Don't Miss!
- Lifestyle
Vastu Tips: ఎదుగుతున్నకొద్దీ అసూయపడే వ్యక్తులు పెరుగుతూ ఉంటారు, వారి దిష్టిని ఇలా తగ్గించుకోండి
- Finance
Vizag: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు.. సీఎం జగన్ పెట్టుబడుల ఆకర్షణ మంత్రం..
- News
Girlfriend: పక్క రాష్ట్రానికి బాయ్ ఫ్రెండ్ ను పిలిపించిన ప్రియురాలు, లాడ్జ్ లో ప్రియుడు ఏం చేశాడంటే ?
- Sports
IND vs NZ: స్పిన్ ఎక్కువైంది.. బీసీసీఐ తాట తీసింది.. లక్నో క్యూరేటర్పై వేటు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
యాంకర్ రష్మీ గుట్టురట్టు చేసిన కమెడియన్: ఆ పని చేసి డబ్బు సంపాదిస్తుందంటూ షాకింగ్‌గా!
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన శైలితో స్పెషల్ అనిపించుకుంటోన్నారు. వారిలో హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ ఎక్కువగా షోలు చేయకున్నా.. క్రేజ్‌ను మాత్రం విపరీతంగా పెంచుకుంటోన్న ఈ భామ.. జబర్ధస్త్‌గా ప్రయాణాన్ని సాగిస్తోంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మీ గౌతమ్ సంపాదనపై ఓ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

సక్సెస్‌ఫుల్‌గా రష్మీ ప్రయాణం
యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి వచ్చి చాలా పాత్రలను పోషించిందన్న విషయం తెలిసిందే. అలా అరకొర అవకాశాలతో సాగిపోతోన్న ఈ బ్యూటీకి జబర్ధస్త్ యాంకర్‌గా అవకాశం దక్కింది. ఇందులో తనదైన హోస్టింగ్‌తో అలరించిన ఈ భామ.. సుధీర్‌తో లవ్ ట్రాకుతో మరింత ఫేమస్ అయింది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా నడుపుకుంటోంది.
గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

సినిమాల్లోనూ.. అదొక్కటి తప్ప
యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న రష్మీ గౌతమ్.. ఆ మధ్యనే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఆ తర్వాత రష్మీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ హిట్ కాలేదు. దీంతో ఈ అమ్మడు సినిమాలపై ఫోకస్ చేయట్లేదు.

బ్లాక్ బస్టర్ సినిమాతో వచ్చినా
సత్ఫలితాలు రాకపోవడంతో సినిమాలకు గ్యాప్ తీసుకుంటోన్న రష్మీ గౌతమ్.. ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నందూ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఈ సుందరాంగి మళ్లీ తన యాంకరింగ్ కెరీర్‌ను కొనసాగిస్తోంది.
Bigg Boss 7: బిగ్ బాస్‌కు బాలయ్య షాకింగ్ కండీషన్స్.. నాగార్జునకు మరో దెబ్బ.. ఇండస్ట్రీలో కలకలం

పర్సనల్ ట్రిప్స్‌తో ఎంజాయ్
ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు, అప్పుడప్పుడూ స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ పర్సనల్ ట్రిప్‌లకు కూడా వెళ్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది కొద్ది రోజుల క్రితమే మాల్దీవ్స్ టూర్‌కు వెళ్లింది. అక్కడ రష్మీ గౌతమ్ వాళ్లతో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. ఈ అప్‌డేట్లను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ షోలతో బిజీ.. సినిమాల్లోనూ
సుడిగాలి సుధీర్, అనసూయ వెళ్లిపోవడంతో రష్మీ గౌతమ్ ఇటీవలే 'జబర్ధస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు కూడా యాంకర్‌గా మారింది. అలాగే, కొన్ని భారీ సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు మళ్లీ జబర్ధస్త్ షోకు గుడ్‌బై చెప్పిన ఆమె 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోను మాత్రమే నడిపిస్తోంది. దీనితో పాటు కొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది.
బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ రచ్చ: నాకు అదే కావాలి అంటూ దొరికిపోయిందిగా!
రష్మీపై కమెడియన్ కామెంట్
వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతున్న 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో జడ్జ్ కుస్భూ తనదైన స్టెప్పులతో అలరించింది. అలాగే, యాంకర్ రష్మీ కూడా తన లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. ఇక, కమెడియన్లు అందరూ తమదైన పంచులతో నవ్వించారు. అలాగే, రాకింగ్ రాకేష్ ఏకంగా యాంకర్ రష్మీ సంపాదనపై కామెంట్స్ చేశాడు.

అలా సంపాదిస్తుంది అంటూ
'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' ఎపిసోడ్‌లో భాగంగా రాకేష్ తన స్కిట్‌లో స్వామీజీలా కనిపించాడు. ఇందులో అతడి కో ఆర్టిస్టు ప్రవీణ్.. రష్మీ జాతకం చెప్పమని అడిగాడు. దీనికతను 'అందరూ డబ్బులు లేకపోతే గుండెలు బాదుకుంటారు. కానీ, ఈ అమ్మాయి గుండెలు బాదుకుంటూ డబ్బులు సంపాదిస్తోంది' అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.