Don't Miss!
- News
Vastu tips: జీవితంలో సంపద, ఆరోగ్యం, ఆనందం కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా.. స్టేజ్‌పై సల్మాన్‌తో క్రేజీగా.. ప్రైజ్‌మనీ ఎంతంటే
బిగ్‌బాస్ 13 గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. 13వ బిగ్‌బాస్ షోలో దిల్ సే దిల్ తక్ ఫేం సిద్ధార్థ్ శుక్లా విజేతగా నిలిచారు. సూపర్ ఎక్సైటింగ్‌గా సాగిన ఫైనల్‌లో సల్మాన్ మ్యాజిక్‌తోపాటు విజేత ఎవరవుతారనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. సిద్ధార్థ్ విజేతగా నిలువడంతో అనేక వివాదాలు, ఎంతో ఆసక్తికరమైన ఎపిసోడ్స్‌తో బిగ్‌బాస్ 13వ సీజన్ కంప్లీట్ అయింది. వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ ఫైనల్ డే రోజున
ఫైనల్ డే రోజున సిద్ధార్థ్ శుక్లా, అసీం రియాజ్, షెహనాజ్ గిల్, రష్మీ దేశాయ్, పరాస్ చబ్రా, ఆర్తీ సింగ్ తదితరులు ఫైనలిస్టులగా నిలిచారు. చివరకు పోటీలో అసిమ్ రియాజ్, సిద్ధార్థ్ శుక్లా పోటీలో నిలిచారు. అసిమ్, సిద్ధార్థ్ మధ్య గట్టిపోటీ కనిపించింది. ఎవరు గెలిచినా.. వెంట్రుక వాసి ఆధిపత్యంతో విజేతగా నిలిచే అవకాశం ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది.

టైటిల్ రేసులో ఆ ఇద్దరు
అలాంటి ఉద్విగ్న పరిస్థితుల్లో స్టేజ్ మీదకు అసిమ్ రియాజ్, సిద్ధార్థ్ శుక్లా వచ్చారు. వారితోపాటు సల్మాన్ ఖాన్ వేదికపైకి వచ్చారు. సల్మాన్‌కు చెరోపక్కన అసిమ్, సిద్ధార్థ్ నిలుచుంటే విజేత ఎవరనే ఆసక్తి, టెన్షన్ బిగ్‌బాస్ అభిమానుల్లో పెరిగింది. చివరకు బిగ్ బాస్ 13వ విజేతగా సిద్ధార్థ్ శుక్లాను సల్మాన్ ఖాన్ విజేతగా ప్రకటించారు.

ట్రోఫి, 40 లక్షల చెక్‌తో
దాంతో
సిద్ధార్థ్
శుక్లా
బిగ్‌బాస్
13
ట్రోఫిని
గాల్లోకి
లేపి
తన
విజయానందాన్ని
పంచుకొన్నారు.
ట్రోఫితోపాటు
రూ.40లక్షల
చెక్‌ను
కూడా
అందుకొన్నారు.
13వ
బిగ్‌బాస్‌లో
అసిమ్,
సిద్ధార్థ్‌ను
రామ్
లక్ష్మణ్
జోడి
అని
చెప్పుకొవడం
తెలిసిందే.
అయినా
అసిమ్
రియాజ్
నుంచి
ఎదురైన
గట్టిపోటిలో
విజేతగా
నిలవడంతో
అభిమానులు
ఆనందంలో
మునిగిపోయారు.

వినోద కార్యక్రమాలతో క్రేజీగా
బిగ్‌బాస్ ఫినాలేలో ఆర్తీ సింగ్ సల్మాన్ ఖాన్‌తో కలిసి వేదికపై స్టెప్పులు వేసింది. ఆర్తీ డ్యాన్స్ విపరీతమైన క్రేజ్ కనిపించింది. అనంతరం మాట్లాడుతూ.. రషామీ దేశాయ్ లేదా సిద్ధార్థ్ శుక్లా విజేతలుగా నిలుస్తారని వెల్లడించింది. ఆ తర్వాత స్టార్ కమెడియన్ సునిల్ గ్రోవర్ వేదికపైకి రాగానే మరింత జోష్ పెరిగింది. పరుగులు పెట్టించిన జోష్, అనేక వినోద కార్యక్రమాల మధ్య బిగ్‌బాస్ 13 ఘనంగా ముగిసింది.