»   » అమెరికాలో 'పాడుతా తీయగా' స్పందన ఏంటి?

అమెరికాలో 'పాడుతా తీయగా' స్పందన ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
SP Balasubramaniam
వాషింగ్టన్‌ : 'ఈటీవీ' ఆధ్వర్యాన అమెరికాలో తొలిసారిగా నిర్వహిస్తున్న 'పాడుతా తీయగా' కార్యక్రమానికి కాలిఫోర్నియా రాష్ట్రంలో అపూర్వ స్పందన లభించింది. శనివారం శాక్రిమెంటో నగరంలో, ఆదివారం శాంతాక్లారాలో జరిగిన పోటీలకు ప్రముఖ రచయిత జొన్నవిత్తుల న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

ఈటీవీ కార్యకలాపాల విభాగ ఉపాధ్యక్షుడు బాపినీడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శాంతాక్లారాలో జరిగిన కార్యక్రమానికి 'బాటా' సహాయ, సహకారాలు అందించింది. తదుపరి కార్యక్రమం లాస్‌ ఏంజెలస్‌లో ఉంటుందని ఈటీవీ ప్రతినిధులు తెలిపారు.

తానా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఆధ్వర్యంలో ఇక్కడ పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాడుతా తీయగా కార్యక్రమాన్ని అమెరికాలో తెలుగు వారు ఎక్కువగా నివాసం ఉండే వివిధ నగరాల్లో కొనసాగించనున్నారు.

ఇప్పటి వరకు వివిధ వయసుల వారు పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని తెలుగు సంగీతాభిమానులను అలరించారు. అయితే తొలిసారిగా విదేశాల్లో స్థిర పడ్డ ప్రవాసాంధ్రుల గొంతు 'పాడుతా తీయగా' కార్యక్రమంలో వినపడుతోంది. విదేశాల్లో ఉంటున్నా భారతీయ సంగీతంపై మమకారంతో సాధన చేస్తున్న వారి ప్రతిభ పాఠవాలు ఈకార్యక్రమం ద్వారా అందిరికీ తెలియనున్నాయి.

English summary
Padutha Theeyaga is a popular reality singing competition show on ETV Telugu channel. The show is hosted and judged by the Indian playback singer S.P. Balasubramaniam. The show is directed by N.B.Sasthri. The show is now into its sixth season and for the first time ever, it is being conducted in the USA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu