For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ 5: గ్లామర్ డోస్ కోసమే ఆ సీనియర్ హాట్ బ్యూటీ.. అందుకే హై రెమ్యునరేషన్?

  |

  ఇండియాలో అత్యధిక వివాదాస్పదంగా నడిచే రియాల్టీ షోలలో ఒకటైన బిగ్ బాస్ దాదాపు అన్ని భాషల్లోనూ మంచి రేటింగ్స్ అందుకుంటోంది. అసలు ఈ షో సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతుందా లేదా అని అనుకుంటున్న తరుణంలో అన్ని భాషల్లోను మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా తెలుగులో అయితే గ్యాప్ లేకుండా నాలుగు సీజన్స్ విజయవంతంగా ఫినిష్ అయ్యాయి. కాంట్రవర్సీలు ఎన్ని కొనసాగుతున్నా కూడా ఏ మాత్రం బ్రేకులు పడడం లేదు. మొదట ఎన్టీఆర్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత నాని తో కంటిన్యూ చేసి బిగ్ బాస్ షోకు తెలుగులో ఒక స్టాండర్డ్ సెట్టయ్యేలా చేశారు. ఎప్పటికప్పుడు రేటింగ్ కూడా గట్టిగానే అందుకుంది

  ప్రేమ కావాలి హీరోయిన్

  ప్రేమ కావాలి హీరోయిన్

  అనంతరం నాగార్జున ద్వారా గత రెండు సీజన్స్ కు భారీ స్థాయిలోనే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సారి కూడా నాగార్జున తోనే హోస్ట్ చేయించాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం కంటెస్టెంట్స్ వీరే అంటూ కొంతమంది సెలబ్రెటీల పేర్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక కంటెస్టెంట్ విషయంలో మాత్రం నిర్వహకులు ప్రత్యేకంగా ఆలోచించినట్లు సమాచారం. ఆ బ్యూటీ మరెవరో కాదు ప్రేమ కావాలి సినిమాలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన ఇషా చావ్లా. బిగ్ బాస్ ఎప్పుడు మొదలైనా కూడా ఇందులో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ మసాలాలూ ఉండాలని నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు.

  విమర్శలు వస్తున్నా కూడా

  విమర్శలు వస్తున్నా కూడా


  ముఖ్యంగా గ్లామర్ విషయంలో అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. విమర్శలు వస్తున్నా కూడా షోలోకి హాట్ బ్యూటీలను గట్టిగానే లాగుతున్నారు. గతంలో మోనాల్ గజ్జర్ ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుమ్ ఆమె పర్ఫార్మెన్స్ తోనే కాకుండా గ్లామర్ తో కూడా అందరిని డామినేట్ చేసే ప్రయత్నం చేసింది. పోటీగా మిగతావారు ఉన్నా కూడా మోనాల్ స్థాయిలో అయితే ఎవరు కూడా గ్లామర్ ను హాట్ గా ప్రజెంట్ చేయలేకపోయారు. ఈసారి అదే తరహాలో ఆలోచించి ఈషా చావ్లాను కూడా తీసుకున్నట్లు టాక్ వస్తోంది.

  వివరాల్లోకి వెళితే..

  వివరాల్లోకి వెళితే..

  ఇక ఈషా చావ్లా వివరాల్లోకి వెళితే. ఢిల్లీలో జన్మించిన ఈ బ్యూటీ 2011 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వయస్సు 33 ఏళ్లు. ఇక 2011లో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ప్రేమకావాలి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మోస్ట్ ప్రామిసింగ్ ఫేస్ కేటగిరీలో సిని'మా' అవార్డు కూడా అందుకుంది. ఇక ఆ తరువాత సునీల్ హీరోగా వచ్చిన పూలరంగడు సినిమాలో గ్లామర్ రోల్ లో కనిపించి ఆ విధంగా కూడా మరొక విజయాన్ని అందుకుంది.

  దురదృష్టవశాత్తు..

  దురదృష్టవశాత్తు..

  ఇక మొదట్లోనే రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు తిరుగు లేదని చాలామంది భావించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నందమూరి బాలకృష్ణతో శ్రీమన్నారాయణ అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక మరోసారి సునీల్ తో మిస్టర్ పెళ్లి కొడుకు అనే సినిమా చేసింది. బాలీవుడ్ హిట్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ కూడా బోల్తా కొట్టడంతో పెద్దగా ఈషా చావ్లాకు పెద్దగా అవకాశాలు రాలేదు.

   చివరికి అది కూడా నిరాశే మిగిల్చింది.

  చివరికి అది కూడా నిరాశే మిగిల్చింది.

  ఇక 2014 లో అల్లరి నరేష్ జంప్ జిలాని సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఇక ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అనుకున్న ఈషా చావ్లాకు చివరికి అది కూడా నిరాశే మిగిల్చింది. మొదటి రెండు సినిమాలు తప్పితే ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈషా చావ్లా తెలుగులో అయితే మరో ఛాన్స్ అందుకోలేకపోయింది. ఇక 2016లో ఒక కన్నడ సినిమాలో ఛాన్స్ వచ్చింది కానీ అది కూడా పెద్దగా కలిసి రాలేదు.

  బిగ్ బాస్ షోలో గ్లామర్ డోస్

  బిగ్ బాస్ షోలో గ్లామర్ డోస్

  ఎప్పుడైతే బిగ్ బాస్ షోలో గ్లామర్ డోస్ పెంచిందోఇలా వరుసగా అపజయాలు రావడంతో తొందరగానే ఫేడవుట్ అయిపోయిన ఇషాచావ్లా ఈ సారి బిగ్ బాస్ షో ద్వారా మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తోంది. మోనాల్ గజ్జర్ కూడా కూడా ఈషా చావ్లా తరహాలోనే మొదట్లో విజయాలు అందుకుని ఆ తర్వాత తొందరగా ఫెడవుట్ అయిపోయింది. అయితే ఆ బ్యూటీ ఎప్పుడైతే బిగ్ బాస్ షోలో గ్లామర్ డోస్ పెంచిందో అప్పటినుంచి మంచి క్రేజ్ వచ్చింది. రియాల్టీ షోలు ఐటమ్ సాంగ్స్ అంటూ ఏదో ఒక విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా చేస్తోంది. ఇక ఈ సారి ఈషా చావ్లా కూడా అదే తరహాలో క్రేజ్ అందుకోవాలని ప్లాన్ చేసింది.

   భారీగా రెమ్యునరేషన్

  భారీగా రెమ్యునరేషన్

  మొదట బిగ్ బాస్ షో అనగానే అంతగా ఇంట్రెస్ట్ చూపలేదట. పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ కంటిన్యూ చేయాలని అనుకున్నట్లు టాక్ అయితే వచ్చింది. అయితే చివరి ప్రయత్నంగా ఒకసారి ట్రై చేయాలని తన సన్నిహితులు కూడా సలహా ఇవ్వడంతో బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ షో కోసం అమ్మడు భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకునే అవకాశం ఉందట. కొంత మంది స్టార్ సెలబ్రిటీలకు అయితే పది లక్షలకు లక్షలు ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈషా చావ్లా కూడా గ్లామర్ డోస్ ను దృష్టిలో ఉంచుకొని గట్టిగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ షో ద్వారా అమ్మడి కెరీర్ ఎంతవరకు యు టర్న్ తీసుకుంటుందో చూడాలి.

  English summary
  Shocking rumours on Actress esha chaala glamour role in bigg boss 5 And remuneration details,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X