Don't Miss!
- News
రామానుజాచార్యులవారి బ్రహ్మోత్సవాలు- 12 రోజుల పాటు: కంప్లీట్ షెడ్యూల్ ఇదే..!!
- Lifestyle
మొదటి నెలల్లో గర్భస్రావం జరగడానికి కారణాలు, ఈ చిట్కాలతో సేఫ్‌గా ఉండొచ్చు
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
క్యాష్ షోలో ఊహించని సంఘటన: సుమ క్యారెక్టర్‌పై నటి కామెంట్స్.. తొలిసారి ఏడ్చిన యాంకర్
తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా చక్రం తిప్పుతూ.. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ తనకు తానే సాటి.. తనకు ఎవరూ లేరు పోటీ అన్నట్లుగా దూసుకుపోతోంది సుమ కనకాల. పేరుకు కేరళ అమ్మాయే అయినా.. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉండే ఆమె.. అనర్గళంగా మాట్లాడుతూ ఎంతటి వారినైనా మాయ చేస్తోంది. అదే సమయంలో అద్భుతమైన టైమింగ్‌తో అదరగొడుతూ ప్రతి కార్యక్రమాన్ని వన్ ఉమెన్ షోగా మార్చేస్తుంది.
తద్వారా షోలను సక్సెస్ చేయడంతో పాటు ఫాలోయింగ్‌ను కూడా భారీగా పెంచుకుంటోంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన క్యాష్ షోలో యాంకర్ సుమ తొలిసారి ఏడ్చింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

బుల్లితెర ఆల్‌రౌండర్‌గా సుమ
ఎవరికీ సాధ్యం కాని రీతిలో దాదాపు రెండు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ.. దూసుకుపోతూనే ఉంది యాంకర్ సుమ. అద్భుతమైన హోస్టింగ్‌తో కట్టి పడేసే సుమ.. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా తెలుగులో ఉన్న అన్ని ఛానెళ్లలోనూ వరుసగా షోలు చేస్తోంది. తద్వారా ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంటోంది.
బెడ్‌పై యమ హాట్‌గా యాంకర్ శ్రీముఖి: అలా పడుకుని మరీ అందాల ఆరబోత

ఏదైనా యాంకర్ సుమదే హవా
బుల్లితెరపై టాప్ యాంకర్‌గా ఉన్న సుమ.. వెండితెరపైనా తన మార్క్ చూపిస్తోంది. టీవీ షోలతో పాటు సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. సుమ వస్తే మా సినిమా హిట్టే అనుకునే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలో పాటు యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటుతూ ముందుకెళ్తోంది.

ఫన్నీగా సాగిపోతోన్న సుమ షో
సుమ ప్రస్తుతం హోస్ట్ చేస్తోన్న షోలలో క్యాష్ చాలా ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతోంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇక, ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ అవడానికి దీనిని సుమ కామెడీ టైమింగే ప్రధాన కారణం.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన ప్రియాంక సింగ్: వామ్మో మరీ ఇంత దారుణంగానా!

సెలెబ్రిటీలకు సుమ చుక్కలు
యాంకర్‌గా సుదీర్ఘమైన ప్రయాణంలో సుమ ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ చుక్కలు చూపిస్తుంటుంది.

వచ్చే వారం సీనియర్ నటులు
వచ్చే శనివారం ప్రసారం కానున్న 'క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో తమదైన పాత్రలతో ప్రేక్షకులను సుదీర్ఘ కాలం అలరించిన కృష్ణవేణి, సుభాషిని, బాలాజీ, జెన్నీలు గెస్టులుగా వచ్చారు. వీళ్లతో సుమ తెగ సందడి చేసింది. మరీ ముఖ్యంగా ఇందులో కొందరిని ఈ సీనియర్ యాంకర్ తనదైన శైలి టైమింగ్‌తో ఫన్నీ గేమ్స్ కూడా ఆడించింది.
ప్యాంట్ లేకుండా సరయు రచ్చ: అదొక్కటి అడ్డు లేకపోతే అంతే సంగతులు
సుమ క్యారెక్టర్ బయట పెట్టేసి
'క్యాష్' షోలో భాగంగా గెస్టుగా వచ్చిన సుభాషిని.. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే ఆమె యాంకర్ సుమ క్యారెక్టర్ గురించి ఊహించని వ్యాఖ్యలు చేశారు. 'నేను ఈరోజు ఇలా ఆరోగ్యంగా ఇక్కడ ఉన్నానంటే కారణం సుమే. ఆమె ప్రతి ఆరు నెలలకు ఒకసారి నాకు కావాల్సిన మందులు పంపిస్తుంటుంది' అని చెప్పుకొచ్చారు.

సుమ కన్నీరు.. నాకే పుట్టాలని
ఆ
తర్వాత
సుభాషిని
మరింత
ఎమోషనల్
అయ్యారు.
'మళ్లీ
నాకు
మానవ
జన్మంటూ
ఉంటే..
నా
కడుపున
నువ్వు
పాపవై
పుట్టాలి'
అంటూ
ఏడ్చేశారామె.
దీంతో
సుమ
ఏడ్చుకుంటూ
వెళ్లి
ఆమెను
హత్తుకుంది.
అంతేకాదు,
ఆమెకు
ముద్దులు
కూడా
పెట్టింది.
ఆ
సమయంలో
సుభాషిని
'నువ్వు
బంగారు
తల్లివమ్మా'
అని
వెక్కి
వెక్కి
ఏడ్చారు.
ఈ
వీడియో
ఇప్పుడు
వైరల్
అవుతోంది.