త్వరలో తెలుగు టీవీ ఛానెల్ లో శ్రీదేవి షో
కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ కు గానూ శ్రీదేవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీదేవితో మాట్లాడినట్లు చెప్తున్నారు. ఆమె 20 లక్షలు రూపాయలు వరకూ ఎపిసోడ్ కి ఛార్జ్ చేయనుందని వార్త. శ్రీదేవి చేయటమే నిజమే అయితే అది టెలివిజన్ పరిశ్రమలో పెద్ద బ్యాంగే అంటున్నారు.
ఇక ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా వన్నెదగ్గని అందంతో వెలిగిపోతూ...'అతిలోక సుందరి' అనే పేరును సార్ధకం చేసుకుంటోంది హీరోయిన్ శ్రీదేవి. ఆమె రీసెంట్ గా నటించిన ఇంగ్లీష్- వింగ్లీష్ చిత్రం మంచి విజయం సాధించి,శ్రీదేవి స్టామినా మరోసారి ప్రూవ్ చేసింది.
సినిమాలకు దూరమైన చాలా కాలం తర్వాత 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, తనకు సూటయితే మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధమే అని వెల్లడించారు. కాగా....రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాహుబలి' చిత్రంలో శ్రీదేవి నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇంకా నిర్ణారణ కాలేదు.


Click it and Unblock the Notifications












