For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Singer Revanth: తండ్రైన సింగర్ రేవంత్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత.. ఇద్దరూ ఎలా ఉన్నారంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని.. సుదీర్ఘ కాలంగా తనదైన పాటలతో శ్రోతలను అలరిస్తోన్న సింగర్ రేవంత్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప పాటలను ఆలపించిన అతడు.. ఇండియన్ ఐడల్‌గా గెలిచి దేశ వ్యాప్తంగానూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ షోలో టైటిల్ కోసం పోటీ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రేవంత్ భార్య అన్విత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!

  ఈ ఏడాది ఆరంభంలోనే రేవంత్ పెళ్లి

  ఈ ఏడాది ఆరంభంలోనే రేవంత్ పెళ్లి

  తనదైన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్న సింగర్ రేవంత్ గత ఏడాది డిసెంబర్ 24న గుంటూరుకు చెందిన అన్విత గంగరాజుతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఆమెను వివాహం చేసుకున్నాడు. కోవిడ్ నిబంధనల ప్రకారం నిరాడంబరంగా సాగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

  HIT 2 Twitter Review: హిట్ 2 మూవీకి అలాంటి.. అదే పెద్ద మైనస్.. ఇంతకీ శేష్ హిట్ కొట్టాడా అంటే!

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

  రేవంత్‌ - అన్విత వివాహం జరిగినప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ సందడి చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ కెరీర్లను చక్కగా నడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితమే అన్విత ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆమె డెలివరీ జరిగినట్లు తెలిసింది.

  వెల్‌కం చెప్పిన అన్విత.. విషెస్‌లతో

  వెల్‌కం చెప్పిన అన్విత.. విషెస్‌లతో


  సింగర్ రేవంత్ భార్య అన్విత గంగరాజు తల్లైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'మా లిటిల్ ప్రిన్సెస్‌కు వెల్‌కం' అంటూ పోస్ట్ చేసింది. ఇక, ఈ వార్త తెలియగానే.. ఆమెతో పాటు రేవంత్‌కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే, పలు రంగాలకు చెందిన సెలెబ్రిటీలు సైతం వాళ్లను విష్ చేస్తున్నారు.

  Bigg Boss Elimination: 13వ వారం డబుల్ ఎలిమినేషన్.. ఎలిమినేట్ అయ్యే ఇద్దరు ఎవరంటే!

  తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీగా

  తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీగా

  ప్రముఖ సింగర్ రేవంత్ భార్య అన్విత డెలివరీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగినట్లు తెలిసింది. భర్త పక్కన లేకపోవడంతో ఆమె వెంట ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు ఉండి జాగ్రత్తగా చూసుకున్నారట. ఇక, డెలివరీ తర్వాత అన్విత, ఆమె పాప ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. దీంతో రేవంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  బిగ్ బాస్‌లో రేవంత్... ఇక్కడ అన్విత

  బిగ్ బాస్‌లో రేవంత్... ఇక్కడ అన్విత

  ప్రస్తుతం సింగర్ రేవంత్ బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నాడు. దీనికోసం అతడు గర్భవతి అయిన భార్యను వదిలేసి కొద్ది రోజులుగా షోలోనే ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అన్వితకు గురువారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయని తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆడబిడ్డకు జన్మనిచ్చిందని సమాచారం.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో రకుల్ రచ్చ: మొత్తం తీసేసి చూపించిన వీడియో వైరల్

  టైం ఉందని చెప్పినా.. ముందుగానే

  టైం ఉందని చెప్పినా.. ముందుగానే

  గత వారం జరిగిన బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్‌లో అన్విత గంగరాజు వీడియో కాల్ ద్వారా రేవంత్‌తో మాట్లాడింది. ఆ సమయంలో తన డెలివరీ డేట్‌ను డిసెంబర్ రెండో వారానికి మార్చారని చెప్పింది. దీంతో రేవంత్ 'అలా అయితే అప్పటికి నేను వచ్చేస్తాను. అప్పుడు నీ పక్కనే ఉంటాను కదా' అని చెప్పాడు. కానీ, ఊహించని విధంగా అన్విత డెలివరీ చాలా ముందుగానే జరిగిపోయింది.

  రేవంత్‌కు ఈ విషయం చెప్పేశారా?

  రేవంత్‌కు ఈ విషయం చెప్పేశారా?


  ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సింగర్‌ రేవంత్‌కు తన భార్య డెలివరీ అయిన విషయాన్ని చెప్పారా? లేదా? అని చాలా మంది సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఒకవేళ అతడికి ఈ వార్త చెప్పినా.. బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. కానీ, అత్యంత ముఖ్యమైన సమయంలో భార్య పక్కన లేకపోవడం బాధాకరమే అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

  English summary
  Singer Revanth married Anvitha Gangaraju in 2022. Now the couple has been blessed with a baby girl earlier today in Hyderbad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X