Just In
- 7 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 7 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 7 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
- 8 hrs ago
శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్లో చిరంజీవి ఎమోషనల్
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- News
మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రేమ అనేది కూడా ఓ ఫీలింగే.. మారదన్న గ్యారెంటీ ఏంటని అడుగుతున్న మెగా హీరో
మెగా హీరోల్లో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాడు సాయి ధరమ్ తేజ్. కెరీర్ ప్రారంభంలో వరుసగా హిట్స్ కొట్టిన సుప్రీమ్ హీరో.. ఆపై దారి తప్పాడు. మూసధోరణిలో సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టాడు. అయితే గత రెండు చిత్రాల నుంచి తన పంథాను మార్చుకుని మళ్లీ సక్సెస్ రుచి చూశాడు. ఇన్నాళ్లకు ఈ హీరోకు తత్త్వం బోధపడినట్టు తెలుస్తోంది.
మాస్ మంత్రం జపించడం కంటే.. కొత్త కథలకు ఓకే చెబితేనే ప్రేక్షకుల చేత శభాస్ అనిపించుకుంటామని లేటుగా తెలుసుకున్నాడు. అందుకే ఇంటెలిజెంట్, విన్నర్, తిక్క ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి చిత్రాలు చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో అప్పటి నుంచి చిత్రలహరి, ప్రతిరోజు పండగే వంటి మంచి చిత్రాలు వచ్చాయి. ఇకపై కథ, కథనాలుండే మంచి స్క్రిప్ట్‌లనే ఓకే చేయాలని ఫిక్ష్ అయ్యాడు.

ఆ క్రమంలో మరో వినూత్న చిత్రం రాబోతోంది. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ టైటిల్‌తోనే ఆకట్టుకున్నాడు మెగా హీరో. షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. సింగిల్‌గా బతికితే ఎన్ని ఉపయోగాలున్నాయో చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నాడు. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా సోలో బ్రతుకే సో బెటర్ థీమ్ వీడియోను రిలీజ్ చేశారు.
సింగల్ సోదరసోదరీమణులారా...This is about our feeling when ever others celebrate Valentine's Day #Solobrathukesobetter #SBSB
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 13, 2020
Here’s the link guys...hope you like it https://t.co/WzFcijFT5f @SVCCofficial @MusicThaman @subbucinema @NabhaNatesh @bkrsatish
ఆ వీడియోలో జీవితాంతం బ్రహ్మాచారులుగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలామ్, ఆర్ నారాయణ మూర్తి, జయలలిత, మదర్ థెరిస్సా, ఎల్‌కే అద్వానీ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని యువతకు స్పీచ్ ఇస్తున్నాడు. ప్రేమ అనేది కూడా ఓ ఫీలింగే కదా.. మారకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించి యువతలో స్ఫూర్తినింపుతున్న ఈ థీమ్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌కు జోడిగా నభా నటేష్ నటిస్తోంది. సుబ్బు దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.