Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వాడికి చెప్పు.. నాకెందుకు చెబుతున్నావు.. అఖిల్‌పై కోపంతో మోనాల్ దుమ్ము దులిపిన సోహెల్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో మంగళవారం ఎపిసోడ్‌లో సయ్యద్ సోహెల్ గుర్రుగా కనిపించాడు. అయితే టాస్కుల సమయంలో హుషారుగా కనిపించిన సోహెల్.. అఖిల్ వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందినట్టు కనిపించాడు. అయితే వారిద్దరిని కలిపిందుకు ప్రయత్నించిన మోనాల్‌ను దుమ్ముదులిపేశాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగిందంటే..

అరియానాకు సోహెల్ సపోర్టు
రూలర్ టాస్క్ ముగిసిన తర్వాత బెస్ట్ ఫెర్ఫార్మర్‌ను ఎంపిక చేయమని ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఆదేశించాడు. దాంతో తమకు నచ్చిన విధంగా ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అరియానాకు, అభిజిత్, సోహెల్ సపోర్టు చేయగా ఆమె బెస్ట్ ఫెర్ఫార్మర్‌గా నిలిచింది. అయితే మోనాల్ కాకుండా అరియానాకు సపోర్టు చేయడంతో అఖిల్ మనస్తాపానికి గురయ్యాడు. మోనాల్ కూడా తనకు సపోర్టు చేయకపోవడంపై కంటతడి పెట్టుకొంటూ కనిపించింది.

సోహెల్ తీరుతో అఖిల్ మనస్తాపం
అయితే అప్పటికే పలు విషయాల్లో సోహెల్ తీరుతో అఖిల్ మనస్తాపం చెందారు. అరియానాకు ఓటు వేయడం కూడా వారి మధ్య కొంత గ్యాప్‌ను పెంచింది. మోనాల్ విషయంలో స్టాండ్ తీసుకోలేదనే విషయం అఖిల్ ముఖంలో కనిపించింది. దాంతో సోహెల్‌తో మాట్లాడటానికి నిరాకరించాడు.

సోహెల్, అఖిల్ గొడవలో మోనాల్ జోక్యం
సోహెల్, అఖిల్ గొడవలో మోనాల్ జోక్యం చేసుకొంటూ ఇంటిలో ప్రతీ రోజు సోహెల్, అఖిల్ కలిసి డిన్నర్ చేస్తారు. కానీ ఈ రోజు ఎందుకు చేయలేదు అంటూ మోనాల్ అడిగింది. దాంతో చిర్రెత్తుకు వచ్చిన సోహెల్.. ఆ విషయం వాడిని అడుగు. ప్రతీసారి నన్నే ఎందుకు టార్గెట్ చేస్తావు. నీవు అటు సైడ్ ఎందుకు ఆలోచించవు అంటూ దుమ్ము దులిపాడు.

నేను సారీ చెప్పాను అంటూ సోహెల్
అఖిల్ తీరు గురించి మాట్లాడుతూ.. నేను సారీ చెప్పాను. ఆ తర్వాత కూడా అలానే బిహేవ్ చేస్తే నేను ఎం చేయాలి. నీవే అఖిల్‌కు చెప్పు. నాతో ఎలా ఉండాలో అంటూ మోనాల్‌ను కడిగిపడేసినంత పని చేశాడు. దాంతో మోనాల్ మౌనంగా ఉండిపోయింది. సోహెల్ కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేసింది.

సోహెల్‌కు అఖిల్ కౌగిలింత
ఆ తర్వాత అఖిల్‌తో మాట్లాడి సోహెల్‌తో మాట్లాడమని నచ్చ జెప్పింది. దాంతో సోహెల్ వద్దకు వెళ్లి అఖిల్ కౌగిలించుకొన్నాడు. దాంతో ఇదే పని ముందే జేస్తే ఇంత టెన్షన్ ఉండదు కదా.. అంటూ కామెంట్ చేశాడు. అలా మళ్లీ వారిద్దరు కలుసుకొని నవ్వుకున్నారు.