Just In
- 23 min ago
చంద్రబాబును పొగిడిన రాజశేఖర్.... జగన్‌కు మరో సారి హ్యాండ్.. రూలర్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్లు
- 1 hr ago
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- 2 hrs ago
జై బాలయ్య అనే వరకు వదల్లేదు.. బోయపాటిని విసిగించిన నందమూరి ఫ్యాన్స్
- 3 hrs ago
నిర్మాతగా మెగా డాటర్ ఎంట్రీ.. వాటితో మొదలు పెడుతుందంట!
Don't Miss!
- Technology
టిక్‌టాక్ మరో సంచలనం, మ్యూజిక్ యాప్ వస్తోంది
- Finance
పెరిగిన బంగారం ధరలు: హైదరాబాద్, ఢిల్లీల్లో ఎంత పెరిగిందంటే?
- News
గిఫ్టుగా మారిన ఉల్లి...! బట్టలు కొంటే.. ఉల్లిగడ్డ ఉచితం...!
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Sports
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ.. రోహిత్ పోటీ!!
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
భార్య ఉన్నా గర్ల్‌ఫ్రెండ్స్‌తో జల్సా.. రెండో భర్తకు యాక్టర్ గుడ్‌బై, అందుకోసమే వదిలేశా
టెలివిజన్ నటి శ్వేతా తివారీ తన రెండో భర్త అభివవ్ కోహ్లీపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసింది. తన వ్యక్తిగత జీవితం, పిల్లల భవిష్యత్‌పై ఎలాంటి చెడు ప్రభావం పడకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకొన్నానని చెప్పింది. ఈ వ్యవహారంపై కొద్ది రోజులుగా పెదవి విప్పని ఈ నటి తాజాగా మేరే డాడ్ కీ దుల్హన్ కొత్త సీరియల్ ప్రారంభం సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రెండో భర్తతో ఎందుకు విడిపోవాలని అనుకొంటున్నానో చెప్పింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే...

రెండో వివాహంలో కూడా సమస్యలు
నటి శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లితో రెండో వివాహం జరిగింది. అంతకు ముందు రాజ చౌదరీ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అభిప్రాయ విభేదాల కారణంగా వారిద్దరు విడిపోయారు ఆ తర్వాత కోహ్లీతో జరిగిన పెళ్లి కూడా సమస్యల్లో కూరుకుపోయింది. తన రెండో భర్తతో తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాను. సమస్యలు తగ్గకుపోగా మరింత పెరగడంతో తీవ్రమైన నిర్ణయం తీసుకొని సమత నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాను అని వెల్లడించింది.

మీడియా ఏం రాసుకొన్నా పట్టించుకోను
నా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం గురించి మీడియా ఏం రాసుకొన్నా నేను పట్టించుకోను. కానీ నా పిల్లల భవిష్యత్తు మాత్రమే నాకు ముఖ్యం. వారిపై ఎలాంటి ప్రభావం పడకుండా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రెండో వివాహంలో కూడా సమస్యనా? అలా జరగకూడదే అనే ప్రశ్న వేస్తున్నారు. ఎందుకు సమస్య తలెత్తదు. అయినా నా సమస్యను పరిష్కరించుకోవడానికి నేను ధైర్యంగా నిలబడుతా. మీడియా ఏం రాసుకొన్నా నేను పెద్దగా పట్టించుకోను అని శ్వేతా తివారీ ఫైర్ అయ్యారు.

నేను దేనికి భయపడను
మీడియా నా గురించి ఎన్ని రాసినా.. నేను భయపడను. నేను భయపడేది కేవలం నా పిల్లల గురించి. నాకు వారే ప్రపంచం. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేను చూసుకొంటాను. వాళ్లు గొప్పగా వారి జీవితాల్లో స్థిరపడేలా నేను జాగ్రత్తలు తీసుకొంటాను. కొందరు తమ భర్తలను చీట్ చేసే వారి కంటే నేను బెటర్. నా జీవితంలో సుఖ:శాంతులు లేని రిలేషన్‌ను తెగతెంపులు చేసుకొంటాను అని శ్వేతా తివారీ పేర్కొన్నారు.

అందరి జాతకాలు బయటపెడుతా..
సినిమా పరిశ్రమలో చాలా మంది జీవితాల గురించి నాకు తెలుసు. కావాలంటే వారి జాతకాలు బయపెట్టగలను. చాలా మంది భార్యలను పెట్టుకొని గర్ల్‌ఫ్రెండ్‌తో తిరిగే వాళ్లు ఉన్నారు. అలాగే భర్తలతో సంసారం చేస్తూ బాయ్‌ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నారు. వారి కంటే నేను బెటర్. నా భర్త వ్యవహారం నాకు నచ్చలేదు. అందుకే బయటకు వచ్చి నీతో ఉండలేనని చెప్పాను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తా. మీడియా, సమాజం ఏమనుకొన్నా నేను పట్టించుకోను అని ఘాటుగా శ్వేత తివారీ వ్యాఖ్యలు చేసింది.

వివాహిత మహిళల కోసం
వివాహాల వల్ల బాధపడే మహిళల కోసం ఓ వేదికను ఏర్పాటు చేసి దాని కోసం పనిచేస్తాను. మహిళలకు వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకొంటాను. సమాజం ఏమనుకొంటుంది.. పక్కింటి వాళ్లు ఏమనుకొంటారనే విషయాన్ని పట్టించుకోకుండా మీ సమస్యల నుంచి బయటకు రండి అంటూ మహిళలకు శ్వేతా తివారీ పిలుపునిచ్చింది. అంతే కాకుండా నా పిల్లల భవిష్యత్ కోసం జాగ్రత్తలు తీసుకొంటానని చెప్పింది.