»   » 'అత్తో అత్తమ కూతురో' నిర్మాతపై కోర్టుకు...

'అత్తో అత్తమ కూతురో' నిర్మాతపై కోర్టుకు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిరోష, జాకి, మహర్షి ప్రధాన పాత్రల్లో జెమినీటీవీలో ప్రసారం అవుతున్న ‘అత్తో అత్తమ్మ కూతురో' సీరియల్ పై వివాదం నెలకొంది. ఈ సీరియల్ నిర్మాతలపై కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు తెలుగు సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఈ టీవీ సీరియల్ లో ఇంకా రిలీజ్ కాని ‘తులసీదళం' సినిమా ట్రాక్ లను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆర్పీ పట్నాయక్ ఆరోపించారు.

ఆర్పీ పట్నాయక్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ‘తులసీదళం' సినిమా విషయానికొస్తే...అమెరికాలోని లాస్ వేగాస్ నేపథ్యంలో ఈ సినిమాలో నిశ్చల్ దేవా, వర్థనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ‘తులసీదళం సినిమా హారర్ తరహా చిత్రమే అయినా అందమైన ప్రేమకథ కూడా ఇందులో ఉంటుందని' దర్శకుడు తెలిపారు.

RP Patnayak petition on Atto Attama Kuturo Serial

ఈ చిత్రంలో ఆత్మలకు సంబంధించిన విషయాలపై పట్టు ఉన్న వైద్యుడిగా నటించినట్లు ఆర్పీ పట్నాయక్ తెలిపారు. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ ‘తులసీదళం'కు తమ చిత్రానికి సంబంధం లేదని ఆర్పీ తెలిపారు. ఆర్పీ పట్నాయక్ ఇప్పటికే ‘బ్రోకర్', ‘ఫ్రెండ్స్ బుక్' చిత్రాలను తెరకెక్కించినా అవి ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

English summary
RP Patnaik petition on Atto Attama Kuturo Serial producers.
Please Wait while comments are loading...