందరూ అలాగే మాట్లాడుతున్నారు. కానీ, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే' అంటూ షాకిచ్చాడు.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శృతి హాసన్: లోపలివి కనిపించేలా ఘోరంగా!

  ఆమెకు ఇబ్బంది.. ఇనాయా

  ఆమెకు ఇబ్బంది.. ఇనాయా

  ఆ తర్వాత సూర్య కంటిన్యూ చేస్తూ.. 'ఇలా మేమిద్దరం లవర్స్ అని రాయడం వల్ల తనకు చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. తను నాకు ఫ్యామిలీ మెంబర్‌లాంటిది' అని చెప్పాడు. అలాగే ఇనాయా గురించి మాట్లాడుతూ.. 'ఇనాయా, నేను కూడా ఫ్రెండ్స్ మాత్రమే. కాకపోతే తన బాగా కనెక్ట్ అవడానికి ప్రయత్నాలు చేస్తుంది' అన్నాడు.

  పెళ్లి సంబంధాలు అంటూ

  పెళ్లి సంబంధాలు అంటూ

  అనంతరం సూర్య 'నేను ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. ఇప్పటికే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనే చెప్పాను. కానీ, అది ఎందుకనో చూపించలేదు అనుకుంటా. మా ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను' అని వివరించాడు. ఈ వ్యాఖ్యలతో చాలా మంది షాక్‌కు గురవుతున్నారు.

  English summary
  Recently RJ Surya Eliminated From Bigg Boss Telugu 6th Season. Now He Gave Clarity on Relationship with Bujjamma and His Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X