మామ నీవు లేకపోతే.. కలలో కూడా ఊహించలేదు.. బిగ్‌బాస్ హోస్ట్‌గా సమంత ఎమోషనల్

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని వైల్డ్ డాగ్ షూటింగ్ కారణంగా బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోకు దూరం కావడంతో ఆయన స్థానంలో కోడలు పిల్ల సమంత అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించడం, ఆ తర్వాత లక్షలాది మంది హృదయాలను దోచుకోవడం తెలిసిందే. హోస్ట్‌గా వ్యవహరించడానికి ధైర్యం కల్పించిన మామయ్య నాగార్జునకు భావోద్వేగంగా లేఖ రాస్తూ..

 బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా గొప్ప అనుభూతి

బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా గొప్ప అనుభూతి

బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తానని కలలో కూడా ఊహించలేదు. అదొక గొప్ప అనుభూతి. నా మామయ్య నన్ను నమ్మి.. ఆ బాధ్యతను నాకు అప్పగించడం వల్లే సాధ్యమైంది. తెలుగు మాట్లాడగలుగుతానా? హోస్టింగ్‌ అనుభవం లేదు. నాలో ఓ భయం వెంటాడింది. అయితే నాలోని భయాన్ని అధిగమించడానికి ఆయన మనోధైర్యాన్ని ఇచ్చారు అని సమంత తన లేఖలో పేర్కొన్నారు.

మహా ధైర్యాన్ని ఇచ్చావు

మహా ధైర్యాన్ని ఇచ్చావు

అయితే హోస్ట్‌గా వ్యవహరించడానికి ముందు బిగ్‌బాస్‌కు సంబంధించిన ఏ ఒక్క ఎపిసోడ్‌ కూడా చూడలేదు. అలాంటిది మూడు గంటలపాటు మారథాన్ షోను నిర్వహించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. మహా ఎపిసోడ్‌ను విజయవంతంగా నిర్వహించడానికి దైర్యాన్ని ఇచ్చావు. మీరు నాకు సహకరించినందుకు, నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ మామా అంటూ తన లేఖలో భావోద్వేగానికి లోనయ్యారు.

హృదయపూర్వకంగా స్వీకరించినందుకు

హృదయపూర్వకంగా స్వీకరించినందుకు

దసరా మహా ఎపిసోడ్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన తర్వాత నాకు భారీ స్పందన కనిపించింది. హొస్ట్‌గా నన్ను హృదయపూర్వకంగా గొప్పగా స్వీకరించినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. మహా ఎపిసోడ్‌కు అనూహ్య స్పందన వస్తున్న క్రమంలో ఎగిరి గంతేయాలన్నంతగా సంతోషంలో మునిగిపోయాను అని సమంత సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జీకే మోహన్ గారికి ధన్యవాదాలు..

జీకే మోహన్ గారికి ధన్యవాదాలు..

ముఖ్యంగా నేను హోస్ట్‌గా వ్యవహరించడానికి కారణమైన జీకే మోహన్ గారికి, నాలో నమ్మకం కలిగించినందుకు.. అలాగే నా చేతిపట్టుకొని నడిపించనందుకు ఆయనకు థ్యాంక్స్. మహా ఎపిసోడ్ సక్సెస్ కావడానికి ఆయన ప్రధాన కారణం అంటూ సమంత తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. మహా ఎపిసోడ్ సందర్భంగా సహకరించిన తన టీమ్ సభ్యులకు సమంత ధన్యవాదాలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X