Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కడ దుకాణం సర్దేయడంతో ఇక్కడ దూరేసింది.. వామ్మో శ్రీముఖి ప్లానింగ్ మామూలుగా లేదు!
బుల్లితెరపై కొత్త కొత్త షోలు వస్తుంటాయి.. ఫాంలో ఉన్నవారికి ఆఫర్లు వస్తుంటాయి. అలా ఓ షోలో ఉన్న వాళ్లు ఇంకో షోలోకి వెళ్తుంటారు. బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలకు ఇప్పుడు కొదవేమీ లేదు. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో షోలు వస్తున్నాయి.. కొన్ని నిలబడుతున్నాయి.. ఎన్నో వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు బొమ్మ అదిరింది పరిస్థితి మరీ దారుణంగా అయింది. చెప్పా పెట్టకుండా దుకాణం సర్దేశారు.

మార్పులు చేర్పులతో..
జబర్దస్త్ షోకు పోటిగా తీసుకొచ్చిన అదిరింది షో అంతగా క్లిక్ కాలేదు. అలా ఓ మోస్తరుగా నడుస్తున్న అదిరిందికి రిపేర్లు చేసి యాంకర్లు, జడ్జ్‌ని మార్చేశారు. అలా లైన్‌లోకి శ్రీముఖి, జానీ మాస్టర్‌లు వచ్చారు. శ్రీముఖి వచ్చాక షో కాస్త బాగానే పైకి లేచింది. సద్దాం, రియాజ్ స్కిట్లతో షోకు బాగానే బూస్టప్ వచ్చింది.

మధ్యలో జంప్..
అయితే బొమ్మ అదిరింది షోకు ఆదరణ బాగానే వచ్చింది. ఇమిటేషన్‌తో చేసే స్కిట్లు బాగానే వర్కవుట్ అయ్యాయి.. ప్రతీ వారం స్పెషల్ గెస్ట్‌లను తీసుకొచ్చి బాగానే నడిపించారు. అంతా బాగానే నడుస్తుందన్న సమయంలో మొత్తానికి షో అడ్రస్సే గల్లంతయింది.

చడీచప్పుడు లేకుండా..
బొమ్మ అదిరింది షో గత కొన్ని వారాలుగా రావడం లేదు. అసలు బొమ్మ అదిరింది గురించిఎక్కడా ఊసు వినిపించడం లేదు. ఇక ఆ షో పని అయిపోందని అందరూ అనుకుంటున్నారు. అందులో జడ్జ్‌గా ఉన్న జానీ మాస్టర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగబాబు తన యూట్యూబ్ చానెల్‌తో ఫేమస్ అవుతున్నాడు.

మిగిలిన శ్రీముఖి..
బొమ్మ అదిరింది షో బిచాన సర్దేయడంతో ఒక్క శ్రీముఖి మాత్రమే ఖాళీగా ఉంది. షోలో చేసే ఆర్టిస్ట్‌లందరూ కూడా ఏదో ఒక ఈవెంట్ చేస్తూ బిజీగానే ఉంటున్నారు.అయితే ఇప్పుడు శ్రీముఖి ఎక్కువగా జీ తెలుగు షోలనే చేస్తోంది. ఈటీవీ ఈవెంట్లకు శ్రీముఖి ఎప్పుడో దూరమైంది.

శ్రీదేవీ డ్రామా కంపెనీ..
తాజాగా ఈటీవీలో కొత్తగా ప్రారంభం కాబోతోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోతో శ్రీముఖి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ క్రమంలో ఈ కొత్త షోలో సీరియల్ హీరో అంబటి అర్జున్ కూడా వచ్చాడు. ఆయనతో పాటు శ్రీముఖి కూడా ఈ షోలో సందడి చేయబోతన్నారు. ప్రస్తుతం చిన్న శాంపిల్‌గా ఇచ్చిన ప్రోమో వైరల్ అవుతోంది.