బిగ్ బాస్ ఎలిమినేషన్‌లో ట్విస్ట్: ఓట్లు తక్కువొచ్చింది ఒకరికి.. బయటికెళ్లేది ఇంకొకరు!

తెలుగులో భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ దూసుకుపోతోన్న షోలలో బిగ్ బాస్‌ది మొదటి స్థానమనే చెప్పాలి. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి మొదటి సీజన్‌ నుంచే మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం నడుస్తోన్న నాలుగో సీజన్ సైతం అదే రీతిలో దూసుకుపోతోంది. ఇక, ఈ సీజన్ తుది దశకు చేరుకోవడంతో ఎవరు ఉంటారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో 13వ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ ఉండబోతుందట. అంటే ఓట్లు తక్కువ వచ్చిన కంటెస్టెంట్ కాకుండా మరొకరు బయటకెళ్తారని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

పర్‌ఫెక్ట్‌గా అమలు చేస్తున్న బిగ్ బాస్

పర్‌ఫెక్ట్‌గా అమలు చేస్తున్న బిగ్ బాస్

గత సీజన్లకు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన రావడంతో అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో నాలుగో సీజన్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకోవడం కోసం బిగ్ బాస్ నిర్వహకులు ఎన్నో ప్లాన్లు అమలు చేశారు. మరీ ముఖ్యంగా టాస్కుల్లో కొత్తదనం చూపించడంతో పాటు ప్రేక్షకులకు నచ్చిన కంటెంట్‌ను ప్రసారం చేసేందుకు ముందుకొచ్చారు.

ఆ విషయంలో మాత్రం భారీ ట్విస్టులు

ఆ విషయంలో మాత్రం భారీ ట్విస్టులు

బిగ్ బాస్ షోలో అన్నీ రహస్యంగానే జరుగుతుంటాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో హౌస్‌లో ఏం జరిగినా ముందే బయటకు వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో ప్రసారానికి ముందే తెలిసిపోతోంది. అయినప్పటికీ షోకు వీకెండ్ ఎపిసోడ్‌లో స్పందన మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం అందరూ అనుకున్న వారు కాకుండా వేరే వాళ్లు ఎలిమినేట్ అవడమే.

బిగ్ బాస్‌పై పెరుగుతున్న విమర్శలు

బిగ్ బాస్‌పై పెరుగుతున్న విమర్శలు

నాలుగో సీజన్ విషయంలో బిగ్ బాస్ యూనిట్‌పై చాలా విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రజాదరణ ఉన్న పలువురు కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడమే. అంతేకాదు, అస్సలు ఫాలోయింగ్ లేని కొందరు కంటెస్టెంట్లు తరచూ సేవ్ అవుతుండడమే. దీంతో బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్ పైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు.

దత్త పుత్రిక కోసమే సాహసాలు చేస్తూ

దత్త పుత్రిక కోసమే సాహసాలు చేస్తూ


బిగ్ బాస్ హౌస్‌లో ఉండే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసే అధికారం ఒక్క ప్రేక్షకులకు మాత్రమే ఉంటుంది. ఎవరిని పంపాలో.. ఎవరిని కొనసాగించాలే వాళ్లే డిసైడ్ చేస్తారు. కానీ, ఈ సారి మాత్రం మోనాల్ గజ్జర్‌ను కావాలనే షోలో ఉంచుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆమెకు బిగ్ బాస్ దత్త పుత్రిక అని నామకరణం కూడా చేసేశారు కొందరు ఔత్సాహికులు.

13వ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్

13వ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్

13వ వారానికి సంబంధించి.. అవినాష్, దేత్తడి హారిక, అభిజీత్, అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్‌లు నామినేట్ అయ్యారు. వీరిలో మొదటి రోజు నుంచే మిస్టర్ కూల్ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా, చివరి స్థానం విషయంలో మార్పులు జరిగాయి. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.

తక్కువొచ్చింది ఒకరికి.. ఇంకొకరు ఔట్

తక్కువొచ్చింది ఒకరికి.. ఇంకొకరు ఔట్

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురులో అభిజీత్, అఖిల్ సేఫ్ జోన్‌లో ఉన్నారట. మిగిలిన ముగ్గురిలో మోనాల్ గజ్జర్‌కే తక్కువ ఓట్లు పోలయ్యాయని తెలిసింది. కానీ, ఆమెను అట్టిపెట్టి ఈ వారం అవినాష్‌ను ఎలిమినేట్ చేయబోతున్నాడట బిగ్ బాస్. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఆదివారం వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X