For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: వాళ్లు ఒత్తిడి చేశారు.. బిడ్డను కోల్పోయా.. కన్నీరు తెప్పించిన నటి రియల్ స్టోరి

  |

  తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షోలలో బిగ్ బాస్ ఒకటి. అంతలా ఈ షో దాదాపు ఐదేళ్లు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల మద్దతును విశేషంగా అందుకుని, రికార్డు స్థాయిలో రేటింగ్‌లను కూడా అందుకుంటోంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ షో తెలుగులో ఏకంగా నాలుగు సీజన్లను ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్‌ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా ఇటీవలే మొదలైంది. గతంలో కంటే ఈ సారి ఆరంభంలోనే హౌస్‌లో ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సుదీప తన ఎమోషనల్ స్టోరీని పంచుకుంది. ఆ వివరాలు మీకోసం!

  వాటిని మించేలా సాగుతోందిగా

  వాటిని మించేలా సాగుతోందిగా


  తెలుగులో బిగ్ బాస్ అంత సక్సెస్‌ఫుల్ షో మరొకటి లేదనే చెప్పాలి. అందుకే ఇది మన దగ్గర ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆరో సీజన్‌పై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని నిర్వహకులు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేలా కొత్త కంటెంట్ చూపిస్తున్నారు.

  Saakini Daakini Twitter Review: రెజీనా, నివేదా మూవీకి ఊహించని టాక్.. అది కూడా వర్కౌట్ అయితే మాత్రం!

  రెండో వారం సిసింద్రీ టాస్క్‌తో

  రెండో వారం సిసింద్రీ టాస్క్‌తో

  బిగ్ బాస్ ఆరో సీజన్ రెండో వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు 'సిసింద్రీ' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో విజయం సాధించిన నలుగురు కంటెస్టెంట్లను కెప్టెన్సీ కోసం పోటీ పడడానికి అర్హులుగా ప్రకటిస్తామని బిగ్ బాస్ చెప్పాడు. ఇది ఆద్యంతం ఎంతో ఎమోషనల్‌గా, సందడిగా, గొడవలతో సాగింది. దీంతో ఈ టాస్క్‌కు మంచి స్పందన దక్కింది.

  కెప్టెన్సీ కోసం నలుగురు సెలెక్ట్

  కెప్టెన్సీ కోసం నలుగురు సెలెక్ట్

  రెండో వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసే 'సిసింద్రీ' టాస్కులో నలుగురు పోటీదారులు ఎంపిక అయ్యారు. ఇందులో మొత్తంగా చలాకీ చంటీ, రాజశేఖర్, ఆర్జే సూర్య, ఇనాయా సుల్తానా అర్హులుగా నిలిచారు. వీళ్లలో ఒకరిని కెప్టెన్‌గా చేసేందుకు డీజే టిల్లు టాస్కును ఇచ్చారు. ఇందులో పోటీదారులు కంటెస్టెంట్లతో మాట్లాడుకుని మద్దతు కూడగట్టుకోవాలి.

  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్విట్టర్ రివ్యూ: సుధీర్ మూవీకి అలాంటి టాక్.. అదే పెద్ద మైనస్ అంటూ!

  బొమ్మలతో బంధం.. మరో టాస్క్

  బొమ్మలతో బంధం.. మరో టాస్క్

  బిగ్ బాస్ రెండో వారంలో జరిగిన 'సిసింద్రీ' టాస్కులో ప్రతి కంటెస్టెంట్‌కు ఒక బొమ్మను ఇచ్చి.. తమ కూతురుగానో, కొడుకుగానో చూసుకోవాలని చెప్పారు. దీంతో ఆ బొమ్మలతో కంటెస్టెంట్లు బంధాన్ని ఏర్పరచుకున్నారు. అందుకే టాస్కు ముగిసిన తర్వాత వాటిని తిరిగి ఇచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్‌లో వాళ్లకు మరో టాస్కును ఇచ్చాడు.

  పర్సనల్ మేటర్ చెప్పిన పింకీ

  పర్సనల్ మేటర్ చెప్పిన పింకీ

  ప్రతి కంటెస్టెంట్ వాళ్ల లైఫ్‌లో బేబీలతో ఉన్న బంధం గురించి చెప్పాలని బిగ్ బాస్ టాస్కు ఇచ్చాడు. దీంతో సుదీప పింకీ మాట్లాడుతూ.. 'దేవుడు దీనికి అన్నీ ఇచ్చేస్తున్నా.. పొగరు ఎక్కువైపోతుందని అనుకున్నాడేమో కానీ.. 2015లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు నేను రెడీగా లేను. కానీ అందరు ఒత్తిడి చేసే సరికి వదులుకోకూడదని అనుకున్నా' అని చెప్పింది.

  బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

  నా బిడ్డను కోల్పోయాను అంటూ

  నా బిడ్డను కోల్పోయాను అంటూ


  ఆ తర్వాత సుదీప పింకీ కన్నీటి గాథను వినిపించింది. 'నా గర్భంలో ఉన్న బిడ్డతో నేను మాట్లాడటం స్టార్ట్ చేశాను. హాస్పటల్‌‌కి వెళ్లాను. బేబీకి హార్ట్ బీట్ వచ్చింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో నాకు థైరాయిడ్ ఎక్కవు అయిపోయింది. దాన్ని నేను చూసుకోలేక.. నా బిడ్డను కోల్పోయాను. నా చెల్లి కూతురు వచ్చేవరకూ కూడా నాది అని అనుకోలేకపోయాను' అని తెలిపింది.

  తిరిగి ఇవ్వలేకపోయాను అంటూ

  తిరిగి ఇవ్వలేకపోయాను అంటూ

  చివర్లో సుదీప మాట్లాడుతూ.. 'నా చెల్లి కూతురు వల్ల మా రెండు ఫ్యామిలీలు దగ్గరయ్యాయి. అది వాళ్ల పిల్ల ఎప్పుడైనా ఇచ్చేయాలి అని మా ఆయన అంటుంటాడు. చిన్న బొమ్మనే ఇవ్వాలంటే మనసు ఒప్పదు మనకి. వాళ్ల కూతుర్ని వాళ్లకి ఇవ్వడానికి నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. ఫ్యూచర్‌లో సుదీప తల్లి అవుతుందని అనుకుంటున్నాను' అంటూ కన్నీరు పెట్టించింది.

  English summary
  Bigg Boss Telugu 6th Season Premiere Episode Started Today. Now Famous Comedian Sudeepa Pinky Entered into Bigg Boss House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X