Just In
- 13 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 25 min ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
- 56 min ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 1 hr ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
Don't Miss!
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- News
అమరావతి ఉద్యమం 400 వ రోజు : గొల్లపూడిలో హై టెన్షన్ ; ఇంట్లోనే దీక్షకు దిగిన దేవినేని ఉమ
- Lifestyle
శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...
- Sports
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్
- Automobiles
స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వాళ్లిద్దరే నా ఫేవరెట్.. కానీ ఆ కంటెస్టెంట్‌దే విజయం: బిగ్ బిస్ విన్నర్‌పై రోల్ రైడా జోస్యం
రోల్ రైడా... ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా తెలుగు రాష్ట్రాల్లో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడీ కుర్రాడు. మొదట్లో పెద్దగా పరిచయం లేకపోయినా.. బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనడం ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. షోలో తనదైన శైలి ప్రవర్తనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు.. బయటకు వచ్చిన తర్వాత ర్యాప్ సాంగ్‌లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతున్న రోల్ రైడా.. బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్‌పై జోస్యం చెప్పాడు. అతడి అభిప్రాయంలో ఎవరు గెలుస్తారంటే....

ఫినాలే వీక్... ఐదుగురు కంటెస్టెంట్లు
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫినాలేకు చేరువైంది. ప్రస్తుతం జరుగుతోన్న చివరి వారంలో టాప్ -5 కంటెస్టెంట్లు ఆరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్‌లు టైటిల్ కోసం పోరాడుతున్నారు. డిసెంబర్ 20న జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఈ ఐదుగురిలో ఒకరు విజేతగా నిలవనున్నారు. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందరి అభిప్రాయంలో విన్నర్ అతడే
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారన్న దానిపై ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. బయట నెలకొన్న పరిస్థితుల ప్రకారం.. ఈ సీజన్‌కు అభిజీత్ విన్నర్ అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. అధికారిక ఓటింగ్ ఎలా ఉందో తెలియదు కానీ... అనధికారిక పోలింగ్‌లో మాత్రం అభిజీత్‌కే యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయి.

నాలుగో సీజన్‌కే అలాగ జరుగుతోంది
గతంలో బిగ్ బాస్ షోకు ఆదరణ లభించినప్పటికీ.. సినీ ప్రముఖుల నుంచి స్పందన ఉండేది కాదు. కానీ, ఈ సీజన్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీలు బయటకు వచ్చారు. తమ అభిప్రాయంలో పలానా కంటెస్టెంట్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరిలో కూడా ఎక్కువ మంది అభిజీత్‌నే విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

రోల్ రైడాకు బిగ్ బాస్ మీదే ప్రశ్నలు
బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్, ప్రముఖ సింగర్ రోల్ రైడా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోని తన ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ చాట్‌లో అతడికి ఎక్కువగా బిగ్ బాస్ నాలుగో సీజన్ గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఈ సీజన్‌లో ఎవరు గెలుస్తారు? పలానా కంటెస్టెంట్ గురించి ఏం చెబుతారు? అంటూ ఎంతో మంది ప్రశ్నించారు.

వాళ్లిద్దరే తన ఫేవరెట్ అని చెప్పాడు
ఈ చిట్ చాట్‌లో తన ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరో క్లారిటీ ఇచ్చాడు రోల్ రైడా. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘నాలుగో సీజన్‌లో ఆరియానా గ్లోరీ, దేత్తడి హారిక మాత్రమే నాకు క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే వాళ్లిద్దరే నా ఫేవరెట్ కంటెస్టెంట్లు. ఇద్దరిలో ఎవరూ గెలిచినా నాకు సంతోషమే. అందుకే ఈ ఇద్దరికే నేను ఓట్లు వేస్తున్నా' అంటూ వివరించాడీ తెలుగు ర్యాప్ స్టార్.

బిగ్ బిస్ విన్నర్‌పై రోల్ రైడా జోస్యం
ఇదే చిట్ చాట్‌లో బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు కాబోయే విన్నర్‌పైనా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘ఆరియానా గ్లోరీ, దేత్తడి హారికలో ఎవరైనా గెలవాలని కోరుకుంటున్నప్పటికీ.. బయట ట్రెండ్స్ చూస్తే ఈ సీజన్ అభిజీత్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అతడే గెలుస్తాడని అంటున్నారు. అనఫిషియల్ పోల్స్ కూడా అదే స్పష్టం చేస్తున్నాయి' అంటూ చెప్పుకొచ్చాడు.