Just In
- 8 min ago
లేడి బాస్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్.. అలా మొదలైన ప్రేమ..
- 23 min ago
స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన నాగశౌర్య: ‘వరుడు కావలెను’ నుంచి సర్ప్రైజింగ్ వీడియో
- 43 min ago
టాలీవుడ్ యంగ్ హీరోతో ఆరియానా రచ్చ: త్వరలోనే భారీ సర్ప్రైజ్.. జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ!
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
Don't Miss!
- News
మంత్రికి వ్యాక్సిన్: తొలిసారిగా రాజకీయ నేతకు: ఆ హోదాలో ఇంజెక్షన్
- Sports
ISL 2020 21: చివరలో విలియమ్స్ గోల్.. మోహన్ బగాన్‌కు మరో విజయం!!
- Finance
PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు
- Lifestyle
Republic Day 2021 : రిపబ్లిక్ డే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసమే...!
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మేనేజర్ కాల్ చేసి అమ్మాయిల గురించి చెప్పాడు.. వెంటనే రెడీ అన్నా: సుధీర్ షాకింగ్ కామెంట్స్
బుల్లితెరపైకి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంతో మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే, వారిలో కొందరు మాత్రమే విశేషమైన ఆదరణను అందుకుంటారు. అలా చాలా తక్కువ సమయంలో తనకు వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుని సక్సెస్ అయ్యాడు సుడిగాలి సుధీర్. కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతడు.. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. ఈ కారణంగానే వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఇలాంటి సమయంలో తాజాగా అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనిపై అతడి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ వివరాలు మీకోసం!

జబర్ధస్త్‌గా కెరీర్.. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు
చాలా రోజుల క్రితం జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు వారికి పరిచయం అయ్యాడు సుడిగాలి సుధీర్. అప్పటి నుంచి తన హవా చూపిస్తూ టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. అంతేకాదు, ఎన్నో స్టేజ్ షోలు, ఈవెంట్లలో మ్యాజిక్‌లు చేశాడు. అలాగే, డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ ఆకట్టుకున్నాడు. ఇలా తనలోని అన్ని విద్యలను చూపిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

యాంకర్‌తో లవ్ ట్రాకుతో మరింత ఫేమస్
సుడిగాలి సుధీర్.. ఆర్టిస్టుగా ఎంతలా పాపులర్ అయ్యాడన్నది పక్కన పెడితే... యాంకర్ రష్మీ గౌతమ్ కారణంగా మాత్రం బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తల వల్ల ఈ జబర్ధస్త్ కమెడియన్ ఊహించని స్థాయిలో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, రష్మీని పెళ్లి చేసుకుంటున్నాడన్న ప్రచారం జరగడం వల్ల చాలా లాభ పడ్డాడు కూడా.

యాంకర్లతో ప్రేమాయణం.. ప్లేబాయ్ పేరు
సుదీర్ఘమైన తన కెరీర్‌లో సుడిగాలి సుధీర్ ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అదే సమయంలో పలువురు స్టార్ యాంకర్లతో లవ్ ట్రాకులు నడుపుతున్నాడని కూడా పేరు తెచ్చుకున్నాడు. జబర్ధస్త్ స్కిట్లలోనూ అతడికి అదే తరహా పాత్రలు ఇస్తుండడంతో ప్లేబాయ్ అన్న బిరుదును అందుకున్నాడు.

ఎన్నో సినిమాలు.. హీరోగా ఫెయిల్యూర్స్
బుల్లితెరపై తనదైన శైలి టైమింగ్‌తో కామెడీని పండిస్తూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లోనూ అడుగెట్టాడు. ఈ క్రమంలోనే ‘రేసు గుర్రం', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', ‘సర్దార్ గబ్బర్ సింగ్', ‘బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇవన్నీ అతడికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, హీరోగా చేసిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి.

సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్
‘ఢీ' డ్యాన్స్ షో 13వ సీజన్ ‘కింగ్ వర్సెస్ క్వీన్స్' కొద్ది రోజుల క్రితం మొదలైన విషయం తెలిసిందే. దీనికి కూడా సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో విడుదలై ట్రెండ్ అవుతోంది. అందులో యాంకర్ ప్రదీప్.. ‘ఈ షో ఎందుకు ఒప్పుకున్నావ్' అని సుధీర్‌ను ప్రశ్నిస్తాడు. దీనికి అతడు ‘అమ్మాయిల కోసమే' అని బదులిస్తాడు.

సుధీర్‌కు చెడ్డ పేరు.. అభిమానుల ఫైర్
ప్రదీప్ అడిగిన దానికి సమాధానంగా.. ‘మేనేజర్ ఫోన్ చేశాడు. అవతల అమ్మాయిలు ఉంటారని చెప్పాడు. దీంతో వెంటనే ఓకే చెప్పేశా' అని చెప్పిన సుధీర్.. అదో రకమైన సైగ చేశాడు. దీంతో అతడిని అమ్మాయిలా పిచ్చోడిలా చూపిస్తున్నారంటూ.. ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇక, హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘సుధీర్ అన్న ఒక్క చాన్స్ అయినా ఇస్తాడేమో అని వచ్చా' అంటాడు.