Don't Miss!
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sudigali Sudheer: హీరోగా హిట్ కొట్టిన తరువాత సుధీర్ బిగ్గెస్ట్ షో.. ఈసారి అంతకుమించి రెమ్యునరేషన్!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపుని అందుకున్న తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకున్న వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు. ఇక అతను కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు ఊహించని స్థాయిలో పెరుగుతోంది. కమెడియన్ గా హోస్ట్ గా అలాగే కథానాయకుడిగా సుధీర్ మెల్లమెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటున్నాడు.
ఇక ఆర్థికంగా కూడా అతను మరింత బలంగా నిలదొక్కుకుంటున్నాడు. ఇటీవల సుధీర్ ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగా ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుని టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టాడు. ఇక ఇప్పుడు అతని టెలివిజన్ హోస్ట్ కోసం ఏ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

రేంజ్ పెరిగింది
సుడిగాలి సుదీర్ మొదట మెజీషియన్ గా స్టేజ్ షోలు చేసుకుంటూ వచ్చాడు. ఇక మరికొన్నాళ్ళకు అతను సినిమాల్లో ఎలాగైనా అవకాశాలు అందుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ మొదట్లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఎప్పుడైతే జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడో అప్పటినుంచి అతని రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. చాలా కాలం పాటు జబర్దస్త్ లోనే రైటర్ నుంచి కమీడియన్ గా కమెడియన్ నుంచి టీం లీడర్ గా గుర్తింపును అందుకున్నాడు.

టెలివిజన్ లో అలాంటి క్రేజ్
సుడిగాలి సుధీర్ మొదట మంచి కమెడియన్ గా క్రేజ్ అందుకున్నాడు. ఇక పలు రియాలిటీ షో లలో యాంకర్స్ లతో అతని కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అవుతూ వచ్చింది. టెలివిజన్ షో టీఆర్పీ పెరగాలంటే సుధీర్ రష్మీ హైలెట్ కావాల్సిందే అనే విధంగా చాలా షోలు వచ్చాయి. వీరిద్దరి మధ్యలో కొన్ని ప్రత్యేకమైన షోలు కూడా అప్పట్లో మంచి టిఆర్పి రేటింగ్స్ ను సొంతం చేసుకున్నాయి.

సినిమాల్లో హీరోగా..
ఇక టెలివిజన్ షోలు సక్సెస్ అయిన తర్వాత మెల్లగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చినా సుధీర్ కొన్ని సినిమాల్లో అయితే డైలాగ్స్ లేకుండానే సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించాడు. ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా కామెడీ రోల్స్ చేసే వరకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఏకంగా అతను కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

గాలోడు బాక్సాఫీస్ హిట్
ఇటీవల సుధీర్ గాలోడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుని పెట్టిన పెట్టుబడికి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ అందించడం విశేషం. అసలు సుధీర్ కు ఈ రేంజ్ లో మార్కెట్ ఉందా అనే విధంగా అతని సినిమా ఏకంగా 7 కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకునేలా చేసింది.

స్టార్ మా సంక్రాంతి షో
ఇక సుడిగాలి సుధీర్ హీరోగా గాలోడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత టెలివిజన్ షోలకు అయితే కొత్త గ్యాప్ ఇచ్చాడు. ఇక మళ్ళీ ఇటువైపు రాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అతను సంక్రాంతికి 'మా సంక్రాంతి పందెం' అనే స్పెషల్ ఎపిసోడ్ తో రాబోతున్నాడు. అది కూడా స్టార్ మా లో అతను మొదటి సారి ఒక షోకు షోకు హోస్ట్ వ్యవహరిస్తూ ఉండడం విశేషం.

సుధీర్.. ఊహించని రెమ్యునరేషన్
అయితే ఈ షో కోసం సుడిగాలి సుదీర్ తన కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. హీరోగా రేంజ్ పెరగడంతో ఇప్పుడు స్టార్ మా నిర్వాహకులు ఎవరు ఇవ్వని స్థాయిలో రెమ్యునరేషన్ చెల్లించినట్లు సమాచారం. సుదీర్ రెమ్యునరేషన్ ఇంతకుముందు ఒక ఎపిసోడ్ కు రెండు లక్షలకు పైగానే ఉండేది ఇక ఇప్పుడు ఈ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ కు అతనికి 5 లక్షల వరకు అందినట్లుగా తెలుస్తోంది. మరి సుదీర్ నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో వస్తాడో చూడాలి.