»   » బూతు ఫోటోలు: పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య

బూతు ఫోటోలు: పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఈ మధ్య కాలంలో సినిమా తారలు, టీవీ తారలు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొంత మంది కావాలని ప్రముఖుల ఫోటోలను, వీడియోలను అశ్లీలంగా, బూతు ఫోటోలతో మార్పింగ్ చేస్తున్నారు.

తాజాగా తమిళ టీవీ నటి ఎస్ లావణ్య కూడా ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటుంది. ఎవరో ఆమె ఫోటోలును అశ్లీలంగా మార్పింగ్ చేసి ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసి సోషల్ మీడియాలో స్ర్పెడ్ చేసారు. తన ముఖంతో ఉన్న బూతు ఫోటోలతో దీపిక పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసారు.

S Lavanya alleges morphed pics of her posted on social sites

ఈ విషయమై లావణ్య చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు ఇంటర్నెట్లో ఆమె పేరుతో ఉన్న ప్రొఫైల్ బ్లాక్ చేయించారు. అయితే ఆమెకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు మాత్రం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాలపై లావణ్య ఆందోళన వ్యక్తం చేస్తోంది.

గతంలో పలువురు సినీ స్టార్స్ సైతం ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ మీడియా వల్ల లాభాలతో ఇలాంటి అనర్ధాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోలు మార్ఫింగ్ చేసింది ఎవరు? అనే విషయాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
A television artist lodged a complaint with the city police commissioner's office on Friday stating that morphed pictures of her had been uploaded on social networking sites.
Please Wait while comments are loading...