For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్‌లోకి సుధీర్ రీఎంట్రీ: ఆ సమస్య వల్లే షోకు దూరం.. అప్పటి నుంచే వస్తానని ప్రకటన

  |

  ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అడుగు పెట్టారు. అయితే, అందులో కొందరు మాత్రమే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో బుల్లితెర ఆల్‌రౌండర్ సుడిగాలి సుధీర్ ఒకరు. చాలా కాలం పాటు ఈటీవీలో సందడి చేసిన అతడు.. ఇటీవలే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జబర్ధస్త్ రీఎంట్రీపై సుధీర్ క్లారిటీ ఇచ్చేశాడు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

   జబర్ధస్త్‌గా సాగుతోన్న సుధీర్ కెరీర్

  జబర్ధస్త్‌గా సాగుతోన్న సుధీర్ కెరీర్


  మెజీషియన్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే సుధీర్ జబర్ధస్త్ షోలోకి అడుగు పెట్టాడు. అందులో ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత టీమ్ లీడర్‌గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి తనదైన స్కిట్లతో ప్రేక్షకులకు మజా పంచాడు. అంతేకాదు, యాంకర్ రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. మొత్తానికి ఈ షో ద్వారా సుధీర్ కెరీర్ దూసుకెళ్తోంది.

  వాష్ రూమ్‌లో హాట్‌గా తెలుగు పిల్ల డింపుల్: టైట్ ఫిట్‌లో ఆ ఫోజు చూస్తే మెంటలే

   సినిమాల్లోనూ సత్తా... హీరోగా బిజీ

  సినిమాల్లోనూ సత్తా... హీరోగా బిజీ


  దాదాపు దశాబ్ద కాలంగా బుల్లితెరపై సత్తా చాటిన సుడిగాలి సుధీర్.. ఎన్నో సినిమాల్లోనూ కీలక పాత్రలను పోషించాడు. అదే సమయంలో హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవి అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. ఇప్పుడు సుధీర్ 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' వంటి సినిమాల్లో హీరోగా చేస్తూ ఫుల్ బిజీగా మారాడు.

  జబర్ధస్త్‌తో పాటు ఆ షోలకు గ్యాప్

  జబర్ధస్త్‌తో పాటు ఆ షోలకు గ్యాప్


  సుడిగాలి సుధీర్ జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఈటీవీలోనే కొన్ని షోలలో తెగ సందడి చేశాడు. అయితే, ఇటీవలే లైఫ్ ఇచ్చిన షో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజలు పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొన్న అతడు.. దానికి కూడా గుడ్‌బై చెప్పేశాడు. అంతేకాదు, మొత్తంగా అతడు ఈటీవీకి గుడ్‌బై చెప్పేశాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉండిపోయారు.

  బట్టలు లేకుండా అమ్మాయి: అలాంటి పిక్ షేర్ చేసిన దీప్తి సునైనా

  మరో ఛానెల్‌లోకి సుధీర్ ఎంటర్

  మరో ఛానెల్‌లోకి సుధీర్ ఎంటర్


  ఈటీవీకి గుడ్‌బై చెప్పేసిన సుడిగాలి సుధీర్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో ప్రసారం అయిన 'సూపర్ సింగర్ జూనియర్' షోకు అతడు యాంకర్‌గా చేశాడు. దీనితో పాటు పలు ఈవెంట్లు కూడా చేశాడు. అలా అక్కడ కూడా తన సత్తాను చూపిస్తూ ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ, సుధీర్ మాత్రం అంత స్పీడుగా కనిపించడం లేదు.

  జబర్ధస్త్ రీఎంట్రీ.. సుధీర్ క్లారిటీ

  జబర్ధస్త్ రీఎంట్రీ.. సుధీర్ క్లారిటీ


  స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకే ఒక్క షోలో కనిపించిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత అక్కడ పెద్దగా హడావిడి చేయలేకపోయాడు. దీంతో మరోసారి జబర్ధస్త్‌ షోలోకి వస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై ఎవరూ స్పందించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ జబర్ధస్త్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చాడు.

  Bigg Boss Elimination: బిగ్ బాస్ షోలో పెను సంచలనం.. 9వ వారం టైటిల్ ఫేవరెట్ ఎలిమినేట్

   అందుకే జబర్ధస్త్‌ను వదిలేశాను

  అందుకే జబర్ధస్త్‌ను వదిలేశాను


  తాజా ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ తన లైఫ్‌లో జబర్ధస్త్‌ షోనే టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు. అలాగే దాన్ని ఎందుకు వదిలేశాడన్న దానిపై మాట్లాడుతూ.. 'నేను జబర్ధస్త్ షోను వదిలేయలేదు. ఒక ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాను. కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగానే వేరే ఛానెల్‌లోకి వెళ్లాల్సి వచ్చింది' అని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు.

  త్వరలోనే మళ్లీ వస్తాను అంటూ

  త్వరలోనే మళ్లీ వస్తాను అంటూ


  జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇవ్వడం గురించి సుడిగాలి సుధీర్ స్పందిస్తూ.. 'నేను జబర్ధస్త్ షోను విడిచి పెట్టిన సమయంలో ఆ షో యాజమాన్యంతో మాట్లాడాను. వారు ఓకే చెప్పిన తర్వాతనే మానేశాను. కాబట్టి మరికొన్ని రోజుల్లోనే జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను' అని ప్రకటించాడు. ఇక, సుధీర్ జబర్ధస్త్ రీఎంట్రీపై అతడి అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.

  English summary
  Jabardasth Talented Comedian Sudigali Sudheer Participated in an Interview Recently. He Gave Clarity on Re Entry to Jabardasth in This Chit Chat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X