For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనసూయ బండారం బయటపెట్టిన సుధీర్: అందరి ముందే అంత మాట అనడంతో!

  |

  సుడిగాలి సుధీర్.. తెలుగు వాళ్లకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ కుర్రాడు చాలా కాలంగా బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. తద్వారా టెలివిజన్ స్టార్‌గా వెలుగొందుతోన్నాడు. అదే సమయంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్నాడు. అలాగే, సినిమాల్లోనూ సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఫలితంగా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటున్నాడు. ఇక, ఇంత కాలం ఈటీవీలో షోలు చేసిన సుధీర్.. ఇటీవలే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా వరుస షోలతో హవాను చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో మరో యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సుధీర్ ఊహించని వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  జబర్ధస్త్‌తో సుధీర్‌కు పాపులారిటీ

  జబర్ధస్త్‌తో సుధీర్‌కు పాపులారిటీ


  మ్యాజిక్‌లు చేసుకుంటూ కెరీర్‌ను ప్రారంభించిన సుధీర్.. అలా ఈవెంట్లు, షోలలో చేశాడు. ఈ సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ సహాయంతో అందులోకి అడుగు పెట్టాడు. అలా వెళ్లిన చాలా తక్కువ సమయంలోనే తన సత్తాను నిరూపించుకున్నాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. అప్పటి నుంచి అతడికి తిరుగు లేకుండా పోయిందనే చెప్పాలి.

  బట్టలు ఉన్నా లేనట్లే టాలీవుడ్ హీరోయిన్ ఫోజులు: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  మూవీల్లో సత్తా.. హీరోగా మాత్రం

  మూవీల్లో సత్తా.. హీరోగా మాత్రం

  సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో సత్తా చాటిన సుధీర్.. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను చేశాడు. అలాగే హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవి అతడిని నిరాశ పరిచాయి. ఇప్పుడు సుధీర్ హీరోగా 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

  ఈటీవీని వదిలేసిన కమెడియన్

  ఈటీవీని వదిలేసిన కమెడియన్

  ఆరేడేళ్లుగా సుడిగాలి సుధీర్ ఈటీవీలో ప్రసారం అయిన జబర్ధస్త్ షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవలే దాని నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజలు పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొన్న అతడు.. దానికి కూడా గుడ్‌బై చెప్పేశాడు. అంతేకాదు, మొత్తంగా అతడు ఈటీవీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి అభిమానులు నిరాశగా ఉన్నారు.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ శ్వేత వర్మ: వామ్మో తొలిసారి ఇంత హాట్‌గా!

  స్టార్ మా ఎంట్రీ.. ఆమెతో కలిసి

  స్టార్ మా ఎంట్రీ.. ఆమెతో కలిసి

  ఈటీవీ నుంచి తప్పుకున్న సుధీర్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి అడుగు పెట్టాడు. అందులో ప్రసారం అవుతోన్న 'సూపర్ సింగర్ జూనియర్' షోకు అతడు యాంకర్‌గా చేస్తున్నాడు. అలాగే ఈ షోకు అనసూయ భరద్వాజ్ కూడా హోస్టుగా చేస్తోంది. ఇందులో లెజెండరీ సింగర్లు చిత్ర, మనో జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇది శని, ఆదివారం ప్రసారం అవుతోంది.

  అనసూయ పరువు తీసేశాడుగా

  అనసూయ పరువు తీసేశాడుగా


  చిన్న పిల్లల సింగింగ్ టాలెంట్‌ను బయటపెట్టేందుకు తీసుకొచ్చిన 'సూపర్ సింగర్ జూనియర్' షో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇందులో ప్రతివారం ఏదో ఒక విభిన్నమైన థీమ్‌ను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే వారం రెట్రో రౌండ్ (పాత పాటలు)ను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్.. అనసూయ భరద్వాజ్ ఏజ్ గురించి మాట్లాడి పరువు తీసేశాడు.

  నగ్నంగా పడుకుని హీరోయిన్ మసాజ్: షాకిస్తోన్న హాట్ సెల్ఫీ వీడియో

  మీరంటే అప్పుడు పుట్టారు కదా


  'సూపర్ సింగర్ జూనియర్' షోలో భాగంగా అనసూయ 'ఈ పిల్లలను, ఇక్కడున్న వాళ్లను చూస్తుంటే 80, 90లో వాళ్లలా అనిపిస్తున్నారు కదా' అని చెప్పింది. దీనికి సుధీర్ 'ఏమోనండీ.. మీరంటే అప్పుడు పుట్టారు కాబట్టి మీకు తెలుస్తుంది. మాకేమి తెలుసు' అంటూ ఆమె ఏజ్‌పై పంచ్ వేశాడు. దీంతో అనసూయతో పాటు అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

  సుధీర్‌కు స్టాండింగ్ ఒవేషన్‌తో

  సుధీర్‌కు స్టాండింగ్ ఒవేషన్‌తో


  సుడిగాలి సుధీర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు 'సూపర్ సింగర్ జూనియర్' షోలో కూడా అతడు అద్భుతమైన హోస్టింగ్‌తో అలరిస్తున్నాడు. ఇక, తాజాగా వచ్చిన ప్రోమోలో సుధీర్ కొన్ని రసాలను చూపించి మెప్పించాడు. దీంతో హేమచంద్ర స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి అభినందించాడు. మొత్తానికి ఈ ప్రోమో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.

  English summary
  Telugu Actor and Comedian Sudigali Sudheer Recently Entered into Star Maa. He Did Comments About Anasuya Age in Super Singer Junior.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X