Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అవినాష్‌ను ఓ ఆట ఆడుకున్నారు.. శేఖర్ మాస్టర్ మామూలోడు కాదు!
బుల్లితెరపై ఒక్కోసారి వెరైటీ స్కిట్లు, వెరైటీ టాస్కలు ఇస్తుంటారు. ఎవరికి ఏ పని రాదో వాటినే చేయిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు. జబర్దస్త్ షోలో ఈ విధానం ఎక్కువగా ఉంటుంది. స్కేటింగ్ రాకపోయినా కాళ్లకు కట్టించి మరీ స్కిట్లు వేయిస్తారు. మిరపకాయలను తినిపిస్తూ స్కిట్లు వేయిస్తుంటారు. స్టేజ్ మీద ఆయిల్ రాసి జారుతూ ఉంటే కూడా స్కిట్లు వేయాల్సిందే అని కండీషన్స్ పెడుతుంటారు. అలా ఆర్టిస్ట్‌లు ఆపసోపాలు పడుతూ ఉంటే అక్కడున్న జడ్జ్‌లు మాత్రం తెగ నవ్వుతూ ఉంటారు. తాజాగా శేఖర్ మాస్టర్ కూడా అవినాష్‌ను అలానే ఆడుకున్నాడు.

కామెడీ స్టార్స్..
బిగ్ బాస్ ముగిశాక అవినాష్‌కు సపరేట్‌గా ఎక్కడా ఆఫర్స్ రాలేదు. అయితే జబర్దస్త్‌కు ధీటుగా ఓ షో చేయాలని స్టార్ మా డిసైడ్ అయింది. అందుకే అవినాష్‌ను ముందు పెట్టి ఈ కామెడీ స్టార్స్ షోను ప్రారంభించింది. ప్రస్తుతం కామెడీ స్టార్స్ షోను అవినాష్ ముందుండి నడిపిస్తున్నాడు.

మంచి టీంతో..
అయితే కామెడీ స్టార్స్ షోకు మంచి టీం కుదిరింది కూడా. యాంకర్‌గా వర్షిణి బాగా సూట్ అయింది. ఇక జడ్జ్‌లు శేఖర్ మాస్టర్, నాటి హీరోయిన్ శ్రీదేవీ బాగానే ఉన్నారు. అయితే జడ్జ్‌గా శేఖర్ మాస్టర్ చేసే అల్లరి, కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే.

రెండో ఎపిసోడ్..
గత ఆదివారం ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ కామెడీ స్టార్స్ బాగానే క్లిక్ అయింది. అలా రెండో ఎపిసోడ్ కోసం మళ్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్లనే అవినాష్ నమ్ముకున్నట్టుంది. ఈ సారి ఎపిసోడ్ సోహెల్ కూడా కనిపించబోతోన్నట్టున్నాడు. ఆల్రెడీ అరియానా, అషూలు కూడా దుమ్ములేపుతున్నారు.

తాజాగా అలా..
అయితే తాజాగా అవినాష్‌ను శేఖర్ మాస్టర్ ఆడుకున్న ప్రోమో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అవినాష్‌ను స్కేటింగ్ వచ్చా? అని శేఖర్ మాస్టర్ అడుగుతాడు. రాదు మాస్టర్ అంటూ అవినాష్ బదులిస్తాడు. అయితే అదే చేయ్ అంటూ అవినాష్‌ను ఇరికించేశాడు.

ఆపసోపాలు పడ్డాడు...
ఇక స్కేటింగ్ రాకపోవడంతో అవినాష్ తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేక నానా తంటాలు పడ్డాడు. ఇక అవినాష్ ఎంత ప్రయత్నించినా కూడా స్కిట్ చేయలేకపోయినట్టున్నాడు. నిల్చోడానికే అవినాష్ ఆపసోపాలు పడ్డాడు. చివరకు యాంకర్‌గా ఉన్న వర్షిణి కూడా సాయం చేయలేదు. అవినాష్‌ను కింద పడేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.