సమంత పనైపోయినట్లే? హీరోయిన్లు ఆ విషయంలో జాగ్రత్త.. టాప్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే ఖచ్చితంగా ఉండే పేరు సమంత రూత్ ప్రభు. తమిళనాడుకు చెందిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు చదువుకోవడానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న సామ్.. తన కష్టం, ప్రతిభతో సెలబ్రెటీగా మారారు. ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నప్పటికీ మూలాలు మరిచిపోకుండా ఎంత ఎదిగినా ఒదిగే ఉంటున్నారు. కెరీర్, వ్యక్తిగత జీవితం పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటికి తట్టుకుని నిలబడ్డారు. అయితే ఆమె గతంలో మాదిరిగా వరుసపెట్టి సినిమాలు చేయకపోవడం సమంత అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. తాజాగా సమంత కెరీర్‌పై టాప్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
కష్టంతో స్టార్‌డమ్
సమంత స్టార్‌డమ్ రాత్రికి రాత్రి వచ్చింది కాదు.. దీని వెనుక ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఉన్నాయి. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చదువుకోవడం కష్టం కావడంతో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టుకున్నారు. తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేశావే సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ టాప్‌కి చేరారు. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారు.

చైతూతో పెళ్లి, విడాకులు
ఏమాయ చేశావే సినిమాలో తనతో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత ఆయనను పెళ్లాడారు. అయితే నాలుగేళ్లు తిరిగేసరికి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో చైతూకి విడాకులిచ్చారు. ఆమె నిర్ణయం సినీ ప్రపంచాన్ని, అభిమానులను షాక్‌కు గురిచేసింది. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ అవరోధాలను ఎదుర్కోవడానికి మానసికంగా బలంగా ఉండటానికి ఆధ్యాత్మికత వైపు వెళ్లారు సమంత. ఈ క్రమంలో ఆమెకు అరుదైన మయోసైటిస్ అనే వ్యాధి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చికిత్స తీసుకుంటూనే సినిమాలను పూర్తి చేశారు.
వరుసగా ప్లాపులు
అంతకుముందు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసిన సమంత.. ఆ తర్వాత పూర్తిగా తగ్గించేశారు. దానికి తోడు సామ్ నటించిన యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలు ఫ్లాప్ కావడం కూడా సినిమాలకు దూరంగా ఉండటానికి కారణంగా తెలుస్తోంది. అయితే ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లతో సమంత అలరించారు. ఇదే సమయంలో నిర్మాతగా మారి శుభం అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాతో పాటు రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్‌లలో సమంత నటిస్తున్నారు.
సమంత క్రేజ్ తగ్గలేదు
కాగా.. సమంత సినిమాలను తగ్గించేయడంపై ప్రముఖ దర్శకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సమంత 30 ప్లస్‌లో ఉన్నారని ఆమె మెచ్యూర్డ్ క్యారెక్టర్లు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పనికొస్తారని అన్నారు. సమంతకి ఇప్పటికీ మంచి ఇమేజ్ ఉందని అయితే విడాకుల కేసుతో పాటు తనకు మయోసైటీస్ అనే వ్యాధి ఉందని చెప్పడం కొంత ఇబ్బంది కలిగించిందన్నారు. నాకు ఫలానా రోగం ఉందని అప్పుడప్పుడు సమంత వాగుతూ ఉంటుంది.. చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్లు ఇలాంటి విషయాలను అస్సలు బయటపెట్టొద్దుని గీతాకృష్ణ హెచ్చరించారు.
ఆ డైరెక్టర్ ఆఫర్ ఇస్తే తిరస్కరించింది
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలిలో సముద్రంలో ఎక్కువ షూటింగ్ ఉండటంతో సమంత ఆ ఆఫర్ తిరస్కరించింది. ఒక లెవల్‌కు వచ్చిన తర్వాత డైలీ షూటింగ్‌కు వెళ్లడం బోర్ కొట్టేస్తుంది.. ఇది చాలు అనుకుంటారని గీతాకృష్ణ అన్నారు. సమంత ఇప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారేమో.. కానీ ఆమెకు మంచి మార్కెట్ ఉందన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











