For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్ సెట్‌లో బాలకృష్ణకు రోజా ఫోన్: ఊహించని మాటలతో షాకిచ్చిన నటసింహం.. సంచలనంగా ఆడియో క్లిప్

  |

  నందమూరి తారక రామారావు తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి టాలెంట్లతో స్టార్‌గా ఎదిగిపోయారు నటసింహా బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న ఆయన.. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎవరూ చేయలేనన్ని పాత్రలను పోషించారు. ఇప్పుడు ఆరు పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

  అలాగే, సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన 'అఖండ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది ప్రేక్షకుల ముందుకు రాకుండానే మరిన్ని ప్రాజెక్టులను ప్రకటించారు. మరోవైపు, ఓటీటీలోకి సైతం అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్యకు రోజా ఫోన్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  వరుస ఫ్లాపులతో నటసింహం సతమతం

  వరుస ఫ్లాపులతో నటసింహం సతమతం

  తన వందవ చిత్రంగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నప్పటికీ.. విజయం మాత్రం అందనంత దూరంలోనే ఉంటోంది. దీంతో బాలయ్యతో పాటు ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం సినిమాల మీద సినిమాలు చేయాలని బాలయ్య డిసైడ్ అయిపోయారు.

  Most Eligible Bachelor Twitter Review: మూవీకి ఊహించని టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఆ పొరపాటు లేకుంటే!

  ‘అఖండ' అంటూ వస్తున్న బాలకృష్ణ

  ‘అఖండ' అంటూ వస్తున్న బాలకృష్ణ

  'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ సూపర్ డూపర్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'అఖండ'. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  వరుస సినిమాలతో బాలయ్య ఫుల్ జోష్

  వరుస సినిమాలతో బాలయ్య ఫుల్ జోష్

  'అఖండ' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే నందమూరి బాలకృష్ణ ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. ఇప్పటికే 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దీని తర్వాత బాలయ్య.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేయనున్నారు. దీన్ని కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక, వీటి తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఒక సినిమా.. శ్రీవాస్‌తో మరో సినిమాను చేయబోతున్నట్లు ఇండస్ట్రీ ఏరియాలో చాలా రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

  హాట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ అందాల ఆరబోత: ఎద భాగం మొత్తం కనిపించేలా.. మరీ ఇంత దారుణమా!

  అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే.. ఓటీటీలోకి

  అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే.. ఓటీటీలోకి

  ఇంత కాలం పాటు సినీ రంగంలో విశేషమైన సేవలు అందించిన నందమూరి బాలకృష్ణ.. లేటు వయసులో ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అల్లు అరవింద్‌కు చెందిన ఆహా సంస్థ రూపొందిస్తోన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు గురువారమే వెల్లడించారు. అలాగే, అధికారికంగా లాంచ్ చేశారు. ఇక, ఇందులోకి టాలీవుడ్‌లోని స్టార్ హీరోలంతా గెస్టులుగా వస్తారనే టాక్ వినిపిస్తోంది. ముందుగా చిరంజీవే ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.

  జబర్ధస్త్ సెట్‌లో బాలకృష్ణకు రోజా ఫోన్

  జబర్ధస్త్ సెట్‌లో బాలకృష్ణకు రోజా ఫోన్

  వచ్చే గురువారం ప్రసారం కాబోతున్న జబర్ధస్త్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వహకులు తాజాగా విడుదల చేశారు. ఆద్యంతం ఎంతో సందడిగా సాగిన ఈ వీడియోలో.. కమెడియన్లు అందరూ తమదైన శైలి పంచులతో నవ్వించారు. మరీ ముఖ్యంగా హైపర్ ఆది, చలాకీ చంటీ, అదిరే అభి, రాకెట్ రాఘవ టీమ్‌లు చేసిన స్కిట్లు నవ్వులు పూయించినట్లు కనిపించింది. ఇక, ఈ ప్రోమో చివర్లో యాంకర్ అనసూయ భరద్వాజ్ 'ఈరోజు బాలయ్య బాబు గారికి మా అందరి ముందు కాల్ చేయాలి' అని రోజాను అడిగింది. దీంతో ఆమె వెంటనే బాలయ్యకు ఫోన్ చేసింది.

  హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  సంస్కారంతో మాట్లాడిన నటసింహం

  అనసూయ అడిగిన వెంటనే రోజా 'మంచి మూడ్‌లో ఉంటే ఓకే.. లేకపోతే' అంటూ భయంగానే ఆయనకు కాల్ చేశారు. ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసిన బాలయ్య ఎవరూ ఊహించని విధంగా చాలా సరదాగా మాట్లాడారు. కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే 'హా రోజా గారూ.. నమస్కారం' అంటూ సంస్కారంతో మాట్లాడారు. దీనికి రోజా 'బాగున్నారా?' అని అడగ్గా.. ఆయన 'బాగున్నా.. మీరెలా ఉన్నారమ్మా' అంటూ బదులిచ్చారు. ఆ తర్వాత రోజా 'మీరేం చేస్తున్నారు' అని అడిగారు. దీనికి 'అఖండ షూటింగ్‌లో ఉన్నా.. మన అఖండ షూటింగ్‌లో' అని చెప్పారు.

  అదిరిపోయే పంచ్ వేసిన బాలకృష్ణ

  అదిరిపోయే పంచ్ వేసిన బాలకృష్ణ

  ఈ ఫోన్ సంభాషణ సమయంలో రోజా 'మన కాంబోలో సినిమా ఎప్పుడని అడుగుతున్నారు.. బొబ్బిలి సింహాం పార్ట్ 2నా? భైరవద్వీపం పార్ట్ 2నా' అని అడిగారు. దీనికి బాలయ్య నవ్వుతూ 'మన కాంబినేషన్ కోసం అందరూ ఎదురు చూస్తారు' అంటూ బదులిచ్చారు. ఆ తర్వాత 'జబర్ధస్త్‌కు జడ్జ్‌గా కూడా వస్తాను. అందులో నాకెలాంటి అభ్యంతరం లేదు' అంటూ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇక, చివర్లో 'అభి, రాఘవ, ఆది హాయ్ బ్రో.. అందరూ నాకంటే పెద్దవాళ్లు.. నేను పదహారే కదా' అంటూ అదిరిపోయే పంచ్ వేశారు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అయిపోతోంది.

  స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

  Recommended Video

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
   ఆశ్చర్యపోయానని చెప్పిన అదిరే అభి

  ఆశ్చర్యపోయానని చెప్పిన అదిరే అభి

  రోజాతో బాలకృష్ణ మాట్లాడిన మాటలకు సెట్‌లో ఉన్న వాళ్లంతా షాక్ అయిపోయారు. ఇక, ప్రోమో చివర్లో అదిరే అభి మాట్లాడుతూ.. 'ఆయనకు ఫోన్ చేసేంత ధైర్యం ఉందా అని చెప్పి స్టార్టింగ్‌లో కొంచెం డౌట్ వచ్చింది. కానీ, ఒకసారి కన్ఫార్మ్ అయిన తర్వాత మాత్రం మా అందరికీ గుండెలు ఆగిపోయాయి' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో వచ్చే వారం ఎపిసోడ్ ఎంత స్పెషల్‌గా ఉండబోతుందో అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా రోజా.. బాలకృష్ణ మధ్య జరిగిన ఈ సంభాషణ మాత్రం హైలైట్ అనే చెప్పాలి.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Akhanda Movie Under Boyapati Srinu Direction. Now Roja Did Phone Call to Nandamuri Balakrishna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X