లవ్ ఫెయిల్యూర్.. అతన్ని చచ్చేలా కొట్టా.. సీక్రెట్స్ బయట పెట్టిన నవ్య స్వామి

నాపేరు మీనాక్షి సీరియల్‌తో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది నవ్య స్వామి. బుల్లితెర హీరోయిన్స్ లో తనకంటూ సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ తన లవ్ స్టోరీని రివీల్ చేసింది. అలీతో సరదాగా షోకి వెళ్ళిన ఆమె తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

డాక్టర్ కాబోయి యాక్టర్

డాక్టర్ కాబోయి యాక్టర్

కర్నాటకలోని మైసూర్ కి చెందిన ఈ భామకు డాక్టర్ కావాలని ఉండేదట. అయితే ఓసారి కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది నవ్య. ఆమె నటించిన 'తంగళి' సీరియల్ కన్నడ నాట సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తమిళ సీరియల్ 'వాణీ రాణీ'లో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తెలుగులో నా పేరు మీనాక్షి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా 'ఆమెకథ' సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తోంది.

రవికృష్ణతో లవ్

రవికృష్ణతో లవ్

ఇక ఈ భామ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన టీవీ నటుడు రవికృష్ణతో ప్రేమలో ఉందనే రూమర్స్ వినిపించాయి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన 'ఆమె కథ' అనే సీరియల్ చేస్తున్నారు. ఈ సీరియల్‌లో రవికృష్ణ, నవ్య స్వామి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో ఈ జంట బుల్లితెరపై పాపులర్ అయింది. ఈ మధ్య ఈటీవీలో వస్తున్నా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో కూడా జంటగా పాల్గొన్నారు.

లవ్ మీద క్లారిటీ

లవ్ మీద క్లారిటీ

ఈ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో భాగంగా రవికృష్ణ, నవ్య స్వామిలకి పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఈ పెళ్లి తర్వాత వీళ్లిద్దరి సంబంధంపై రూమర్లు మరింత పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అయితే ఈ రూమర్స్ మరింతగా వ్యాపిస్తున్న నేపథ్యంలో నవ్య స్వామి క్లారిటీ కూడా ఇచ్చారు. రవికృష్ణ తనకు స్నేహితుడు మాత్రమే అని చెప్పి రూమర్లను ఆమె కొట్టిపారేశారు.

అమ్మ ఫీల్ అయింది

అమ్మ ఫీల్ అయింది

ఇక ఈ పుకార్లతో తన తల్లి చాలా ఫీలయ్యారని కూడా ఆ మధ్య నవ్య చెప్పుకొచ్చింది. ఈ రూమర్లను పట్టించుకోవద్దని తన తల్లికి సూచించానని.. అయినప్పటికీ ఈ నిరాధారమైన రూమర్ల వల్ల తన ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయింది అని ఆమె తెలిపారు. అయితే తాజాగా అలీతో సరదాగా షోలో ఆమె తన సహ నటి శ్రీవాణితో కలిసి పాల్గొన్నారు.

 అతనితో బ్రేకప్

అతనితో బ్రేకప్

ఈ క్రమంలో అలీ నవ్య బ్రేకప్ గురించి ప్రస్తావించడంతో ఆమె నిజమే అని ఒప్పుకుంది. ఒకప్పుడు తాను ప్రేమలో ఉన్న విషయం నిజమేనని ఒప్పుకున్న ఆమె ఆ ప్రేమ వర్కౌట్ కాకపోవడంతో తప్పుకున్నానని చెప్పుకొచ్చింది. మళ్ళీ ఆ తరువాత ఆ వ్యక్తితో మాట్లాడలేదని ఆమె పేర్కొంది. ఇక ఆ మాట చెబుతూ ఆమె ఎమోషనల్ అయింది, ఆమె కంట కన్నీరు కూడా కనిపించింది.

Recommended Video

Karthik Rapolu Gives Suggestions To Debut Directors | Ek Mini Katha
 చచ్చేట్టు కొట్టా

చచ్చేట్టు కొట్టా

ఇక కెరీర్ మొదట్లో ఒక ఈవెంట్ మేనేజర్ తో గొడవ అయిన విషయాన్ని కూడా అలీ ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆమె అతన్ని చచ్చేటట్టు కొట్టానని చెప్పుకొచ్చింది. అయితే ఎందుకు కొట్టాను ? అనే విషయాన్ని మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. బహుసా ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X