For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jabardasth New Anchor: జబర్ధస్త్ నుంచి రష్మీ ఔట్.. కొత్త యాంకర్‌గా ఆ సీరియల్ నటి

  |

  తెలుగులో ఎన్నో రకాల కామెడీ షోలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ, ఒకే ఒక్క షో మాత్రం దాదాపు తొమ్మిదేళ్లుగా హవాను చూపిస్తూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇప్పటికీ అదే రీతిలో స్పందనను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. సుదీర్ఘ కాలంగా ఇందులో యాంకర్‌గా చేస్తోన్న ఆమె.. తాజాగా ఈ షో నుంచి తప్పుకుంది. ఈ బ్యూటీ స్థానంలో మరో కొత్త యాంకర్ ఎంట్రీ ఇచ్చింది. అసలేం జరిగింది? ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

  వాళ్ల జీవితాలు మార్చిన జబర్ధస్త్

  వాళ్ల జీవితాలు మార్చిన జబర్ధస్త్

  సుదీర్ఘ కాలంగా తెలుగులో తిరుగులేని షోగా వెలుగొందుతూ.. చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా బుల్లితెరపైకి ఎంతో మంది టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్లు వెలుగులోకి వచ్చారు. వాళ్లే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్లుగా వెలుగొందుతున్నారు. అలాగే, కొన్ని వందల మందికి ఈ షో ద్వారా జీవనోపాధి కల్పిస్తూ ముందుకు సాగుతోంది.

  బాత్రూంలో హాట్‌గా మెగా హీరోయిన్: ఆ డ్రెస్సు.. ఆమె ఫోజు చూశారంటే!

  జడ్జ్‌లు, యాంకర్ల కెరీర్లకు బూస్ట్

  జడ్జ్‌లు, యాంకర్ల కెరీర్లకు బూస్ట్

  ఈ కామెడీ షో ద్వారానే ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు కూడా మరింతగా హైలైట్ అయ్యారు. ఇక, ఇందులో యాంకర్లుగా చేస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌ కెరీర్‌ ఎదుగుదలకు కూడా జబర్ధస్త్ షో ఓ రేంజ్‌లో బూస్టును ఇచ్చిందని అంతా ఒప్పుకోవాల్సిందే.

  మార్పులు.. కొత్త కంటెంట్‌తో షో

  మార్పులు.. కొత్త కంటెంట్‌తో షో

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో జబర్ధస్త్ షోలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. కామెడీ డోసును పెంచేందుకు టీమ్ లీడర్లు అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే సమయంలో షో నిర్వహకులు కూడా కొన్ని హంగులను జోడిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నారు. దీంతో ఇది మరింత ఫన్నీగా సాగుతోంది.

  అర్ధనగ్నంగా మహేశ్ హీరోయిన్: ప్రెగ్నెన్సీ టైంలోనూ హాట్ షోతో అరాచకం

  పాత వాళ్లు ఔట్.. కొత్త టీమ్‌తోనే

  పాత వాళ్లు ఔట్.. కొత్త టీమ్‌తోనే

  జబర్ధస్త్ షో నుంచి ఎంతో మంది స్టార్ కమెడియన్లు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే అదిరే అభి, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, సుడిగాలి సుధీర్, ముక్కు అవినాష్, చలాకీ చంటి, ఫైమా సహా ఎంతో మంది టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు ఈ షోకు గుడ్‌బై చెప్పేశారు. వీళ్ల బాటలోనే మరికొందరు కమెడియన్లు కూడా వేరే ఛానెళ్లలోకి వెళ్లిపోతున్నారు. దీంతో కొత్త టీమ్‌లతో నడుపుతున్నారు.

  షో నుంచి యాంకర్ రష్మీ ఔట్

  షో నుంచి యాంకర్ రష్మీ ఔట్

  ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రష్మీ గౌతమ్.. సుదీర్ఘ కాలంగా అందులోనే సత్తా చాటుతూ వచ్చింది. కానీ, వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌తో ఈ అమ్మడు ఈ షోకు గుడ్‌బై చెప్పేసినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే వచ్చే గురువారం ప్రసారమయ్యే జబర్ధస్త్ ఎపిసోడ్‌లో రష్మీ స్థానంలో మరో అమ్మాయి కనిపించింది.

  టాప్ విప్పేసి యాంకర్ స్రవంతి రచ్చ: నచ్చింది చూసేయ్.. పైన స్వర్గమే అంటూ!

  కొత్త యాంకర్‌గా సీరియల్ నటి

  కొత్త యాంకర్‌గా సీరియల్ నటి

  సుదీర్ఘ కాలం పాటు జబర్ధస్త్ షోకు యాంకర్‌గా పని చేసిన రష్మీ గౌతమ్.. వచ్చే ఎపిసోడ్ నుంచి ఇందులో కనిపించదు. దీంతో ఆమె స్థానంలో ఇందులోకి యాంకర్‌గా ప్రముఖ సీరియల్ నటి సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో ఆమెపై టీమ్ లీడర్లు పంచులు కూడా పేల్చారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

  జబర్ధస్త్ కొత్త యాంకర్ డీటేల్స్

  తమిళనాడుకు చెందిన సౌమ్య రావు సీరియల్ యాక్టర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే పలు ఛానెళ్లలో ఎన్నో ధారావాహికల్లో నటించింది. ఈ క్రమంలోనే ఈటీవీలోకి ఎంట్రీ ఇచ్చి 'శ్రీమంతుడు' అనే సీరియల్ చేస్తోంది. ఇలా పాపులర్ అయిన ఈ బ్యూటీని జబర్ధస్త్ యాంకర్‌గా సెలెక్ట్ చేశారు. తెలుగు అంతగా రాకున్నా తన గ్లామర్‌తో ఈ బ్యూటీ ఆకట్టుకోబోతుందట.

  English summary
  Jabardasth Is Very Famous Comedy Show in Telugu language. Now Sowmya Rao Nadig Entry to This Show in Place of Rashmi Gautam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X