బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి.. శ్రీజ షాకింగ్ ఎలిమినేషన్.. ఎంత సంపాదించిందంటే..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటికే ఎవరూ ఊహించిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్న ఈ రియాలిటీ షోలో ఐదో వారం మాత్రం మైండ్ బ్లోయింగ్ సర్రైజ్, ట్విస్ట్ చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు నాలుగు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వెళ్లగా, ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ నిర్వహించాలని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయింది. ఇప్పటికే ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయిందనే వార్తలు వచ్చాయి. మరో ఎలిమినేట్ ఎవరు? అనే ఉత్కంఠ సమయంలో ఓ షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎవరూ ఊహించిన విధంగా శ్రీజ దమ్ము పై ఎలిమినేషన్ వేటు పడినట్టు తెలుస్తోంది.
ఓటింగ్ సంబంధంగా లేకుండా
బిగ్ బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి ఓటింగ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ 2.0 కాంసెప్ట్‌లో భాగంగా నేడు (ఆదివారం) ఆరుగురు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి పంపించారు. ఈ క్రమంలో డబుల్ ఎలిమినేషన్ చేపట్టాలని బిగ్ బాస్ టీం ప్లాన్ వేసింది. ఓటింగ్ తక్కువగా ఉండటంతో ఫ్లోరా సైనీ ని ఎలిమినేట్ చేయాలని ఫిక్స్ చేశారు. అయితే.. డబుల్ ఎలిమినేషన్స్ భాగంగా ఫ్లోరాతో పాటు మరో కంటెస్టెంట్ బయటకు పంపాలని నిర్ణయించారు.

డేంజర్ జోన్‌లో నిలిచిన శ్రీజ
నాగార్జున డేంజర్ జోన్‌లో ఉన్న ఐదుగురికి "స్టిక్ ఇట్ టు విన్ ఇట్"అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో రీతూ చౌదరి, సంజన, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, శ్రీజ దమ్ము పాల్గొన్నారు. మొదటి రౌండ్‌లో సంజన, డీమాన్ పవన్ మధ్య గేమ్ టై అయ్యింది. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన సాయి, రమ్య లు తమ నిర్ణయం ప్రకారం సంజనను విన్నర్ గా ప్రకటించారు. దీంతో సంజన సేఫ్ జోన్ లోకి వెళ్లింది. రెండో టాస్క్‌లో రీతూ, డీమాన్ సేఫ్ జోన్‌కి వెళ్లగా, మిగిలిన సుమన్ శెట్టి, శ్రీజ డేంజర్ జోన్‌లో మిగిలారు.
అయితే.. ఓటింగ్ తో సంబంధం లేకుండా.. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్స్‌కి ఎలిమినేషన్ చేసే అధికారం ఇచ్చారు. వాళ్లు ఎవరు హౌస్‌లో ఉండాలి? ఎవరు బయటకు వెళ్లాలి అనే విషయం తీర్మానించారు. ఆ ప్రక్రియలో శ్రీజ బెలూన్ ను వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన మాధురి దివ్వెల కట్ చేసింది. ఇలా శ్రీజ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. నాగార్జున "యూ ఆర్ ఎలిమినేటెడ్" అంటూ ప్రకటించగానే హౌస్‌మేట్స్ అందరూ షాక్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి ఓటింగ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ గా శ్రీజ దమ్ము నిలిచినట్టు తెలుస్తోంది.
దుమ్మురేపిన శ్రీజ
బిగ్ బాస్ హౌస్ లో దమ్ము శ్రీజ ఉన్నంత కాలం దుమ్మురేపింది. తన బేస్ వాయిస్ తో ఇతర కంటెస్టెంట్లకు చుక్కలు చూపించింది. తనతో మాట్లాడాలంటే కూడా కంటెస్టెంట్లు భయపడేవారు. అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక నామినేషన్స్ సమయంలో ఆమె ఉంటే మాత్రం.. హౌస్ ఒక్కసారిగా హీటెక్కించేది. తాను అనుకుంటే.. చిన్న విషయంలో కూడా పెద్ద రచ్చ చేసేది. తన వాదనతో హౌస్ లో ప్రకంపనాలు క్రియేట్ చేసేది శ్రీజ దమ్ము .
శ్రీజ రెమ్యూనరేషన్
కామనర్స్ కోటా క్రింద బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన దమ్ము శ్రీజ రోజుకు దాదాపు రూ.10,000 రెమ్యూనరేషన్ తీసుకుందట. అంటే వారానికి 70 వేలు.. ఇలా ఐదు వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు రూ. 3.5 లక్షలు సంపాదించింది. కానీ అభిమానుల అభిప్రాయం ప్రకారం ఆమెకు హౌస్‌లో ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సిన అర్హత ఉంది. ఎందుకంటే ఆమె హౌస్‌లో ఎంటర్టైన్మెంట్‌కి ప్రధాన కారణం, ఎనర్జీ లెవెల్‌కి సింబల్ అని భావిస్తున్నారు.
మరో వైపు శ్రీజ ఎలిమినేట్ అయిన వార్త బయటకు రావగానే సోషల్ మీడియాలో #JusticeForSrijaDammu అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు "ఇది అన్యాయం", "ఓటింగ్ ఫలితాలు లేకుండా ఎలిమినేట్ చేయడం సరికాదు", "శ్రీజ రీ-ఎంట్రీకి అవకాశం ఇవ్వాలి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగా శ్రీజ బయటకే వెళ్లిపోయిందా? లేక సీక్రెట్ రూమ్ ట్విస్ట్ ఉందా? అనేది మాత్రం ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications











