For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆమెపై యాసిడ్ దాడి చేస్తాం: బిగ్ బాస్ వివాదం, అతడి అభిమానులేనా?

  |

  సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 12 సీజన్ గతవారం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే షో ముగిసినా ఆ హ్యాంగోవర్ నుంచి అభిమానులు బయట పడలేదు. ఈ సీజన్ టైటిల్ నటి దీపిక కాకర్ దక్కించుకోగా... మాజీ క్రికెటర్ శ్రీశాంత్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

  అయితే శ్రీశాంత్ అభిమానులు ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. కలర్స్ ఛానల్, బిగ్ బాస్ నిర్వాహకులు.... తెర వెనక గోల్ మాల్ చేశారని, అతడికి రావాల్సిన టైటిల్ ఆమెకు వచ్చేలా పరిస్థితులు కల్పించారని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ విషయమై దీపికపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో పాటు.... హద్దులు దాటి ఆమెపై యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

  దీపిక కాకర్, శ్రీశాంత్ అభిమానుల మధ్యవార్

  దీపిక కాకర్, శ్రీశాంత్ అభిమానుల మధ్యవార్

  దీపిక కాకర్ అభిమానులు ఈ బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఇరు వర్గాల అభిమానుల మధ్య తమ తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు అనుకూలంగా సోషల్ మీడియా వార్ జరుగుతోంది.

  వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

  వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

  దీపిక కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం, శ్రీశాంత్, శ్రీశాంత్ భార్య భువనేశ్వరి, ముంబై పోలీస్ ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ చేసి... దీపిక మీద యాసిడ్ ఎటాక్ చేస్తామంటూ చెదిరింపులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

  అతడి అకౌంట్ డిలీట్

  అతడి అకౌంట్ డిలీట్

  దీపిక కాకర్ మీద యాసిడ్ ఎటాక్ చేస్తానని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి... తన ట్వీట్ డిలీట్ చేశాడు. కానీ అప్పటికే అతడు చేసిన విద్వేష పూరిత ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సేకరించిన దీపిక ఫ్యాన్స్ ట్వీట్టర్ ద్వారా షేర్ చేశారు.

  ఆ ట్వీట్ చేసింది ఇతడే

  డియర ముంబై పోలీస్... యాసిడ్ ఎటాక్ చేస్తానని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఇతడే. వెంటనే అతడిపై చర్య తీసుకోండి అంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు.

  English summary
  Bigg Boss 12 is over, but looks like fans are still in hangover. As the viewers are aware, Dipika Kakar was declared the winner, while Sreesanth was declared the first runner-up. Sreesanth fans feel that Colors and the Bigg Boss makers were partial towards Dipika. They called it an unfair decision and started trolling Dipika very badly. They compared her to Bhalladeva (Baahubali character) and even called her Makhi (she played Makhi on Sasural Simar Ka). This was not all, a user has crossed all the limit and has threatened to throw acid on Dipika!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more