Just In
- 17 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 26 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రవికృష్ణ ఇంట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ల పార్టీ.. కరోనా పాజిటివ్ రావడంతో అందరూ ఇలా.!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోటీ పోటీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే టెలివిజన్ రంగంలోకీ ఈ వైరస్ ఎంటర్ అయింది. ఈ మధ్య పలువురు నటీనటులు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ నేపథ్యంలో ఇటీవల కోవిడ్ - 19 బారిన పడిన సీరియల్ యాక్టర్ రవికృష్ణ.. తన స్నేహితులు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు గురించి ఓ షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు. ఆ వివరాలు మీకోసం.!

షూటింగ్ ప్రారంభం... అంతలోనే షాక్
లాక్‌డౌన్ కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు షూటింగులు అన్నీ నిలిచిపోయాయి. అయితే, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం షూటింగ్‌లకు అనుమతినిచ్చింది. దీంతో బుల్లితెర కార్యక్రమాల చిత్రీకరణ కూడా మొదలైంది. అలా షూటింగ్ ప్రారంభమైందో లేదో.. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ఓ సీరియల్‌లోని నటుడు కరోనా పాజిటివ్‌గా తేలాడు.

వాళ్లతో పాటు హీరో హీరోయిన్‌కు కరోనా
సీరియల్ యాక్టర్ ప్రభాకర్‌కు కరోనా వచ్చిందన్న న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆమె కథ' ఫేం నవ్య స్వామి కూడా ఆ వైరస్ బారిన పడింది. ఈ న్యూస్ బయటకు వచ్చిన రెండు రోజులకే ఆ సీరియల్ హీరో, బిగ్ బాస్ ఫేం రవికృష్ణ కూడా కోవిడ్ బాధితుడిగా తేలడం కలకలం రేగింది.

స్వయంగా ప్రకటన.. ఏమీ కాలేదని క్లారిటీ
తనకు కరోనా వ్యాధి సోకిందని రవికృష్ణ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో తనకు కరోనా లక్షణాలేవీ లేవని, చాలా ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించాడు. అలాగే, తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరాడు. అంతేకాదు, కరోనా సోకిన వారిని వివక్షతో చూడవద్దని రవికృష్ణ అభ్యర్థించాడు.

శివజ్యోతితో లైవ్ చాట్.. అన్నీ చెప్పాడు
కరోనా వ్యాధి సోకడంతో ఇంట్లోనే స్వీయ చికిత్స తీసుకుంటున్నాడు సీరియల్ యాక్టర్ రవికృష్ణ. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అతడు సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫేం శివజ్యోతి అలియాస్ సావిత్రక్కతో లైవ్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. అలాగే, శివజ్యోతి అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.
|
రవికృష్ణ ఇంట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ల పార్టీ
గత నెల 9న రవికృష్ణ పుట్టినరోజు పార్టీ జరిగింది. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు హిమజ, శివజ్యోతి, రోహిణి, అలీ రేజా సహా మరికొందరు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను వీళ్లంతా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. అది జరిగిన కొద్ది రోజులకే రవికృష్ణకు కరోనా అని తేలింది. దీంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ల పరిస్థితి ఎంటన్న ప్రశ్న తలెత్తింది.

కరోనా పాజిటివ్ రావడంతో అందరూ ఇలా.!
ఈ లైవ్ చాట్‌లో రవికృష్ణ మాట్లాడుతూ... ‘మీ అందరికీ కరోనా వస్తుందేమో అని భయపడ్డా. నాలా ఎవరూ ఆ వ్యాధి బారిన పడకూడదని కోరుకున్నా' అంటూ శివజ్యోతితో చెప్పుకొచ్చాడు. దీంతో తనతో పుట్టినరోజు పార్టీలో పాల్గొన్న వారందరూ కరోనా టెస్ట్ చేయించుకున్నారని రవికృష్ణ పరోక్షంగా వెల్లడించాడు. వాళ్లెవరికీ వ్యాధి సోకకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.