For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వనున్న సుధీర్: కమెడియన్ ప్లాన్‌కు షాక్ అవుతోన్న సెలెబ్రిటీలు.!

  By Manoj Kumar P
  |

  తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా పరిచయం అయిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్టు.. చాలా తక్కువ సమయంలోనే గుర్తింపును అందుకున్నాడు. ఈ క్రమంలోనే యూత్‌లో భారీ స్థాయిలో క్రేజ్‌ను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి టెలివిజన్ రంగంలో సత్తా చాటుతోన్న ఈ కమెడియన్.. వరుసగా ఆఫర్లు ఒడిసి పట్టుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

  అన్నింట్లో టాప్‌గా బుల్లితెర ఆల్‌రౌండర్

  అన్నింట్లో టాప్‌గా బుల్లితెర ఆల్‌రౌండర్

  జబర్ధస్త్ షో ద్వారా కమెడియన్‌గా పరిచయం అయ్యాడు సుడిగాలి సుధీర్. వాస్తవానికి అతడు ఈ షోలోకి రాకముందు మెజీషియన్‌గా పని చేశాడు. ఎన్నో స్టేజ్ షోలు, ఈవెంట్లలో మ్యాజిక్‌లు చేశాడు. ఇక, బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కుర్రాడు వెనుదిరిగి చూడలేదు. డ్యాన్స్, సింగింగ్‌తో పాటు మరికొన్ని విద్యలను చూపిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

  సుధీర్ పుస్తకంలో ఆమె పేజీలు చాలా

  సుధీర్ పుస్తకంలో ఆమె పేజీలు చాలా

  సుడిగాలి సుధీర్.. ఆర్టిస్టుగా ఎంతలా పాపులర్ అయ్యాడన్నది పక్కన పెడితే... యాంకర్ రష్మీ గౌతమ్ కారణంగా మాత్రం బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తల వల్ల ఈ జబర్ధస్త్ కమెడియన్ ఊహించని స్థాయిలో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, రష్మీని పెళ్లి చేసుకుంటున్నాడన్న ప్రచారం జరగడం వల్ల చాలా లాభ పడ్డాడు కూడా.

  ప్లేబాయ్‌గా సుధీర్.. యాంకర్లతో ట్రాక్

  ప్లేబాయ్‌గా సుధీర్.. యాంకర్లతో ట్రాక్

  సుదీర్ఘమైన తన కెరీర్‌లో సుడిగాలి సుధీర్ ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అదే సమయంలో పలువురు స్టార్ యాంకర్లతో లవ్ ట్రాకులు నడుపుతున్నాడని కూడా పేరు తెచ్చుకున్నాడు. జబర్ధస్త్‌ స్కిట్లలోనూ అతడికి అదే తరహా పాత్రలు ఇస్తుండడంతో ప్లేబాయ్ అన్న బిరుదును అందుకున్నాడు.

  ఇక్కడ సూపర్ హిట్.. అక్కడ కూడా

  ఇక్కడ సూపర్ హిట్.. అక్కడ కూడా

  బుల్లితెరపై తనదైన శైలి టైమింగ్‌తో కామెడీని పండిస్తూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్‌లోనే కాకుండా మరిన్ని షోలలో అతడు తన మార్క్ చూపిస్తున్నాడు. మరోవైపు, సినిమాల్లోనూ అతడు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే ‘రేసు గుర్రం', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', ‘సర్దార్ గబ్బర్ సింగ్', ‘బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు.

  సుధీర్‌కు రెండు సార్లూ తప్పని నిరాశ

  సుధీర్‌కు రెండు సార్లూ తప్పని నిరాశ

  కమెడియన్‌గా, మెజీషియన్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనలోని ఎన్నో విద్యలను బయటకు తీసుకు వచ్చాడు సుడిగాలి సుధీర్. వీటన్నింటిలోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే, హీరోగా మాత్రం అతడికి నిరాశే ఎదురైంది. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ఆ తర్వాత ‘త్రీమంకీస్' చేశాడు. ఈ రెండూ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

  భయపెట్టేలా రీలాంచ్ అవుతోన్న సుధీర్

  భయపెట్టేలా రీలాంచ్ అవుతోన్న సుధీర్

  హీరోగా అంతగా సక్సెస్ కాలేకపోయిన సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం ‘కాలింగ్ సహస్ర' అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. అరున్ విక్కిరాలా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాతో అతడు రీలాంచ్ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.

  అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వనున్న సుధీర్

  అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వనున్న సుధీర్

  రీలాంచ్ అవుతోన్న సినిమా కావడంతో ‘కాలింగ్ సహస్ర' కోసం సుధీర్ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే ఈ సినిమాలో అతడు సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీని కోసం సుధీర్ ట్రైనర్ సహాయంతో జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడట. అంతేకాదు, ఈ మూవీలో అతడు రెండు డిఫరెంట్ లుక్స్‌లో దర్శనమిస్తాడని టాక్.

  English summary
  Sudigali Sudheer is a Telugu language actor and a stand-up comedian, who is known for his performance in the Telugu-language television channel comedy shows Jabardasth and Extra Jabardasth. He is also a team leader on Dhee Ultimate Dance Show for season 9, season 10, season 11 and season 12.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X