For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jabardasth లో నాగబాబుతో విబేధాలు.. ఈ వయసులో కూడా.. అంటూ ఓ మాట అన్నారు: రోజా

  |

  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న వారిలో రోజా ఒకరు. అచ్చమైన తెలుగు అమ్మాయిగా ఆమె విభిన్నమైన తరహాలో ఎన్నో పాత్రలు చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె బిజీగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక జబర్దస్త్ షోలో కూడా ఆమె కొన్నాళ్ళు జడ్జిగా కొనసాగారు. అయితే నాగబాబుతో కూడా ఆమెకు షోలో విభేదాలు వచ్చినట్లు ఆమధ్య రకరకాల వార్తలొచ్చాయి. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా నాగబాబు తన గురించి మాట్లాడిన కొన్ని విషయాలపై స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

  పొలిటికల్ ఫైర్ బ్రాండ్

  పొలిటికల్ ఫైర్ బ్రాండ్

  ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న రోజా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అప్పుడప్పుడు ఆమె ప్రత్యర్థి రాజకీయ నాయకులపై కౌంటర్లు ఇచ్చే విధంగా మాట్లాడడం కూడా వైరల్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె ఫైర్ బ్రాండ్ అని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు.

  జబర్దస్త్ ప్రయాణం

  జబర్దస్త్ ప్రయాణం

  ఇక రోజా, నాగబాబు తో పాటు జబర్దస్త్ చాలా కాలం పాటు జడ్జిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే మరొకవైపు ఆమె జబర్దస్త్ షోలో కనిపిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమయ్యే కొన్ని స్పెషల్ షోలలో కూడా ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేవారు. అంతేకాకుండా డాన్స్ మాస్టర్ లతో డాన్స్ చేస్తూ కూడా ఎన్నో సందర్భాల్లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఒకసారి శేఖర్ మాస్టర్ తో చేసిన డ్యాన్స్ వీడియో బాగా వైరల్ అయ్యింది.

  నాగబాబుతో విబేధాలు

  నాగబాబుతో విబేధాలు

  ఆర్కే రోజా హఠాత్తుగా జబర్దస్త్ షో నుంచి కొన్నాళ్ల క్రితం తప్పుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే అంతకంటే ముందే నాగబాబు కూడా తప్పుకున్నారు. రోజాతో కొన్ని విభేదాలు రావడం వల్లనే నాగబాబు ఆ షో నుంచి బయటకు వచ్చేసారు అని కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు రోజా కూడా ఆ షో నుంచి తప్పుకోవడం జరిగింది.

  నాగబాబుతో పాజిటివ్ గానే..

  నాగబాబుతో పాజిటివ్ గానే..

  ఇక రోజా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ వివాదాల గురించి.. వివరణ ఇచ్చారు. నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం రోజానే అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. అసలు అది కరెక్ట్ కాదు. నాగబాబు గారు నాతో చాలా పాజిటివ్ గా ఉంటారు. గతంలో ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రొడ్యూసర్స్ కష్టాలు తెలుసుకొని ఇబ్బంది పెట్టని ఒకే ఒక్క హీరోయిన్ అని నన్ను మెచ్చుకుంటారు. ఎందుకంటే వారి ప్రొడక్షన్లో నేను ముగ్గురు మొనగాళ్లు సినిమా చేశాను.. అని రోజా చెప్పారు.

  డ్యాన్స్ చేసినప్పుడు

  డ్యాన్స్ చేసినప్పుడు

  అలాగే నేను డాన్స్ చేసినప్పుడు కూడా ఒక మాట అన్నారు. ఒకసారి శేఖర్ మాస్టర్ తో సాంగ్ చేసినప్పుడు మిగతా వాళ్లతో.. మీరంతా ఈ ఏజ్ లో చేస్తున్నారయ్యా!. కానీ మా ఏజ్ కు కూడా మీకు ఈక్వల్ గా చేస్తుంది చూడండి.. అది ఆమె గ్రేట్నెస్.. అని నాగబాబుగారు తనను పొగిడినట్లుగా రోజా తెలిపారు. నాగబాబుగారు అయితే ప్రతి విషయంలో నాతో పాజిటివ్ గానే ఉన్నారు.. అని రోజా వివరణ ఇచ్చారు.

  ఎలాంటి విభేదాలు లేవు

  ఎలాంటి విభేదాలు లేవు


  పొలిటికల్ గా అయితే కోప్పడిన సందర్భాలు ఉండవచ్చు. నేను వారి సోదరులను ఏమైనా అన్నప్పుడు రియాక్ట్ అయి ఉండవచ్చు. కానీ మిగతా విషయాలలో అయితే అసలు ఎలాంటి విభేదాలు లేవు. సెట్ లో కూడా ఆయన నాకంటే సీనియర్ కాబట్టి ఎప్పుడు కూడా ఆయనకు ఇచ్చే గౌరవం అయితే ఇచ్చాను. నేను పెద్ద హీరోయిన్ అని కాలు మీద కాలు వేసుకోవడం లాంటివి చేయలేదు. ఆయన కూడా మాతో ఎప్పుడు పాజిటివ్ గానే ఉన్నారు.. అని రోజా వివరణ ఇచ్చారు.

  English summary
  RK Roja first time reaction on naga babu jabardasth rumours
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X