సందీప్ రెడ్డి వంగ X ఆర్జీవీ.. మంట పెట్టేశారుగా.. ఏంటంటే?
టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. అక్కినేని నాగార్జునతో శివ చిత్రాన్ని తొలిసారిగా తెరకెక్కించిన సంగతి విదితమే. ఆ సినిమాతో అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఫిల్మ్ మేకింగ్ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేశాడు. 1989లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యువతలో సంచలనంగా మారింది. రీసెంట్ గా 25 ఏళ్ల సెలబ్రేషన్స్ ను కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించారు. బాలీవుడ్ లో ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు.
ఫిల్మ్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఉన్న వారందరూ రామ్ గోపాల్ వర్మను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు ఆయన తెరకెక్కించిన చిత్రాలను ఇప్పటికీ ఇన్ స్ఫైర్ అవుతూ ఉంటారు. ఇక ఆయన కంపౌండ్ నుంచి ఎంతో మంది దర్శకులు వచ్చి సూపర్ హిట్ చిత్రాలు తీశారు. ఇక అచ్చం రామ్ గోపాల్ వర్మను పోలి ప్రస్తుత జనరేషన్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫిల్మ్ మేకింగ్ లో కొత్త సూత్రాలను పరిశోధిస్తూ నయా ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. కాగా రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగను ఎన్నో మార్లు ప్రశంసించాడు.

సందీప్ రెడ్డి వంగ X రామ్ గోపాల్ వర్మ అనేలా ఒక ఇంటర్వ్యూ కోసం అభిమానులు చూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా జీతెలుగు ఛానెల్ లో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి హోస్ట్ గా జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో కొనసాగుతోంది. ఈ టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఇక వీరిద్దరూ కలిసి హాజరైన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రోమోలోనే వీరిద్దరి మాటలు ఆసక్తికరంగా మారాయి. ప్రోమో ప్రకారం.. డెవిల్ గా రామ్ గోపాల్ వర్మను, యానిమల్ గా సందీప్ రెడ్డి వంగను జగపతి బాబు షోకు ఆహ్వానించారు.
ప్రేక్షకుల కోసం సినిమా ఎప్పుడు తీస్తావమని జగపతి బాబు రామ్ గోపాల్ వర్మను అడుగుతారు. రామ్ గోపాల్ స్పందిస్తూ లైఫ్ లో నేను నేర్చుకున్నది ఒక్కటే. మనం ఏం చెప్పినా ఎవ్వరూ పట్టించుకోరని బదులిస్తాడు. ఇక సందీప్ రెడ్డి వంగ మాటలు చెంప మీద కొట్టినట్టే ఉంటాయి. 30 ఏళ్లు సంపాదించుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ను సందీప్ ఒక్క దెబ్బతో తీసేస్తాడని చెబుతాడు. ఆ తర్వాత సందీప్ మాట్లాడుతూ సార్ నేను మీ క్లాస్ మేట్ అయితే ఎలా ఉండేదని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తానని అంటాడు. కానీ ఇద్దరిలో ఒకరు అమ్మాయి అయ్యింటే అని ఆర్జీవీ షాకింగ్ గా ఆన్సర్ ఇస్తారు. ఆ తర్వాత జగపతి అమ్మాయిల గురించి అడిగితే మమ్మల్ని మేం ప్రేమించుకోవడానికే టైమ్ లేదంటే ఇంకా అమ్మాయిలను ఎక్కడ ప్రేమించాలని అంటాడు. ఇలా వారిద్దరి మధ్య కన్వర్జేషన్ ఆకట్టుకుంటోంది. ఫుల్ ఎపిసోడ్ జీ5లో సెప్టెంబర్ 5న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇక ఫుల్ ఇంటర్వ్యూ వస్తే బాగుంటుందని వారి అభిమానులు, తెలుగు ఆడియెన్స్ కూడా ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరు కలిసి హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సినిమాటిక్ ఎక్స్ పో ఈవెంట్ కు గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిల్మ్ మేకింగ్ లోని మెళకువలను, కెమెరా గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. తమ అనుభవాన్ని అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్స్, సినిమాటోగ్రాఫర్స్ తో పంచుకున్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ తాజాగా కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











