Don't Miss!
- News
ఫిబ్రవరి 10నుండి తెలంగాణా వీధుల్లో బీజేపీ జజ్జనకరి జనారే!!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Anshumalika: వైరల్ అవుతున్న రోజూ కూతురి లేటెస్ట్ ఫొటో.. లవ్ సింబల్ తో సర్‌ప్రైజ్..
సినిమా ప్రపంచంలో సినీ తారల వారసులు ఒకప్పుడు ఒక స్టేజ్ కు వచ్చే వరకు కూడా బయటి ప్రపంచానికి పెద్దగా కనిపించే వారు కాదు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం చిన్నతనం నుంచే కొందరు స్టార్ కిడ్స్ జనాలకు ఎంతగానో కనెక్ట్ అవుతున్నారు. ఇక చాలా సింపుల్ లైఫ్ తో కనబడే స్టార్ సెలబ్రిటీ వారసులలో రోజా కూతురు కూడా ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఇక రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోకి లవ్ సింబల్ క్యాప్షన్ గా ఇచ్చారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

బిజీబిజీగా రోజా
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజకీయ నాయకురాలిగా విభిన్నమైన దారులలో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. రోజా తమిళనాడుకు చెందిన సెల్వమననీ అనే దర్శకుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు అలాగే టెలివిజన్ రంగంలో కూడా రోజా గారు ఎంతగానో క్రేజ్ అందుకుంటున్నారు.

జబర్దస్త్ షోలో..
ముఖ్యంగా జబర్దస్త్ షోలో రోజా చాలా కాలంగా జడ్జ్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక షో నుంచి వివిధ కారణాల వలన మరొక జడ్జి నాగబాబు వెళ్లిపోయినప్పటికీ కూడా రోజా మాత్రం జబర్దస్త్ ను అసలు విడువడం లేదు. కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎప్పటిలానే ఆ షోలో కొనసాగుతూ వస్తోంది.

రాజకీయాల్లో మరో విజయం
సినీ రంగంలో మంచి గుర్తింపును అందుకున్న రోజా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఏడాది విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే రీసెంట్ గా ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. మంత్రి పదవి కోసం చాలా కాలంగా రోజా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఆమెకు పదవి దక్కిన తర్వాత జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా ప్రత్యేకంగా కలుసుకుని శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

రోజా డాటర్
ఇక రోజా కూతురు ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చూడగానే చిరు నవ్వు మొహంతో ఎంతగానో ఆకట్టుకునే అన్షుమాలిక ఇన్ స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు డిఫరెంట్ ఫ్యాషన్ దుస్తులతో కూడా ఓ వర్గం వారిని ఆమె ఎంతగానో ఆకట్టుకుంటుంది.

క్లోజ్ ఫ్రెండ్
ఇక ఇండస్ట్రీలోని వారసులలో కొంతమందిలో అన్షుమాలికకు మంచి స్నేహితులు కూడా ఉన్నారు. ఇక అందులో శేఖర్ మాస్టర్ కూతురు సాహితి శేఖర్ కూడా మాలికకు మంచి స్నేహితురాలు. ఏ మాత్రం గ్యాప్ వచ్చినా కూడా ఈ ఇద్దరూ ప్రత్యేకంగా కలుసుకుంటారు అని తెలుస్తోంది. ఇక వీరికి సంబంధించిన ఒక సెల్ఫీ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లవ్ సింబల్ తో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ లో ఒకరైన శేఖర్ మాస్టర్ కూతురు కూడా ఇటీవల కాలంలో మంచి డాన్స్ తో తన టాలెంట్ ను బయటపెడుతోంది. ఇక ఆమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. అయితే రీసెంట్ గా రోజా కూతురు అన్షుమాలికతో ఒక సెల్ఫీ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా దానికి క్యాప్షన్ గా లవ్ సింబల్ కూడా ఇవ్వడంతో వైరల్ అయిపోయింది. ఆ క్యాప్షన్ తో వీరిద్దరి ఎంతో స్నేహంగా ఉంటారో అర్థం అవుతోందినీ నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.